Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2024లో ఈ 5 SUVలను విడుదల చేయనున్న Mahindra

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి కోసం shreyash ద్వారా డిసెంబర్ 22, 2023 12:26 pm ప్రచురించబడింది

ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్న కొన్ని మహీంద్రా SUVలు 2024 సంవత్సరంలో విడుదల కానున్నాయి. వీటిలో థార్ 5-డోర్ మరియు XUV.e8 ఉన్నాయి

2023లో మహీంద్రా కేవలం ఒకే ఒక కొత్త SUV, XUV400 EVని విడుదల చేసింది. మిగిలిన సంవత్సరం అంతా, ఈ కారు తయారీదారు XUV700 మరియు స్కార్పియో N వంటి ప్రసిద్ధి చెందిన తన మోడళ్ళ పెండింగ్ ఆర్డర్ బ్యాక్ؚలాగ్ؚను పరిష్కరించడానికి, తన SUVల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడం పైనే దృష్టి పెట్టింది. ప్రస్తుతం 2024లో, మహీంద్రా 5 కొత్త SUVలను విడుదల చేయనున్నది, వీటిలో ఫేస్ؚలిఫ్ట్ؚలు మరియు INGLO ప్లాట్ఫారం పై ఆధారపడిన మొదటి కొత్త EV కూడా ఉన్నాయి. 2024లో విడుదల కానున్న కొత్త మహీంద్రా SUV లైన్అప్ؚను ఇప్పుడు పరిశీలిద్దాం.

మహీంద్రా థార్ 5-డోర్

అంచనా విడుదల: 2024 రెండవ భాగంలో

అంచనా ధర: రూ 15 లక్షల నుండి ప్రారంభం

మహీంద్రా థార్ 5-డోర్, 2024లో విడుదల కానున్న, మరింతగా ఎదురుచూస్తున్న SUVలలో ఒకటి. ఈ SUV టెస్ట్ వాహనం అనేక సార్లు కనిపించింది, సన్ؚరూఫ్ؚతో స్థిరమైన మెటల్ రూఫ్ మరియు LED లైటింగ్ సెట్అప్ వంటి అనేక వివరాలను వెల్లడించింది. పొడిగించిన మహీంద్రా థార్ؚలో, 3-డోర్ؚల వర్షన్ؚలో ఉన్న అవే ఇంజన్ ఎంపికలు ఉండవచ్చు. అవి 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్, అయితే మరింత మెరుగైన పనితీరుతో రావచ్చు.రెండు ఇంజన్ؚలలో మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలు రెండూ లభిస్తాయి. మహీంద్రా SUV రేర్-వీల్-డ్రైవ్ (RWD) మరియు ఫోర్-వీల్-డ్రైవ్ (4WD) కాన్ఫిగరేషన్ؚలు రెండిటిలో రావచ్చు.

ఇది కూడా చూడండి: 2024లో ఏడు కార్లను విడుదల చేస్తున్నట్లు నిర్ధారించిన టాటా

మహీంద్రా XUV300 ఫేస్ؚలిఫ్ట్

అంచనా విడుదల: మార్చి 2024

అంచనా ధర: రూ. 9 లక్షల నుండి ప్రారంభం

ఎంతో కాలం నుండి అప్ؚడేట్ కోసం ఎదురుచూస్తున్న మహీంద్రా వాహనాలలో మహీంద్రా XUV300 సబ్-4m SUV ఒకటి. నవీకరించిన సబ్ؚకాంపాక్ట్ మహీంద్రా సరికొత్త ముందు భాగంతో రానుంది, దీని రహస్య చిత్రాలలో చూసినట్లు ఇందులో కొత్త LED DRLలు మరియు హెడ్ؚలైట్ؚలు, కొత్త అలాయ్ వీల్స్ మరియు కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్ సెట్అప్ ఉంటాయి.

నవీకరించిన మహీంద్రా XUV300 క్యాబిన్ؚలో ఫ్లోటింగ్ టచ్ؚస్క్రీన్ సిస్టమ్ కూడా ఉండవచ్చు. ఈ విభాగంలోని పోటీదారులు హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సోనెట్ؚలతో పోటీగా ADASను కూడా అందించవచ్చు. రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ؚలతో సహా, ప్రస్తుత SUV వర్షన్ؚలో ఉన్న అవే పవర్ؚట్రెయిన్ ఎంపికలను నిలుపుకునే అవకాశం ఉంది – ఇవి 1.2-లీటర్ MPFi (మల్టీ-పాయింట్ ఫ్యూయల్ ఇంజక్షన్) మరియు 1.2-లీటర్ T-Gdi (గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్) – మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్.

మహీంద్రా XUV400 EV ఫేస్ؚలిఫ్ట్

అంచనా విడుదల: ఏప్రిల్ 2024

అంచనా ధర: రూ 16 లక్షలు

మహీంద్రా XUV400 EV నవీకరణను పొందనుంది, తన తోటి ఇంటర్నల్ కంబుషన్ ఇంజన్ (ICE) వాహనం XUV300కి చేసిన అప్ؚడేట్ؚలు ఇందులో ప్రతిబింబిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ SUVలో రీడిజైన్ చేసిన ఫ్రంట్ ఫేసియా, అప్ؚడేటెడ్ అలాయ్ వీల్స్ మరియు మరిన్ని క్యాబిన్ సౌకర్యాలను కలిగి ఉంటుంది అని అంచనా. నవీకరించిన XUV400 EV అవే బ్యాటరీ ప్యాక్ ఎంపికలు 34.5 kWh మరియు 39.4 kWHలను నిలుపుకునే అవకాశం ఉంది – ఇది ఎక్కువ డ్రైవింగ్ పరిధితో రావచ్చు.

ఇది కూడా చూడండి: మొదటి భారత్ NCAP ఔటింగ్ؚలో 5-స్టార్ రేటింగ్ؚను పొందిన టాటా హ్యారియర్ సఫారి

మహీంద్రా XUV.e8

అంచనా విడుదల: డిసెంబర్ 2024

అంచనా ధర: రూ. 35 లక్షల నుండి ప్రారంభం

2024లో విడుదల కానున్న ఎంతగానో ఎదురుచూస్తున్న మరొక సరికొత్త ఎలక్ట్రిక్ SUV మహీంద్రా XUV.e8. ఇది మహీంద్రా XUV700 ప్రధానంగా పూర్తి ఎలక్ట్రిక్ వేరియెంట్, ప్రారంభంలో ఇది 2022లో ప్రీ-ప్రొడక్షన్ కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించబడింది. ఈ ఎలక్ట్రిక్ SUV, మహీంద్రా INGLO ప్లాట్ؚఫారం పైన నిర్మించబడింది, 60kWh మరియు 80kWh బ్యాటరీ సామర్ధ్యాల కోసం రూపొందించబడింది, 175 kW వరకు ఫాస్ట్-ఛార్జింగ్ సామర్ధ్యాలను కలిగి ఉంటుంది. ఈ భారీ బ్యాటరీ, 450 km వరకు WLTP-సర్టిఫైడ్ పరిధిని క్లెయిమ్ చేస్తుంది.

ఇది రేర్-వీల్-డ్రైవ్ (RWD) మరియు ఆల్-వీల్-డ్రైవ్ (AWD) ఎంపికలు రెండిటినీ అందిస్తుంది, ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ؚలు RWD మోడల్ؚలకు 285 PS వరకు మరియు AWD మోడల్ؚలకు 394 PS వరకు అందిస్తాయి.

మహీంద్రా బొలెరో నియో ప్లస్

అంచనా విడుదల: జనవరి 2024

అంచనా ధర: రూ. 10 లక్షల నుండి ప్రారంభం

ఎట్టకేలకు మహీంద్రా బొలెరో నియో ఎక్స్ؚటెండెడ్ వర్షన్ؚను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీని పేరు చివర ‘ప్లస్’ అని ఉంటుంది, 9 మంది వ్యక్తులు కూర్చోగల సీటింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. బొలెరో నియో ప్లస్ ఇంతకు ముందు అందుబాటులో ఉన్నTUV300 ప్లస్ؚను కొత్త పేరుతో తిరిగి తీసుకు వస్తోంది, ఇది బొలెరో నియో రూపంలోనే ఉంటుంది. ఇందులో 130 PS మరియు 300 Nm విడుదల చేసే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉండవచ్చు, ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడవచ్చు. బొలెరో నియో ప్లస్, మహీంద్రా స్కార్పియో Nకు ప్రత్యామ్నాయం అవుతుంది.

2024లో మహీంద్ర విడుదల చేస్తుందని ఆశిస్తున్న 5 SUVలు ఇవే. ఈ భారతీయ కారు తయారీదారు రాబోయే సంవత్సరాలలో XUV మరియు BE బ్రాండ్ؚల క్రింద అనేక EVలను పరిచయం చేసే ప్రణాళికలను కలిగి ఉంది, వీటిలో థార్ ఎలక్ట్రిక్ వర్షన్ కూడా ఉంది. మీరు ఏ మహీంద్రా SUV కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు? క్రింది కామెంట్ల సెక్షన్ؚలో మీ అభిప్రాయాలను తెలియచేయండి.

ఇక్కడ మరింత చదవండి: XUV 400 EV ఆటోమ్యాటిక్

Share via

Write your Comment on Mahindra ఎక్స్యువి400 ఈవి

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర