ఈ దీపావళికి అత్యధిక డిస్కౌంట్లు అందిస్తున్న 7 SUVలు
మహీంద్రా ఎక్స్యువి400 ఈవి కోసం rohit ద్వారా నవం బర్ 09, 2023 06:20 pm ప్రచురించబడింది
- 433 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రూ.3.5 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తూ మహీంద్రా XUV400 మొదటి స్థానంలో ఉండగా, రూ.2 లక్షల డిస్కౌంట్ తో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ రెండవ స్థానంలో ఉంది.
మీరు ఈ దీపావళికి కొత్త SUV కారును కొనుగోలు చేయాలనుకుంటే, ఈ పండుగ సీజన్లో వివిధ పరిమాణాలు, ధరలు అలాగే అనేక రకాల SUV కార్లపై మీరు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు. ఈ దీపావళికి అత్యధిక డిస్కౌంట్లు అందిస్తున్న ఏడు SUV కార్లు ఏమిటో తెలుసుకుందాం.
మహీంద్రా XUV400
-
మహీంద్రా XUV400 యొక్క భద్రతా ఫీచర్లను ఆగస్టు 2023 లో నవీకరించారు, దీని కారణంగా ఈ వాహనం ధర రూ .20,000 వరకు పెరిగింది. నవంబర్లో XUV400 ప్రీ-అప్డేటెడ్ మోడల్ యొక్క మిగిలిన స్టాక్ పై రూ .3.5 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు, అదే సమయంలో దాని నవీకరిచబడిన యూనిట్ పై రూ .3 లక్షల డిస్కౌంట్లను అందిస్తోంది.
-
ఈ డిస్కౌంట్ ఆఫర్లను లాంగ్ రేంజ్ EL వేరియంట్లపై మాత్రమే వర్తించగా, ఎంట్రీ లెవల్ వేరియంట్లపై రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నారు.
-
ఆఫర్లలో భాగంగా మహీంద్రా ఈ కారుతో ఉచిత ఇన్సూరెన్స్, 5 సంవత్సరాల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది.
-
మహీంద్రా ఎలక్ట్రిక్ SUV కారు ధర రూ.15.99 లక్షల నుంచి రూ.19.39 లక్షల మధ్యలో ఉంది.
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్
-
ఈ దీపావళికి, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుపై రూ .2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.
-
గత కొన్ని నెలలుగా, హ్యుందాయ్ యొక్క ఈ ఎలక్ట్రిక్ SUV కారుపై లక్ష రూపాయలకు పైగా ప్రయోజనాలను పొందవచ్చు, అయితే సెప్టెంబర్ నుండి, ఈ కారుపై రూ .2 లక్షల వరకు తగ్గింపు ఉంటుంది.
-
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు ధర రూ .23.84 లక్షల నుండి రూ .24.03 లక్షల మధ్య ఉంది.
ఇది కూడా చదవండి: 490 కిలోమీటర్ల రేంజ్తో సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్
సిట్రోయెన్ C5 ఎయిర్ క్రాస్
-
నవంబర్లో సిట్రోయెన్ C5 ఎయిర్క్రాస్ కారుపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది.
-
2023 ప్రారంభం నుండి గత కొన్ని నెలల వరకు, ఈ SUV కారు లక్ష రూపాయలకు పైగా డిస్కౌంట్ ఆఫర్లతో అందుబాటులో ఉంది, కానీ ఇప్పుడు ఈ కారుపై డిస్కౌంట్ ఆఫర్లు రూ .2 లక్షలకు పెరిగాయి.
-
మీ సమీప సిట్రోయెన్ డీలర్షిప్ను సందర్శించడం ద్వారా C5 ఎయిర్క్రాస్ SUVపై ఏవైనా అదనపు ఆఫర్లు లేదా ప్రయోజనాలు అందించబడుతున్నాయో లేదో కూడా మీరు తెలుసుకోవచ్చు.
-
ఈ ప్రీమియం SUV కారు ధర రూ.36.91 లక్షల నుంచి రూ.37.67 లక్షల మధ్యలో ఉంది.
వోక్స్వాగన్ టిగువాన్
-
ఈ నెలలో, వోక్స్వాగన్ టిగువాన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు మొత్తం రూ .1.85 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
-
ఈ ప్రీమియం మిడ్-సైజ్ SUV టెస్ట్ డ్రైవింగ్ మరియు బుకింగ్ పై మీకు అనేక అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
-
భారతదేశంలో వోక్స్వాగన్ ఫ్లాగ్ షిప్ SUV కారు ధర రూ.35.17 లక్షలు.
MG గ్లోస్టర్
-
MG గ్లోస్టర్ పై రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు.
-
ఈ ఫుల్ సైజ్ SUV కారులో డీజిల్ ఇంజన్ ఎంపిక మాత్రమే ఉంది. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది, ఇందులో బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కూడా ఉంది.
-
MG గ్లోస్టర్ ధర రూ.38.80 లక్షల నుంచి రూ.43.87 లక్షల మధ్యలో ఉంది.
ఇది కూడా చదవండి: CarDekho ద్వారా మీ పెండింగ్ చలాన్లను చెల్లించండి
MG ఆస్టర్
-
ఈ దీపావళికి MG ఆస్టర్ కారు కొనుగోలుపై మొత్తం రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
-
ఈ కాంపాక్ట్ SUVలో రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. ఈ కారు ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కూడా ఉంది.
-
ఆస్టర్ SUV ధర రూ.10.82 లక్షల నుంచి రూ.18.69 లక్షల మధ్యలో ఉంది.
ఇది కూడా చదవండి: ఇప్పుడే బుక్ చేసుకుని ఈ దీపావళికి ఈ 5 SUVలను ఇంటికి తీసుకువెళ్ళండి!
స్కోడా కుషాక్
-
నవంబర్ లో, స్కోడా కుషాక్ SUVపై మొత్తం రూ .1.5 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
-
అక్టోబర్ ప్రారంభంలో, స్కోడా పండుగ ఆఫర్లో భాగంగా ఈ SUV ప్రారంభ ధరను రూ .70,000 తగ్గించింది.
-
స్కోడా ఈ కారుతో 4 సంవత్సరాల లేదా 60,000 కిలోమీటర్ల కాంప్లిమెంటరీ స్టాండర్డ్ మెయింటెనెన్స్ ప్యాకేజీని కూడా అందిస్తోంది.
గమనిక: ఈ డిస్కౌంట్ ఆఫర్లన్నీ లొకేషన్ మరియు ఎంచుకున్న వేరియంట్ను బట్టి మారవచ్చు. ఆఫర్ ల గురించి సరైన సమాచారం కొరకు, సమీప డీలర్ షిప్ ని సందర్శించాలని సూచిస్తాం.
ఇది కూడా చూడండి: అక్టోబర్ 2023 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ బ్రాండ్లు: మారుతి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా మరియు మరిన్ని
ఈ దీపావళికి మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఏ SUVని ఇంటికి తీసుకెళ్లనున్నారు? పైన పేర్కొన్న మోడళ్లలో ఒక కారుని ఎంచుకున్నారా? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ
మరింత చదవండి : మహీంద్రా XUV400 EV ఆటోమేటిక్
0 out of 0 found this helpful