• English
  • Login / Register

Tata Nexon Facelift వేరియెంట్-వారీ పవర్ؚట్రెయిన్ؚలు మరియు రంగుల ఎంపికల వివరాలు

టాటా నెక్సన్ కోసం tarun ద్వారా సెప్టెంబర్ 06, 2023 04:51 pm ప్రచురించబడింది

  • 35 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

పాత వేరియెంట్ పేర్ల విధానాన్ని విడిచిపెట్టి, ఫేస్ؚలిఫ్ట్ నెక్సాన్ వేరియంట్‌లకు స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్ؚలెస్ పేర్లతో విడుదల చేయనున్నారు

Tata Nexon Facelift

  • ఫేస్ؚలిఫ్ట్ నెక్సాన్‌ను మునపటి 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚలతో అందిస్తున్నారు. 

  • పెట్రోల్ ఇంజన్ؚను 6-స్పీడ్ AMT మరియు 7-స్పీడ్ DCTతో పాటు 5-మరియు 6-స్పీడ్‌ల మాన్యువల్ؚతో ఎంచుకోవచ్చు. 

  • టాప్ నుండి రెండవ వేరియంట్ అయిన క్రియేటివ్ దాదాపుగా అన్నీ పవర్ؚట్రెయిన్ మరియు ట్రాన్స్ؚమిషన్ కాంబినేషన్ؚలతో వస్తుంది.

  • డ్యూయల్-టోన్ రంగుల ఎంపికతో పాటుగా ఆరు రంగుల నుండి వీటిని ఎంచుకోవచ్చు.

  • ధరలు సుమారుగా రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా.

సెప్టెంబర్ 14న మార్కెట్ؚలోకి విడుదలకు ముందుగానే నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ వివరాలను టాటా వెల్లడించింది, కేవలం ధరలును మాత్రం వెల్లడించలేదు. లోపల మరియు వెలుపల సరికొత్త స్టైలింగ్‌తో అనేక ఇతర ఫీచర్‌లను కూడా పొందుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న పవర్ؚట్రెయిన్ؚల సెట్ؚను కొనసాగిస్తుంది, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి: 

ఇంజన్

1.2-లీటర్ టర్బో-పెట్రోల్

1.5-లీటర్ డీజిల్ ఇంజన్

పవర్

120PS

115PS

టార్క్

170Nm

250Nm

ట్రాన్స్ؚమిషన్‌లు

5-MT, 6-MT, 6-AMT, మరియు 7-DCT

6-MT మరియు 6-AMT

Tata Nexon facelift cabin

కొత్త నెక్సాన్ؚను నాలుగు విస్తృత వేరియెంట్ؚలలో ఎంచుకోవచ్చు – స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్ؚలెస్. మీరు ఎంచుకోగలిగిన వేరియెంట్-వారీ పవర్ؚట్రెయిన్ؚలు ఇక్కడ అందించబడ్డాయి: 

 

స్మార్ట్ 

ప్యూర్

క్రియేటివ్

ఫియర్ؚలెస్

1.2-లీటర్ టర్బో-పెట్రోల్ 5MT

☑️

1.2-లీటర్ టర్బో-పెట్రోల్ 6MT

☑️

☑️

☑️

1.2-లీటర్ టర్బో-పెట్రోల్ 6AMT

☑️

1.2-లీటర్ టర్బో-పెట్రోల్ 7DCT

☑️

☑️

1.5-లీటర్ డీజిల్ 6MT

☑️

☑️

☑️

1.5-లీటర్ డీజిల్ 6AMT

☑️

☑️

  • బేస్ స్మార్ట్ వేరియెంట్ కేవలం పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే లభిస్తుంది, కేవలం ఇది మాత్రమే 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడింది. 

  • బేస్ వేరియంట్ నుండి రెండవది అయిన ప్యూర్ వేరియెంట్‌లో ప్రస్తుతానికి ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌ను అందించడం లేదు, కానీ ఈ వేరియెంట్ నుండి, డీజిల్ ఇంజన్ మరియు రెండిటికీ 6-స్పీడ్ మాన్యువల్ స్టిక్ؚను పొందుతారు.

  • క్రియేటివ్ వేరియెంట్ అత్యంత బహుముఖమైనది, ఎందుకంటే ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT మరియు 7-స్పీడ్ DCT ఎంపికతో పెట్రోల్ ఇంజన్ؚను పొందుతుంది. డీజిల్ మోటార్ؚను మాన్యువల్ మరియు AMT ట్రాన్స్ؚమిషన్ؚలతో అందిస్తున్నారు.

  • టాప్-ఎండ్ వేరియెంట్‌ను పెట్రోల్-AMT ఎంపికలో అందించడం లేదు, ఇతర ట్రాన్స్ؚమిషన్‌లు అన్నిటినీ కొనసాగిస్తుంది.

Tata Nexon facelift 10.25-inch touchscreen

ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ؚలో అందిస్తున్న 10 కొత్త ఫీచర్‌లు

టాటా, నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ؚను ఆరు రంగు ఎంపికలలో అందిస్తుంది, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • ఫియర్ؚలెస్ పర్పుల్

  • క్రియేటివ్ ఓషన్

  • ప్యూర్ గ్రే

  • ఫ్లేమ్ రెడ్

  • డేటోనా గ్రే

  • ప్రిస్టైన్ వైట్

Tata Nexon Facelift

పైన పేర్కొన్న రంగుల కోసం వేరియెంట్-వారీ ఎంపికలు క్రింద వివరించబడ్డాయి:

వేరియెంట్ؚలు

స్మార్ట్

ప్యూర్

క్రియేటివ్

ఫియర్ؚలెస్ 

ప్రిస్టైన్ వైట్

✔️

✔️

✔️

✔️, నలుపు రూఫ్‌తో డ్యూయల్ –టోన్  

డేటోనా గ్రే

✔️

✔️

✔️, తెలుపు రూఫ్‌తో డ్యూయల్ –టోన్  

✔️, నలుపు రూఫ్‌తో డ్యూయల్ –టోన్  

ఫ్లేమ్ రెడ్

✔️

✔️

✔️, తెలుపు రూఫ్‌తో డ్యూయల్ –టోన్  

✔️, నలుపు రూఫ్‌తో డ్యూయల్ –టోన్  

ప్యూర్ గ్రే

✔️

క్రియేటివ్

ఓషన్

✔️

ఫియర్ؚలెస్ 

ఊదా రంగు 

✔️, నలుపు రూఫ్‌తో డ్యూయల్ –టోన్  

కొత్త నెక్సాన్ వేరియెంట్ؚల పేర్లను కలిగి ఉండే మూడు రంగులు, ఆ వేరియెంట్ؚలకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటాయి, ఇతర మూడు రంగులు లైన్అప్ అంతటా అందుబాటులో ఉన్నాయి. క్రియేటివ్ వేరియెంట్ؚల కోసం టాటా డ్యూయల్-టోన్ తెలుపు రంగు రూఫ్ؚను అందిస్తోంది, అయితే టాప్-స్పెక్ ఫియర్ؚలెస్ వేరియెంట్ؚల కోసం బ్లాక్-కాంట్రాస్ట్ రూఫ్ ఉంటుంది. 

నవీకరించిన నెక్సాన్ ధరలు సుమారు రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా. ఇది కియా సోనెట్, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది. 

ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ AMT

was this article helpful ?

Write your Comment on Tata నెక్సన్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience