• English
  • Login / Register

భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ భద్రతా రేటింగ్ పొందిన Tata Harrier & Safari

టాటా హారియర్ కోసం ansh ద్వారా డిసెంబర్ 22, 2023 05:37 pm ప్రచురించబడింది

  • 1.2K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇంతకుముందు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో కూడా ఈ రెండు టాటా SUVలు 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందాయి.

Tata Harrier & Safari Crash Test

  • రెండు SUVలు వయోజనుల భద్రత కోసం 32 పాయింట్లకు గాను 30.08 పాయింట్లు సాధించాయి.

  • పిల్లల భద్రత కోసం 49కి 44.54 పాయింట్లు సాధించాయి.

  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పాదచారుల భద్రతకు సంబంధించిన వివరాలను నివేదికలో పొందుపర్చలేదు.

  • టాటా హారియర్ ధర రూ.15.49 లక్షల నుండి రూ.26.44 లక్షలు మరియు సఫారీ ధర రూ.16.19 లక్షల నుండి రూ.27.34 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్ ను అక్టోబర్ 1న ప్రారంభించారు. ఇది భారతదేశానికి చెందిన క్రాష్ టెస్ట్ ఏజెన్సీ. అనేక కార్ల తయారీదారులు తమ కార్లను క్రాష్-టెస్ట్ మరియు రేటింగ్ కోసం ఇచ్చారు. ప్రవేశపెట్టిన 3 నెలల తరువాత భారత్ NCAP కార్లను క్రాష్ టెస్టింగ్ ప్రారంభించారు, మొదట టాటా హారియర్ మరియు టాటా సఫారీ ఫలితాలను విడుదల చేశారు, ఇందులో రెండింటికీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు SUVలు గతంలో గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ రేటింగ్ పొందాయి. భారత్ NCAP రెండు SUVల అడ్వెంచర్ + వేరియంట్ల కోసం క్రాష్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షలో వాటి ప్రదర్శన ఎలా ఉందో, మరింత తెలుసుకోండి:

అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ (AOP)

Tata Harrier & Safari: Adult Occupant Protection

వయోజన ప్రయాణీకుల భద్రత పరంగా, ఈ రెండు SUVలు ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్ లో 16 పాయింట్లకు గాను 14.08 పాయింట్లు మరియు సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ లో 16 పాయింట్లకు 16 పాయింట్లు సాధించాయి. హారియర్ మరియు సఫారీ రెండూ వయోజన ప్రయాణీకుల భద్రత పరంగా 5-స్టార్ రేటింగ్ పొందాయి.

ఫ్రంట్ ఇంపాక్ట్

ఆ తర్వాత జరిగిన క్రాష్ టెస్ట్ లో డ్రైవర్ తల, మెడ, పెల్విస్, తొడలు, పాదాలు మరియు ఎడమ షిన్‌కి మంచి రక్షణ లభించింది. డోర్ దగ్గర కుడి కాలుకు తగిన రక్షణ లభించగా, ఛాతీ దగ్గర రక్షణ అంతంత మాత్రంగానే ఉంది. ఫ్రంట్ ప్యాసింజర్ శరీర భాగాలన్నింటికీ మంచి రక్షణ లభించింది.

సైడ్ ఇంపాక్ట్

హారియర్ మరియు సఫారీ రెండింటిలో, డ్రైవర్ తల, ఛాతీ, మొండెం మరియు తుంటిపై మంచి రక్షణ లభించింది. ఈ క్రాష్ టెస్ట్ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో జరిగింది.

సైడ్ పోల్ ఇంపాక్ట్

సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ గంటకు 29 కిలోమీటర్ల వేగంతో జరిగింది. ఈ పరీక్ష ఫలితాలు కూడా సైడ్ ఇంపాక్ట్ పరీక్ష మాదిరిగానే ఉన్నాయి. డ్రైవర్ తల, ఛాతీ, మొండెం మరియు తుంటికి మంచి రక్షణ లభించింది.

చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ (COP)

Tata Harrier & Safari Crash Test

హారియర్ మరియు సఫారీ చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ టెస్ట్ లలో మంచి స్కోరు సాధించాయి. ఈ రెండు SUVలలో రెండవ వరుసలో ISOFIX యాంకర్లు ఉన్నాయి. ఈ పరీక్షలో, చైల్డ్ సీటు వెనుక వైపు ఇన్ స్టాల్ చేయబడింది, ఆ  వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

డైనమిక్ స్కోరు: 23.54/24

CRS ఇన్‌స్టాలేషన్ స్కోరు: 12/12

వాహన అస్సెస్స్మెంట్ స్కోరు: 9/13

18 నెలల చిన్నారి రక్షణ

18 నెలల చిన్నారికి రక్షణ కల్పించడం కోసం డమ్మీని ఇన్స్టాల్ చేసి పరీక్షించినప్పుడు, హారియర్ మరియు సఫారీ రెండిటికీ 12 కు 11.54 పాయింట్లు వచ్చాయి.

3 సంవత్సరాల చిన్నారి రక్షణ

మూడేళ్ల చిన్నారి డమ్మీని ఇన్ స్టాల్ చేసి పరీక్షించినప్పుడు రెండు SUVలకు 12కు 12 పాయింట్లు వచ్చాయి.

ఇది కూడా చదవండి: త్వరలోనే విడుదల కానున్న టాటా పంచ్ లో ప్రామాణికంగా 6 ఎయిర్ బ్యాగులు 

GNCAP నివేదిక మాదిరిగా కాకుండా, భారత్ GNCAP యొక్క క్రాష్ టెస్ట్ ఫలితాలు పిల్లల తల, మెడ మరియు ఛాతీ భద్రత గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించవు.

భద్రతా పరికరాలు

Tata Harrier & Safari Crash Test

టాటా హారియర్ మరియు సఫారీ రెండింటిలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఆప్షనల్ మోకాలి ఎయిర్ బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్ రిమైండర్, EBDతో ABS మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. టాప్-స్పెక్ వేరియంట్లలో లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 2024లో విడుదల కానున్న 7 కొత్త టాటా కార్లు

అనేక ఇతర కొత్త కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ లలో చూసినట్లుగా ఎలక్ట్రానిక్ భద్రతా ఫీచర్ల యొక్క ఫలితాలు మరియు పనితీరును వివరించడంలో BNCAP నివేదికలు వివరణాత్మకంగా లేవు. BNCAP నివేదికలో SUVలలో ESC ప్రామాణికంగా అందించబడుతోందని మరియు- AIS-100 ప్రకారం పాదచారుల రక్షణను కూడా జాబితా చేస్తుందని పేర్కొన్నప్పటికీ- ఆ పరీక్షల్లో SUVలు ఎలా పనిచేశాయనే దానిపై ఎటువంటి వివరాలను అందించలేదు.

ఈ రేటింగ్స్ ఏ వేరియంట్లకు వర్తిస్తాయి?

Tata Harrier & Safari Crash Test

హారియర్ మరియు సఫారీ యొక్క మిడ్-వేరియంట్లను భారత్ NCAP క్రాష్ పరీక్షించినప్పటికీ, 5-స్టార్ భద్రతా రేటింగ్ స్మార్ట్ మాన్యువల్ నుండి ఫియర్లెస్ + డార్క్ ఆటోమేటిక్ వరకు మరియు 7-సీటర్ స్మార్ట్ మాన్యువల్ నుండి 7-సీటర్ స్మార్ట్ మాన్యువల్ నుండి సఫారీ యొక్క 7-సీటర్ + డార్క్ ఆటోమేటిక్ వరకు అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.

ధర & ప్రత్యర్థులు

Tata Harrier & Tata Safari

టాటా హారియర్ ధర రూ.15.49 లక్షల నుండి రూ.26.44 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది మహీంద్రా ఎక్స్యూవి 700, MG హెక్టర్ మరియు జీప్ కంపాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. టాటా సఫారీ ప్రారంభ ధర రూ.16.19 లక్షలు మరియు దాని టాప్ మోడల్ ధర రూ.27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది MG హెక్టర్ ప్లస్,  హ్యుందాయ్ అల్కాజార్ మరియు మహీంద్రా XUV700లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

మీరు ఏ ఇతర కార్ల BNCAP భద్రతా రేటింగ్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు? కింద కామెంట్స్ లో తెలియజేయండి.

మరింత చదవండి : హారియర్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata హారియర్

1 వ్యాఖ్య
1
A
anjan ghosh
Dec 21, 2023, 3:58:06 PM

Govt. should ban 0 Star or 1 Star vehicles in India?

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    explore similar కార్లు

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience