• English
  • Login / Register

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో విడుదల కానున్న Tata కార్లు ఇవే

టాటా నెక్సన్ కోసం rohit ద్వారా ఫిబ్రవరి 01, 2024 06:50 pm సవరించబడింది

  • 75 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ ఈవెంట్‌లో, కంపెనీ ఎనిమిది మోడళ్లను ప్రదర్శించనున్నారు, ఇందులో మూడు కొత్త మోడళ్లు ఉంటాయి.

Tata Motors at Bharat Mobility Expo

దేశంలో మొట్టమొదటి ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2024 ఫిబ్రవరి 1 నుండి 3 వరకు జరగనుంది. ఈ ఎక్స్‌పోలో టాటా మోటార్స్ కూడా పాల్గొంటుందని, ఈ ఈవెంట్ లో 8 కార్లను ప్రదర్శించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఆ 8 మోడల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

టాటా నెక్సాన్ CNG

Tata Nexon CNG

టాటా ఇప్పటికే CNG కార్ల రంగంలో ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, ఈ విభాగంలో రెండవ అతిపెద్ద కంపెనీగా మారింది. గత సంవత్సరం, కంపెనీ పంచ్ మరియు ఆల్ట్రోజ్ లకు CNG ఎంపికను జోడించిన తరువాత, ఇప్పుడు టాటా మోటార్స్ ఈ ఇంధన ఎంపికలో ఫేస్‌లిఫ్ట్ నెక్సాన్ ను కూడా ప్రవేశపెట్టనున్నారు. టాటా SUV యొక్క 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (120 PS/ 170 Nm) తో CNG కిట్ ను అందిస్తుంది. దీని పవర్ అవుట్ పుట్ కాస్త తక్కువగా ఉంటుంది. టాటా నెక్సాన్ CNG మాన్యువల్ మరియు AMT ట్రాన్స్మిషన్ ఎంపికలను అందిస్తుంది.

టాటా సఫారీ డార్క్ కాన్సెప్ట్

Tata Safari Dark

అక్టోబర్ 2023 లో, ఫేస్‌లిఫ్ట్ టాటా సఫారీ కొత్త డిజైన్ మరియు అనేక ఆధునిక ఫీచర్లతో విడుదల అయ్యింది. ఆ సమయంలో, కంపెనీ ఈ మూడు వరుసల SUV యొక్క డార్క్ మోడల్ ను కూడా ప్రవేశపెట్టింది, ఇది అల్లాయ్ వీల్స్, గ్రిల్, క్యాబిన్ థీమ్ మరియు అప్ హోల్ స్టరీపై బ్లాక్ కలర్ ను పొందుతుంది మరియు ఎక్స్టీరియర్ లో దీనికి 'డార్క్' బ్యాడ్జింగ్ ఇవ్వబడింది. ఇప్పుడు టాటా మోటార్స్ కొత్త డార్క్ మోడల్ ను తీసుకురానున్నట్లు, దీనిని ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇది దాని రెడ్ డార్క్ ఎడిషన్ లో ప్రదర్శించబడుతుందని మేము ఆశిస్తున్నాము, దీనిలో రెడ్ హైలైట్స్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ లో చూడవచ్చు.

ఈ కాన్సెప్ట్ తో ప్రామాణిక సఫారీ యొక్క క్రాస్-సెక్షన్ డిస్ ప్లేను కూడా ప్రదర్శించనున్నారు, ఇది దాని బలమైన భద్రతను హైలైట్ చేస్తుంది. భారత్ NCAP పరీక్షించిన మొదటి కార్లలో ఇది ఒకటి మరియు ఇది 5-స్టార్ భద్రతా రేటింగ్ ను సాధించింది.

టాటా కర్వ్ కాన్సెప్ట్

Tata Curvv

టాటా SUV లైనప్ లో 'కర్వ్' పేరుతో పిలువబడే కొత్త మోడల్ ను జోడించబోతున్నారు. ఈ ఈవెంట్ లో ఈ కారుని కూడా ప్రదర్శించనున్నారు. కంపెనీ మొదట తమ ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చేయనున్నారు, తరువాత దాని ICE పవర్డ్ వెర్షన్ ను విడుదల చేయనున్నారు. కర్వ్ EV ఒకటి కంటే ఎక్కువ బ్యాటరీ ప్యాక్ మరియు పూర్తి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా సర్టిఫైడ్ పరిధితో లభిస్తుందని భావిస్తున్నారు. కర్వ్ ICE పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలలో లభించే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ కాన్సెప్ట్

Tata Altroz Racer

టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారును తొలిసారిగా 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించారు. ఇది సాధారణ ఆల్ట్రోజ్ యొక్క స్పోర్టీ వేరియంట్. దీని ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ కు అనేక కాస్మోటిక్ నవీకరణలు జరిగాయి అలాగే కొత్త నెక్సాన్ నుండి దీనికి అనేక ఫీచర్లు ఇవ్వవచ్చు. పవర్ట్రెయిన్లో పెద్ద మార్పులు ఏవీ ఆశించబడనప్పటికీ, నెక్సాన్ యొక్క 120 PS టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను చేర్చడం మాత్రమే గుర్తించదగిన వ్యత్యాసం.

టాటా పంచ్ EV

Tata Punch EV

టాటా మోటార్స్ ఇటీవలే పంచ్ EVని భారతదేశంలో విడుదల చేశారు. యాక్టీ.EV ప్లాట్ఫామ్పై నిర్మించబడిన కంపెనీ యొక్క తొలి ఎలక్ట్రిక్ కారు ఇది. దీని డిజైన్ కొత్తగా ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ల ఎంపికను కలిగి ఉంది మరియు పూర్తి ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. టాటా కొత్త ఎలక్ట్రిక్ కారును భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు.

ఇది కూడా చదవండి: టాటా పంచ్ EV లాంగ్ రేంజ్ vs టాటా నెక్సాన్ EV మిడ్ రేంజ్: ఏ ఎలక్ట్రిక్ SUV కొనాలి?

టాటా నెక్సాన్ EV డార్క్

Tata Nexon

భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా పెవిలియన్ లో నెక్సాన్ EV డార్క్ కూడా కనిపించనుంది. కంపెనీ మొదట దీనిని ప్రీ-ఫేస్‌లిఫ్ట్ నెక్సాన్ EV మ్యాక్స్ పై నిర్మించారు, ఈసారి ఈ ఫేస్‌లిఫ్ట్ నెక్సాన్ ఎలక్ట్రిక్ ఆధారంగా ఉంటుంది. దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ లో అనేక డిజైన్ నవీకరణలు చేయబడతాయి. డార్క్ ఎడిషన్ లో బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఆల్ బ్లాక్ క్యాబిన్ థీమ్ ఉంటాయి. దీని ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ మరియు ఫీచర్లలో మార్పులకు అవకాశం లేదు.

టాటా హారియర్ EV కాన్సెప్ట్

Tata Harrier EV

టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ కూడా 2024 లో విడుదల కానుంది, దీనిని మొదటిసారిగా ఆటో ఎక్స్‌పో 2023 లో కాన్సెప్ట్ వెర్షన్ గా ప్రదర్శించారు. హారియర్ EV కాన్సెప్ట్ ను భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. ఇది అనేక పవర్ట్రెయిన్ ఎంపికలను పొందగలదు మరియు దాని సర్టిఫైడ్ పరిధి దాని పూర్తి ఛార్జ్లో 500 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇది కాకుండా, టాటా యొక్క ఎలక్ట్రిక్ కార్లలో చాలా కాలంగా లేని ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎంపిక కూడా ఉంటుంది.

కాబట్టి ఇవన్నీ భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా ప్రదర్శించనున్న కార్లు. ఈ కార్లలో దేనిని చూడటానికి మీరు ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు? కామెంట్స్ లో తెలియజేయండి.

మరింత చదవండి: నెక్సాన్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata నెక్సన్

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience