Nexon EV ఫేస్ؚలిఫ్ట్‌ను రేపే పరిచయం చేయనున్న టాటా: ఇప్పటి వరకు తెలిసిన విషయాలు

టాటా నెక్సాన్ ఈవీ కోసం tarun ద్వారా సెప్టెంబర్ 07, 2023 01:17 pm ప్రచురించబడింది

  • 35 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్‌ అప్ؚడేట్ؚలు లుక్ మరియు ఫీచర్‌లకు మాత్రమే పరిమితం కావచ్చు, కానీ పవర్ؚట్రెయిన్‌లలో కొన్ని మార్పులను కూడా ఆశించవచ్చు

Tata Nexon EV Facelift

నవీకరించిన టాటా నెక్సాన్ ఆవిష్కరణ తరువాత, టాటా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ రానుంది, ఇది రేపు ప్రదర్శించబడుతుంది. నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ అనేక రహస్య చిత్రాలు కనిపించినప్పటికి, దీని ఎలక్ట్రిక్ వర్షన్ గురించి ప్రస్తుతం మరింత సమాచారం లేదు. అయితే, ఇటీవల విడుదలైన కొన్ని టీజర్‌లలో, దీని ఎక్స్ؚటీరియర్ ప్రొఫైల్ؚలో అందిస్తున్న కొన్ని మార్పులను చూడవచ్చు. 

కాబట్టి, ఆవిష్కరణకు ముందు, ఆశించగలిగిన మార్పులను ఇక్కడ అందించబడ్డాయి:

కొత్త పేరు

టాటా తన ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని రీబ్రాండింగ్ చేసింది, ఇప్పటి నుండి విడుదల అయ్యే అన్నీ మోడల్‌ల పేరు చివరన “.ev” కలిగి ఉండవచ్చు. కాబట్టి, ఈ సబ్‌కాంపాక్ట్ SUV ప్రస్తుతం “నెక్సాన్.ev” అని పిలవబడుతుంది. 

కొత్త స్టైలింగ్

Tata Nexon EV Facelift

ఇది కొత్త స్టైలింగ్ؚతో వస్తుంది, మునపటి వర్షన్‌తో పోలిస్తే మరింత భిన్నంగా కనిపిస్తుంది, అయితే నవీకరించిన నెక్సాన్ؚకు సారూప్యంగా ఉంది. సరికొత్త కనెక్టెడ్ LED DRLతో EV మూసివేసినట్లు కనిపించే గ్రిల్ؚను టీజర్‌లో చూడవచ్చు. 

స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెట్అప్ మరియు రీడిజైన్ చేసిన బంపర్, నవీకరించిన నెక్సాన్ؚలో ఉన్నట్లుగానే కనిపించాయి. ఫేస్ؚలిఫ్ట్ؚలో భాగంగా కొత్త అలాయ్ వీల్స్‌ను కూడా చూడవచ్చు. వెనుక వైపు, వెల్కమ్ లైట్ ఫంక్షన్ؚతో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంపులు మరియు సవరించిన బంపర్ డిజైన్ؚను చూడవచ్చు. 

ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ భిన్నమైన క్యాబిన్ థీమ్ؚలను పరిశీలించండి

సవరించిన ఇంటీరియర్

2023 Tata Nexon cabin

నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ పొందినట్లుగానే, దిని EV వేరియెంట్ కూడా క్యాబిన్ లోపల పూర్తి నవీకరణను పొందనుంది. ఇది నవీకరించిన సీట్ అప్ؚహోల్ؚస్ట్రీؚతో కొత్త ఇంటీరియర్ రంగుతో మరియు కొత్త 2-స్పోక్‌ల స్టీరింగ్ వీల్‌తో రావచ్చు. అంతేకాకుండా, ICE-పవర్డ్ వర్షన్ నుండి దీన్ని ప్రత్యేకంగా నిలిచేలా చేసే కొన్ని EV-ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్ؚలను కూడా ఆశించవచ్చు.

కొత్త ఫీచర్‌లు

2023 Tata Nexon 360-degree camera

టచ్-ఆధారిత AC కంట్రోల్ ప్యానెల్ؚ, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, కో-డ్రైవర్ సీట్ కోసం హైట్ అడ్జస్ట్ؚమెంట్ మరియు 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి కొత్త ఫీచర్‌లు దీన్ని మరింత ప్రీమియం ఆఫరింగ్ؚగా చేస్తున్నాయి. నెక్సాన్ EV మాక్స్ డార్క్ ఎడిషన్ ఇప్పటికే 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ؚను కలిగి ఉంది, ఇది ఇతర వేరియెంట్ؚలలో కూడా కొనసాగుతుంది. 

భద్రత విషయంలో అన్ని వేరియెంట్‌లలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికంగా అందించవచ్చు. ఇవే కాకుండా, నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ 360-డిగ్రీల కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్ మరియు ముందు పార్కింగ్ సెన్సార్‌లను పొందుతుంది. 

ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ٴలో అందించే 10 కొత్త ఫీచర్‌లు 

అప్ؚడేట్ చేసిన పవర్ؚట్రెయిన్ؚలు

ప్రస్తుతానికి, నెక్సాన్ EV ప్రైమ్ 30.2kWh బ్యాటరీ ప్యాక్ؚతో లభిస్తుంది, ఇది 312 కిలోమీటర్‌ల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. మ్యాక్స్ 40.5kWh భారీ బ్యాటరీ ప్యాక్ؚతో అందించబడుతుంది, ఇది 453 కిలోమీటర్‌ల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. 

ప్రస్తుతానికి ఎటువంటి పవర్ؚట్రెయిన్ అప్ؚడేట్‌ల వివరాలు తెలియవు, కానీ మరింత ఎక్కువ పరిధి లేదా అధిక ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యాలతో మరింత ఎక్కువ పనితీరును ఆశించవచ్చు.

అంచనా ధరలు 

నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత ధరల కంటే కొంత ఎక్కువ ధరను కలిగి ఉంటుంది, ఇవి రూ.14.49 లక్షల నుండి రూ.19.54 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. ఇది మహీంద్రా XUV400 EV వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది. 

ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా నెక్సన్ EV

Read Full News

explore మరిన్ని on టాటా నెక్సాన్ ఈవీ

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience