• ఎంజి కామెట్ ఈవి ఫ్రంట్ left side image
1/1
  • MG Comet EV
    + 59చిత్రాలు
  • MG Comet EV
  • MG Comet EV
    + 4రంగులు
  • MG Comet EV

ఎంజి కామెట్ ఈవి

ఎంజి కామెట్ ఈవి is a 4 సీటర్ electric car. ఎంజి కామెట్ ఈవి Price starts from ₹ 6.99 లక్షలు & top model price goes upto ₹ 9.24 లక్షలు. It offers 5 variants It can be charged in 3.3kw 7h (0-100%) & also has fast charging facility. This model has 2 safety airbags. This model is available in 5 colours.
కారు మార్చండి
221 సమీక్షలుrate & win ₹ 1000
Rs.6.99 - 9.24 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఏప్రిల్ offer
Get benefits of upto ₹ 85,000 on Model Year 2023

ఎంజి కామెట్ ఈవి యొక్క కిలకమైన నిర్ధేశాలు

పరిధి230 km
పవర్41.42 బి హెచ్ పి
బ్యాటరీ కెపాసిటీ17.3 kwh
ఛార్జింగ్ టైం3.3kw 7h (0-100%)
సీటింగ్ సామర్థ్యం4
no. of బాగ్స్2
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం
advanced internet ఫీచర్స్
వెనుక కెమెరా
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

కామెట్ ఈవి తాజా నవీకరణ

MG కామెట్ EV తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: MG కామెట్ EV వేరియంట్ మరియు ఫీచర్ అప్‌డేట్‌లను పొందింది. కామెట్ EV యొక్క వేరియంట్‌లు ఇప్పుడు పేరు మార్చబడ్డాయి, అయితే MG కొన్ని అదనపు ఫీచర్లతో మైక్రో SUV యొక్క కొత్త అగ్ర శ్రేణి వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది.

ధర: కామెట్ EV ధర ఇప్పుడు రూ. 6.99 లక్షల నుండి రూ. 9.14 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా).

వేరియంట్‌లు: ఇది మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్.

రంగులు: ఇది రెండు డ్యూయల్-టోన్ మరియు మూడు మోనోటోన్ పెయింట్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది: యాపిల్ గ్రీన్ విత్ స్టార్రి బ్లాక్, కాండీ వైట్ మరియు స్టార్రి బ్లాక్, అరోరా సిల్వర్, క్యాండీ వైట్ మరియు స్టార్రి బ్లాక్.

రంగులు: ఇది రెండు డ్యూయల్-టోన్ మరియు మూడు మోనోటోన్ పెయింట్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది: యాపిల్ గ్రీన్ విత్ స్టార్రి బ్లాక్, కాండీ వైట్ మరియు స్టార్రి బ్లాక్, అరోరా సిల్వర్, క్యాండీ వైట్ మరియు స్టార్రి బ్లాక్.

సీటింగ్ కెపాసిటీ: ఇది నలుగురు ప్రయాణికులు కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

బ్యాటరీ ప్యాక్ మరియు పరిధి: విడుదలైన స్పెసిఫికేషన్‌ల ప్రకారం, కామెట్ EV 17.3kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది గరిష్టంగా 230 కిమీ పరిధిని అందిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 42PS మరియు 110Nm గల పవర్ టార్క్ లను ఉత్పత్తి చేయగలదు. దీని ఛార్జింగ్ సమయం గురించి మాట్లాడాటానికి వస్తే, 3.3kW ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఏడు గంటల వరకు సమయం పడుతుంది. మధ్య శ్రేణి ఎక్సైట్ మరియు అగ్ర శ్రేణి ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లు ఇప్పుడు 7.4 kW ఛార్జర్ ఎంపికతో వస్తాయి.

  

ఫీచర్‌లు: MG యొక్క అల్ట్రా కాంపాక్ట్ EV 10.25-అంగుళాల డిజిటల్ ఫ్లోటింగ్ డిస్‌ప్లే మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, ఆటో AC మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌లను కలిగి ఉంటుంది. ఇప్పుడు, మైక్రో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో కూడా వస్తుంది.

భద్రత: డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌ వంటి అంశాలు ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయి. కామెట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెనుక డిస్క్ బ్రేక్‌లు మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి అదనపు భద్రతా లక్షణాలను కూడా కలిగి ఉంది.

ప్రత్యర్థులు: కామెట్ EVకి ప్రత్యక్ష ప్రత్యర్థులు ఎవరూ లేరు, ఇది టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3 వంటి వాటికి దగ్గరగా ఉంది.

ఇంకా చదవండి
ఎంజి కామెట్ ఈవి Brochure

బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.

download brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
కామెట్ ఈవి ఎక్స్‌క్లూజివ్(Base Model)17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిRs.6.99 లక్షలు*
కామెట్ ఈవి ఎక్సైట్17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిRs.7.98 లక్షలు*
కామెట్ ఈవి ఎక్సైట్ fc17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిRs.8.34 లక్షలు*
కామెట్ ఈవి ఎగ్జిక్యూటివ్17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిRs.8.88 లక్షలు*
కామెట్ ఈవి ఎక్స్‌క్లూజివ్ fc(Top Model)17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిRs.9.24 లక్షలు*

ఎంజి కామెట్ ఈవి ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

ఎంజి కామెట్ ఈవి సమీక్ష

MG కామెట్ EV సమీక్ష

MG Comet EV

చాలా తరుచుగా ఒక కారును ఎంచుకోవాలంటే ఆ కారు పరిపూర్ణంగా అన్ని అంశాలను కలిగి ఉండాలి అలాగే అల్ రౌండర్ గా ఉండేలా చూస్తాము. అంతేకాకుండా తగినంత పెద్ద బూట్, ఫీచర్లు, సౌకర్యం మరియు అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలనుకుంటాము. ఇవన్నీ కావాలంటే, అది కామెట్ విషయంలో నెరవేరదు. ఇది ఒక కారణం కోసం అందించబడింది అది ఏమిటంటే, ఇటీవల పెరిగిపోతున్న ట్రాఫిక్ లో పెద్ద కారుతో డ్రైవింగ్ చేయడంలో ఉండే ఇబ్బందిని ఎదుర్కోవడానికి అలాగే మరింత సౌకర్యవంతమైన రైడ్ కావాలనుకునే వారి కోసం ఇది ఒక పరిష్కార వాహనంగా ఉంది. ప్రశ్న ఏమిటంటే, ఇది మీ పెద్ద కారు అనుభవంతో సరిపోలుతుందా, ఒకవేళ అయితే మీరు అవసరమైనప్పుడు చిన్న కారుకు మారవచ్చా?

బాహ్య

MG Comet EV Front

కామెట్ లుక్స్ పరంగా ఎలా కనబడుతుందో అనేది మొదటి విషయం. ఎందుకంటే ఇది మందు భాగం చూడటానికి అందంగా ఉండటమే కాకుండా అందరి హృదయాల్ని ఆకట్టుకుంటుంది మరియు లుక్స్ ఖచ్చితంగా ఆ విభాగంలో చాలా హెఫ్ట్‌ను కలిగి ఉంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, ఇది ప్రత్యేకంగా మరియు అందమైనదిగా కనిపిస్తుంది. రహదారిపై, కామెట్ చుట్టూ ఎన్ని కార్లు ఉన్న ఇది అతి చిన్న కారు అవుతుంది. పొడవు మరియు వీల్‌బేస్ 3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్నాయి మరియు ఎత్తు పొడవుగా ఉన్నందున, అది కొంచెం కనిపిస్తుంది…  అవును, కొంచెం వెరైటీగా ఉందా?MG Comet EV Sideఅయితే ఈ పొగడ్తలు అన్నీ కూడా డిజైన్ లో ఉన్న కొలతలే. చాలా మంది వ్యక్తులు తమ కార్లలో కోరుకునే చమత్కారమైన అంశాలు మరియు దాదాపు రూ. 20 లక్షల విలువైన కార్లలో చాలా ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRL బార్, డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్, LED టెయిల్‌ల్యాంప్‌లు మరియు కనెక్ట్ చేయబడిన బ్రేక్ ల్యాంప్ ప్రీమియం అనుభూతికి తగినంత బ్లింగ్‌ను అందిస్తాయి. వీల్ క్యాప్‌ల స్థానంలో అల్లాయ్ వీల్స్ మెరుగ్గా ఉండేవి కానీ దాని కోసం, మీరు కొనుగోలు చేసిన తరువాత చూడవలసి ఉంటుంది.MG Comet EV Rear

ఇది ఎక్కువ జీవనశైలి ఎంపిక అయినందున, MG కారుతో టన్ను అనుకూలీకరణ ఎంపికలను అందిస్తోంది. ఎంచుకోవడానికి 5 పెయింట్ ఎంపికలు మరియు కనీసం 7 స్టిక్కర్ ప్యాక్‌లు ఉన్నాయి. లోపల, మ్యాట్‌లు, యాక్సెంట్‌లు మరియు సీట్ కవర్‌లు ఈ స్టిక్కర్ ప్యాక్‌లకు సరిపోతాయి. కాబట్టి మీరు మీ కామెట్‌ని నిజంగా అనుకూలీకరించవచ్చు. మరియు ఈ అన్ని ఎలిమెంట్‌లతో, అందించబడిన ప్రీమియం ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్‌లకు లుక్స్ సెకండరీగా మారతాయి.

అంతర్గత

MG Comet EV Cabin

ఇక్కడే కామెట్ అతిపెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందించిన అనుభవం మరియు స్థలం పరంగా, మీరు డోరు తెరిచినప్పుడు మీరు ఆశించిన దానికంటే ఎక్కువ అందిస్తుంది. డాష్‌బోర్డ్ సరళమైనది మరియు ప్లాస్టిక్‌ల ఫిట్ మరియు ఫినిషింగ్ అందరిని ఆకట్టుకుంది. డ్యాష్‌బోర్డ్‌కు ఎడమ వైపున సాఫ్ట్ టచ్ ప్యాడ్ ఉంది మరియు మొత్తంగా, వైట్ ప్లాస్టిక్, సిల్వర్ ఫినిషింగ్ మరియు క్రోమ్ యొక్క ముగింపు చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. మాన్యువల్ AC మరియు డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ డయల్స్ కూడా చాలా మృదువైన స్పర్శను కలిగి ఉంటాయి. పరిమాణం కాకుండా, క్యాబిన్ కోసం 15 లక్షల ఖరీదు చేసే కారు కోసం బాగా నియమించబడినట్లు అనిపిస్తుంది.

MG Comet EV Displays

హైలైట్‌లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను రూపొందించే డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. డిస్‌ప్లేలు మంచి గ్రాఫిక్స్‌తో స్ఫుటమైనవి మరియు వివరాల కోసం మేము ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కి మరింత సులభతరం ఇవ్వాలి. మీరు డ్రైవ్ సమాచారాన్ని మాత్రమే మార్చగలరు మరియు దానికి భిన్నమైన థీమ్‌లు లేవు, కారు మోడల్ చాలా వివరంగా ఉంటుంది. అన్ని విభిన్న లైట్లు (పైలట్, హై బీమ్, లో బీమ్), డోర్లు, సూచికలు మరియు బూట్ అజార్ చూపబడ్డాయి మరియు సమాచారం పెద్దగా మరియు పరిశుభ్రంగా ఉంటుంది.

విడ్జెట్‌లతో కస్టమైజ్ చేయగల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉపయోగించడానికి సున్నితంగా ఉంటుంది. అదనంగా, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు బగ్‌లు లేకుండా రన్ అయ్యే ఆపిల్ కార్ ప్లేని పొందుతుంది, ఇది మనం ఇంకా ఏ ఇతర సిస్టమ్‌లోనూ అనుభవించలేదు. సౌండ్ సిస్టమ్ ఆమోదయోగ్యమైనది, కానీ మిగిలిన ప్యాకేజీ వలె ఆకర్షణీయంగా లేదు. ఇతర లక్షణాలలో వన్-టచ్ అప్/డౌన్ (డ్రైవర్), మాన్యువల్ AC, వెనుక కెమెరా, పగలు/రాత్రి IRVM, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVM మరియు ఎలక్ట్రానిక్ బూట్ విడుదలతో కూడిన పవర్ విండోలు ఉన్నాయి. మూడు USB భాగాలు కూడా ఉన్నాయి, రెండు డాష్‌బోర్డ్ క్రింద మరియు ఒకటి IRVM క్రింద డాష్ క్యామ్‌ల కోసం అందించబడ్డాయి.

MG Comet EV Front SeatsMG Comet EV Rear Seats

ముందు సీట్లు కాస్త ఇరుకైనప్పటికీ సౌకర్యవంతంగా ఉంటాయి. 6 అడుగుల వరకు ఉన్న ప్రయాణికులు కూడా హెడ్‌రూమ్ గురించి ఫిర్యాదు చేయరు. ఏదైనా పొడవాటి ప్రయాణికులు కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అలాగే ఇరుకుగా ఉన్నట్టు అనిపించడం ప్రారంభమవుతుంది. అయితే, వెనుక సీట్లు మెరుగ్గా అందించబడ్డాయి. వెనుక సీట్లను యాక్సెస్ చేయడం కొంచెం గ్యాప్‌గా ఉంటుంది, అయితే అక్కడికి చేరుకున్న తర్వాత, మోకాలి మరియు లెగ్‌రూమ్ సగటు-పరిమాణ పెద్దలకు పుష్కలంగా ఉంటాయి. మళ్లీ, 6 అడుగుల ఎత్తు వరకు ఉన్న ప్రయాణీకులు స్థలం గురించి, వెడల్పు గురించి కూడా ఫిర్యాదు చేయరు. అవును, తొడ కింద మద్దతు లేదు కానీ నగర ప్రయాణాలలో, మీరు దానిని కోల్పోరు.

అయితే, మీరు మిస్ అయ్యేది ప్రాక్టికాలిటీ. మీరు డ్యాష్‌బోర్డ్‌లో రెండు కప్‌హోల్డర్‌లు, ల్యాప్‌టాప్‌లను కూడా ఉంచగలిగే పెద్ద డోర్ పాకెట్‌లు మరియు డ్యాష్‌బోర్డ్‌లో ఓపెన్ స్టోరేజీని పొందినప్పటికీ, గ్లోవ్‌బాక్స్ వంటి క్లోజ్డ్ స్పేస్‌లు లేవు. డ్యాష్‌బోర్డ్ కింద రెండు షాపింగ్ బ్యాగ్ హుక్స్‌లు ఉన్నాయి, కానీ అది పెద్ద సెంట్రల్ స్టోరేజ్ ని మిస్ అవుతుంది. ఈ సెంట్రల్ స్టోరేజ్- ఫోన్‌లు, వాలెట్‌లు, బిల్లులు, కేబుల్‌లు మరియు మనం కారులో ఉంచుకునే వాటిని భద్రంగా ఉంచుకోవచ్చు.

భద్రత

MG Comet EV

కామెట్ ABSతో కూడిన EBD, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లతో ప్రామాణికంగా వస్తుంది. ఇది ఇంకా క్రాష్ టెస్ట్‌కు గురికాలేదు.

బూట్ స్పేస్

MG Comet EV Boot Space

దీనికి బూట్ స్పేస్ లేనందున ఈ విభాగాన్ని ఖాళీగా ఉంచవచ్చు. వెనుక సీట్ల వెనుక, మీరు ఛార్జర్ బాక్స్ మరియు పంక్చర్ రిపేర్ కిట్‌లో మాత్రమే స్టోర్ చేయవచ్చు. అయితే, సీట్లను ఫ్లాట్‌గా మడిచినట్లైతే మీరు పెద్ద సూట్‌కేస్‌లను సులభంగా ఉంచడానికి ప్రయాణీకుల స్థలాన్ని ఉపయోగించవచ్చు. సీటు కూడా 50:50కి మూడవబడుతుంది, ఇది ప్రాక్టికాలిటీని జోడిస్తుంది. కాబట్టి షాపింగ్ చేయడానికి తగినంత ఆచరణాత్మకమైనప్పటికీ, విమానాశ్రయం నుండి ఒకరిని పికప్ చేయడం గమ్మత్తైనది.

ప్రదర్శన

స్పెసిఫికేషన్ షీట్‌ను ఒక్కసారి చూడండి, ఇది బోరింగ్ కలిగించే చిన్న EV అని మీరు అనుకుంటారు. 42PS/110Nm యొక్క శక్తి/టార్క్ గురించి గొప్పగా చెప్పుకునే సంఖ్యలు కావు. కానీ దాని చిన్న పరిమాణం కారణంగా, ఈ సంఖ్యలు మాయాజాలం చేస్తాయి. కామెట్ ఆశ్చర్యకరంగా చురుకైనది మరియు డ్రైవ్ చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. 20-40kmph లేదా 60kmph నుండి త్వరిత త్వరణం అత్యంత బలంగా ఉంటుంది. నగరంలో ఓవర్‌టేక్‌లు మరియు ఖాళీలలోకి రావడానికి ప్రయత్నించడం అప్రయత్నంగా జరుగుతుంది. అలాగే, కాంపాక్ట్ సైజు కారణంగా, ఇరుకైన ట్రాఫిక్‌ లలో అధిక భారాన్ని తగ్గిస్తుంది మరియు ఆటో-రిక్షాలను కూడా అసూయపడేలా చేస్తుంది.

పెద్ద విండ్‌స్క్రీన్ మరియు విండోస్ మొత్తం దృశ్యమానతకు కూడా సహాయపడతాయి, ఇది డ్రైవర్‌కు విశ్వాసాన్ని ఇస్తుంది. పార్కింగ్ కూడా సులభమైన వ్యవహారం మరియు ఒక చిన్న పొడవు మరియు టర్నింగ్ సర్కిల్‌తో, మీరు సులభంగా పార్కింగ్ స్థానంలోకి దూరవచ్చు. వెనుక కెమెరా స్పష్టంగా ఉంది మరియు ఆలస్యం లేకుండా పని చేస్తుంది, దీని ఫలితంగా సులభమైన పార్కింగ్ లభించడమే కాదు పార్కింగ్ సమయంలో మంచి అనుభూతిని అందిస్తుంది. మీ తల్లిదండ్రులు ఈ కారును నడపబోతున్నప్పటికీ, పార్కింగ్ స్థలాలను కనుగొనడంలో వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రస్తుతం విక్రయిస్తున్న సిటీ ట్రాఫిక్‌లో నడపడానికి ఇది ఖచ్చితంగా అత్యంత శ్రమలేని కారు అని చెప్పవచ్చు.

మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి -- అవి వరుసగా ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ - వీటికి పెద్దగా తేడా లేదు, అయితే మంచి విషయం  ఏమిటంటే ఎకో మోడ్ కూడా నగరంలో ఉపయోగపడుతుంది. మూడు రీజెన్ మోడ్‌లు కూడా ఉన్నాయి -- లైట్, నార్మల్ మరియు హెవీ, ఇవి తేడాను కలిగిస్తాయి. హెవీ మోడ్‌లో, రీజెన్ ఇంజిన్ బ్రేకింగ్ లాగా అనిపిస్తుంది కానీ మృదువుగా ఉంటుంది. మోటార్ యొక్క ట్యూన్ మరియు ఈ మోడ్‌లు సిటీ డ్రైవ్‌లకు అనుగుణంగా ట్యూన్ చేయబడ్డాయి.

అయితే రెండు సమస్యలు ఉన్నాయి. మొదట, కామెట్ ఖచ్చితంగా సిటీ కారు. దీని అర్థం 60kmph లేదా 80kmph వరకు యాక్సిలరేషన్ ఆమోదయోగ్యమైనది అయితే, అది 105kmph గరిష్ట వేగాన్ని చేరుకోవడానికి పనితీరు తగ్గుతుంది. ఇది హైవేలపై దాని వినియోగాన్ని సమర్థవంతంగా పరిమితం చేస్తుంది. రెండవది, పొడవైన డ్రైవర్లకు డ్రైవింగ్ స్థానం ఇరుకైనది. స్టీరింగ్ ఎత్తుకు మాత్రమే సర్దుబాటు చేయగలదు మరియు డ్యాష్‌బోర్డ్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. దీని కారణంగా, మీరు వీల్ కి దగ్గరగా కూర్చోవలసి ఉంటుంది మరియు ఇది యాక్సిలరేటర్ మరియు బ్రేక్ పెడల్‌లను డ్రైవర్‌కు చాలా దగ్గరగా ఉంచబడతాయి, ఫలితంగా ఇబ్బందికరమైన స్థితి ఏర్పడుతుంది. మీరు 6 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటే, ఇది మిమ్మల్ని మరింత అసౌకర్యానికి గురి చేస్తుంది.

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

MG Comet EV

చిన్న 12-అంగుళాల చక్రాలపై ప్రయాణించినప్పటికీ, కామెట్ నగరంలోని గతుకుల రోడ్లలో పనితీరు అసౌకర్యకంగా ఉంటుంది. అవును, ప్రయాణం పరిమితంగా ఉంది, అందువల్ల క్యాబిన్‌లో గతుకుల అనుభూతి ఉంటుంది, కానీ తగినంత వేగం తగ్గుతాయి మరియు అవి కూడా బాగా కుషన్‌గా ఉంటాయి. మంచి రోడ్లు మరియు స్పీడ్ బ్రేకర్లలో, కామెట్ హ్యాచ్‌బ్యాక్ వలె సౌకర్యవంతంగా ఉంటుంది మరియు వెన్ను సమస్యలతో బాధపడే వృద్ధులను కూడా వదలదు. అయితే గుర్తుంచుకోండి, వెనుక సీటులో కుదుపులు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ప్రయాణీకులతో జాగ్రత్తగా ఉండండి.MG Comet EV

90kmph కంటే ఎక్కువ వేగంతో, కామెట్ కొంచెం మెలితిప్పినట్లు అనిపిస్తుంది. తక్కువ వీల్‌బేస్ కారణంగా, హై-స్పీడ్ లో స్థిరత్వం రాజీపడుతుంది మరియు త్వరిత లేన్ మార్పులు భయానకంగా ఉంటాయి. అయితే, కామెట్ నగర పరిమితులలో నడపబడటానికి ఉద్దేశించబడినందున, మీరు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కోలేరు.

వేరియంట్లు

MG Comet EV

కామెట్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది, దీని దిగువ శ్రేణి వేరియంట్ ధర 7.98 లక్షల నుండి ప్రారంభమవుతుంది. MG అగ్ర వేరియంట్ ధర 10 లక్షలకు దగ్గరగా ఉంటుందని సూచించింది, ఇది అప్రయత్నంగా సిటీ డ్రైవ్ కోసం ఖచ్చితమైన కొనుగోలు గా అందరిని ఆకర్షిస్తుంది.

వెర్డిక్ట్

MG Comet EV

MG కామెట్ కారు మాత్రమే కాదు, కుటుంబం మొత్తం బయటకు వెళ్లేందుకు కొనుగోలు చేయదగిన సరైన కారు. అంతేకాకుండా నగర ప్రయాణాలకు  కూడా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇది అద్భుతమైన కారు అని చెప్పేందుకు కారణం ఏమిటంటే, చిన్న ప్యాకేజీలో విశాలమైన క్యాబిన్ మరియు ఫీచర్ల అనుభవాన్ని అందించడం. అవును, ఇది చిన్న కారు, కానీ నాణ్యత మరియు అనుభవంలో సాధారణ కోతలు లేకుండా మంచి అనుభూతిని అందిస్తుంది. తత్ఫలితంగా, ట్రాఫిక్‌ భాదను తప్పించుకునేందుకు మరియు అనుభవంలో రాజీపడకుండా జీవితంలో తగినంత సౌకర్యాన్ని అందించదగిన నగర వాహనం అని చెప్పవచ్చు. మీ తల్లిదండ్రులు భారీ పరిమాణం కారణంగా పెద్ద SUVని నడపడం ఇష్టపడకపోతే, వారు కామెట్‌ను నడపడానికి ఇష్టపడతారు.  

ఎంజి కామెట్ ఈవి యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • చిన్న పరిమాణంతో, నగర వినియోగానికి ఈ కారు ఆదర్శంగా నిలుస్తుంది.
  • ఇంటీరియర్స్ యొక్క ప్రీమియం లుక్ మరియు అనుభూతి
  • క్లెయిమ్ చేసిన పరిధి 250కిమీ
  • రెండు 10.25 అంగుళాల స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు మరియు కీలెస్ ఎంట్రీ వంటి అద్భుతమైన అంశాలు ఉన్నాయి.
  • నగరంలో డ్రైవింగ్ చేయడం చాలా ఇష్టంగా మరియు అప్రయత్నమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది
  • 4 పెద్దలు సౌకర్యవంతంగా ప్రయాణించగలరు

మనకు నచ్చని విషయాలు

  • వెనుక సీట్లను మడవకుండా బూట్ స్పేస్ ఉండదు
  • ఆఫ్ రోడ్లపై అసౌకర్య రైడ్ అనుభూతిని పొందుతారు
  • హైవే కారు కాదు, కాబట్టి ఆల్‌రౌండర్ కాదు

ఇలాంటి కార్లతో కామెట్ ఈవి సరిపోల్చండి

Car Name
ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్
Rating
221 సమీక్షలు
106 సమీక్షలు
280 సమీక్షలు
749 సమీక్షలు
163 సమీక్షలు
9 సమీక్షలు
341 సమీక్షలు
491 సమీక్షలు
71 సమీక్షలు
823 సమీక్షలు
ఇంధనఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్పెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిడీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్పెట్రోల్పెట్రోల్
Charging Time 3.3KW 7H (0-100%)56 Min-50 kW(10-80%)2.6H-AC-7.2 kW (10-100%)-------
ఎక్స్-షోరూమ్ ధర6.99 - 9.24 లక్ష10.99 - 15.49 లక్ష7.99 - 11.89 లక్ష5.65 - 8.90 లక్ష5.92 - 8.56 లక్ష7.74 - 13.04 లక్ష7.94 - 13.48 లక్ష8.15 - 15.80 లక్ష7.04 - 11.21 లక్ష4.70 - 6.45 లక్ష
బాగ్స్262262-66662
Power41.42 బి హెచ్ పి80.46 - 120.69 బి హెచ్ పి60.34 - 73.75 బి హెచ్ పి72.41 - 84.48 బి హెచ్ పి67.72 - 81.8 బి హెచ్ పి76.43 - 98.69 బి హెచ్ పి81.8 - 118.41 బి హెచ్ పి113.31 - 118.27 బి హెచ్ పి81.8 - 86.76 బి హెచ్ పి67.06 బి హెచ్ పి
Battery Capacity17.3 kWh 25 - 35 kWh19.2 - 24 kWh-------
పరిధి230 km315 - 421 km250 - 315 km19 నుండి 20.09 kmpl16 నుండి 18 kmpl20 నుండి 22.8 kmpl24.2 kmpl17.01 నుండి 24.08 kmpl16 నుండి 20 kmpl21.46 నుండి 22.3 kmpl

ఎంజి కామెట్ ఈవి కార్ వార్తలు & అప్‌డేట్‌లు

  • తాజా వార్తలు

ఎంజి కామెట్ ఈవి వినియోగదారు సమీక్షలు

4.2/5
ఆధారంగా221 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (221)
  • Looks (51)
  • Comfort (72)
  • Mileage (18)
  • Engine (7)
  • Interior (52)
  • Space (33)
  • Price (41)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • Critical
  • A Futuristic Electric Car With Great Performance

    The Tata Nexon EV goes with advanced components and smart development, including touchscreen infotai...ఇంకా చదవండి

    ద్వారా dipti
    On: Apr 18, 2024 | 33 Views
  • MG Comet EV Futuristic Design, Electrifying Performance

    With its exhilarating experience and futuristic looks, the MG Comet EV is revolutionizing the electr...ఇంకా చదవండి

    ద్వారా rajani
    On: Apr 17, 2024 | 109 Views
  • MG Comet Is EV For Daily Use

    I love this model as its electric motor provides silent and smooth ride. The MG Comet EV has a compe...ఇంకా చదవండి

    ద్వారా a chandra sekhar
    On: Apr 15, 2024 | 229 Views
  • Best Car

    This car is a winner all around. With its excellent features, low maintenance costs, and appealing d...ఇంకా చదవండి

    ద్వారా shree n
    On: Apr 14, 2024 | 90 Views
  • MG Comet EV Comet My Way Into The Electric Future

    Leading the expressway into the electric future, the MG Comet EV provides driver like me with a adva...ఇంకా చదవండి

    ద్వారా hemanth
    On: Apr 12, 2024 | 242 Views
  • అన్ని కామెట్ ఈవి సమీక్షలు చూడండి

ఎంజి కామెట్ ఈవి Range

motor మరియు ట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ పరిధి
ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్230 km

ఎంజి కామెట్ ఈవి వీడియోలు

  • MG Comet Detailed Review: Real World Range, Features And Comfort Review
    23:34
    MG Comet Detailed Review: Real World Range, Features And Comfort సమీక్ష
    7 నెలలు ago | 48.8K Views
  • MG Comet EV Vs Tata Tiago EV Vs Citroen eC3 | Price, Range, Features & More |Which Budget EV To Buy?
    5:12
    MG Comet EV Vs Tata Tiago EV Vs Citroen eC3 | Price, Range, Features & More |Which Budget EV To Buy?
    9 నెలలు ago | 23K Views
  • MG Comet: Pros, Cons Features & Should You Buy It?
    4:54
    ఎంజి Comet: Pros, Cons లక్షణాలను & Should యు Buy It?
    10 నెలలు ago | 21K Views
  • MG Comet EV Variants Explained: Pace, Play, And Plush | Price From Rs 7.98 Lakh | Cardekho.com
    8:22
    MG Comet EV Variants Explained: Pace, Play, And Plush | Price From Rs 7.98 Lakh | Cardekho.com
    10 నెలలు ago | 877 Views
  • MG Comet Review: 10 Things you HAVE to know!
    15:38
    ఎంజి Comet Review: 10 Things యు HAVE to know!
    11 నెలలు ago | 76.3K Views

ఎంజి కామెట్ ఈవి రంగులు

  • స్టార్రి బ్లాక్
    స్టార్రి బ్లాక్
  • అరోరా సిల్వర్
    అరోరా సిల్వర్
  • డ్యూయల్ టోన్ ఆపిల్ గ్రీన్ స్టార్రి బ్లాక్
    డ్యూయల్ టోన్ ఆపిల్ గ్రీన్ స్టార్రి బ్లాక్
  • కాండీ వైట్
    కాండీ వైట్
  • డ్యూయల్ టోన్ కాండీ వైట్ స్టార్రి బ్లాక్
    డ్యూయల్ టోన్ కాండీ వైట్ స్టార్రి బ్లాక్

ఎంజి కామెట్ ఈవి చిత్రాలు

  • MG Comet EV Front Left Side Image
  • MG Comet EV Side View (Left)  Image
  • MG Comet EV Rear Left View Image
  • MG Comet EV Front View Image
  • MG Comet EV Rear view Image
  • MG Comet EV Top View Image
  • MG Comet EV Front Fog Lamp Image
  • MG Comet EV Headlight Image
space Image
పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు
Ask QuestionAre you confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What is the top speed of MG 4 EV?

Anmol asked on 10 Apr 2024

As of now there is no official update from the brands end. So, we would request ...

ఇంకా చదవండి
By CarDekho Experts on 10 Apr 2024

What is the body type of MG Comet EV?

Anmol asked on 6 Apr 2024

The MG Comet EV has hatchback body type.

By CarDekho Experts on 6 Apr 2024

What is the body type of MG Comet EV?

Devyani asked on 5 Apr 2024

The MG Comet EV comes under the category of Hatchback Vehicle.

By CarDekho Experts on 5 Apr 2024

Who are the rivals of MG Comet EV?

Anmol asked on 2 Apr 2024

Tata Tiago EV and PMV EaS E are top competitors of MG Comet EV. Strom Motors R3 ...

ఇంకా చదవండి
By CarDekho Experts on 2 Apr 2024

How are the rivals of the MG Comet EV?

Anmol asked on 30 Mar 2024

Tata Tiago EV and PMV EaS E are top competitors of Comet EV.

By CarDekho Experts on 30 Mar 2024
space Image
space Image

కామెట్ ఈవి భారతదేశం లో ధర

సిటీఆన్-రోడ్ ధర
బెంగుళూర్Rs. 7.46 - 9.79 లక్షలు
ముంబైRs. 7.29 - 9.62 లక్షలు
పూనేRs. 7.44 - 9.77 లక్షలు
హైదరాబాద్Rs. 8.24 - 10.81 లక్షలు
చెన్నైRs. 7.51 - 9.88 లక్షలు
అహ్మదాబాద్Rs. 7.29 - 9.62 లక్షలు
లక్నోRs. 7.29 - 9.62 లక్షలు
జైపూర్Rs. 7.29 - 9.62 లక్షలు
పాట్నాRs. 7.29 - 9.62 లక్షలు
చండీఘర్Rs. 7.48 - 9.84 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ ఎంజి కార్లు

Popular హాచ్బ్యాక్ Cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి

పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు

  • ట్రెండింగ్‌లో ఉంది
  • రాబోయేవి
వీక్షించండి ఏప్రిల్ offer
Found what యు were looking for?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience