Maruti Brezzaతో పోలిస్తే కొత్త Tata Nexon అదనంగా పొందిన 5 ఫీచర్‌ల వివరాలు
సెప్టెంబర్ 07, 2023 01:29 pm ansh ద్వారా ప్రచురించబడింది
- 39 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్‌లు ప్రీ-ఫేస్ؚలిఫ్ట్ నెక్సాన్ؚలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
నవీకరించిన టాటా నెక్సాన్‌ను ఆవిష్కరించారు మరియు దీని ఫీచర్‌లను వివరంగా వెల్లడించారు. టాటా నెక్సాన్ؚకు గట్టి పోటీని అందించే వాహనాలలో మారుతి బ్రెజ్జా ఒకటి, ఈ రెండు వాహనాలు వేరువేరు సమయాలలో, తమ విభాగాలలో అత్యధికంగా అమ్ముడైన వాహనాలుగా నిలిచాయి. వీటిలో రెండవది అనేక కొత్త ఫీచర్‌లు మరియు మెరుగుదలలతో 2022లో నవీకరించబడింది. ప్రస్తుతం, నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉంది. మారుతి SUVతో పోలిస్తే ఇందులో ఎక్కువగా ఏమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
భారీ టచ్ؚస్క్రీన్
హ్యారియర్ మరియు సఫారీలలో ఉండే 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ؚను నవీకరించిన నెక్సాన్ పొందింది. ఈ కొత్త డిస్ప్లే సన్నని ఫార్మ్ ఫ్యాక్టర్ؚతో వస్తుంది మరియు వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేలకు మద్దతు ఇస్తుంది. బ్రెజ్జాలో వైర్ؚలెస్ కనెక్టివిటీ కూడా ఉంది, ఇది 9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ؚؚతో మాత్రమే వస్తుంది.
పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే
బ్రెజ్జాతో పోలిస్తే, కొత్త నెక్సాన్ 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో ఆధిక్యతను కొనసాగుతుంది. ఈ యూనిట్ టైర్ ప్రెజర్, మీడియా, డ్రైవ్ ఇన్ఫర్మేషన్ మరియు కంపాస్ؚతో సహా పూర్తి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఇందులో నావిగేషన్ؚ కోసం పూర్తి డిస్ప్లేని కూడా ఉపయోగించవచ్చు, ఈ ఫీచర్ ఇంతకు ముందు లగ్జరీ విభాగానికి మాత్రమే పరిమితమైంది. మరొక వైపు బ్రెజ్జా అనలాగ్ డయల్స్ మధ్య కేవలం TFT రంగు డిస్ప్లేతో మాత్రమే వస్తుంది.
ఇది కూడా చదవండి: నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్‌ను రేపు పరిచయం చేయనున్న టాటా: ఇప్పటి వరకు తెలిసిన విషయాలు
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
రెండు SUVల టాప్ వేరియెంట్ؚలు లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీని పొందినాయి, కొత్త నెక్సాన్ ముందు సీట్‌లు వెంటిలేషన్ ఫంక్షన్ؚను పొందాయి. ఈ ఫీచర్‌ను టాటా SUV ప్రీ-ఫేస్ؚలిఫ్ట్ వర్షన్ؚలో కూడా అందించారు మరియు దీన్ని కొత్త వెర్షన్‌లో కూడా కొనసాగించారు.
స్వచ్చమైన వాయువు
కొత్త నెక్సాన్ؚలో వచ్చే మరొక మెరుగైన ఫీచర్ PM2.5 ఎయిర్ ఫిల్టర్ మరియు ప్యూరిఫయ్యర్ ఇది బ్రెజ్జాలో అందుబాటులో లేదు. వాయు నాణ్యత స్థాయిని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పై చూడవచ్చు.
ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ వేరియెంట్-వారీ పవర్ؚట్రెయిన్ؚలు మరియు రంగు ఎంపికలను పరిశీలించండి
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
రెండు వాహనాలు అనేక భద్రతా ఫీచర్‌లను కలిగి ఉన్నాయి ఇందులో 6 ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS మరియు 360-డిగ్రీల కెమెరా కూడా ఉన్నాయి. బ్రెజ్జాలో అందుబాటులో లేని ఫీచర్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS). నెక్సాన్ؚలో ఈ ఫీచర్ కూడా ఉంది మరియు ప్రతి టైర్ ప్రెజర్ వివరాలను డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే పై చూడవచ్చు.
బోనస్: వాయిస్-ఆధారిత సన్ؚరూఫ్
SUVలలో ప్రస్తుతం సాధారణంగా వస్తున్న ఫీచర్ సన్ؚరూఫ్, ఈ రెండు కార్‌లు సింగిల్-పేన్ యూనిట్ؚతో అందిస్తున్నారు. కానీ బ్రెజ్జాతో పోలిస్తే నెక్సాన్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, దీన్ని వాయిస్ కమాండ్‌తో కూడా ఆపరేట్ చేయవచ్చు, బటన్ నొక్కకుండా వాయిస్‌తో సన్ؚరూఫ్ؚను తెరవవచ్చు. ఇది డ్రైవర్ ధ్యాసను స్టీరింగ్ వీల్ పై నిలిచేలా చేస్తుంది తద్వారా అనుకులమైనది మరియు వెనుక ప్రయాణీకులకు కూడా దీని పై నియంత్రణను అందిస్తుంది.
విడుదల & పోటీదారులు
టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ సెప్టెంబర్ 14 తేదీన విడుదల కానుంది మరియు దీని ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుంది. ఇది మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV300, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ؚతో పోటీని కొనసాగిస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT