• login / register

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మళ్లీ మా కంట పడింది, ఆల్ట్రోజ్‌ లో ఉండేలాంటి ఫ్రంట్ ప్రొఫైల్ ను పొందుతుంది

ప్రచురించబడుట పైన oct 05, 2019 09:59 am ద్వారా rohit for టాటా టియాగో 2019-2020

  • 60 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

తయారీదారుల యొక్క ప్రణాళికలను పరిగణలోనికి తీసుకొని చూస్తే BS6 ఎరాలో చిన్న డీజిల్ కార్లను నిలిపివేయడానికి టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ పెట్రోల్ తో మాత్రమే అందించే అవకాశం ఉంది  

  •  టియాగో యొక్క ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మ్యూల్ లడఖ్‌ లో కనిపించింది.
  •  రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్ రాబోయే ఆల్ట్రోజ్ నుండి ఇన్స్పిరేషన్ పొందినట్టు తెలుస్తుంది.   
  •  రిఫ్రెష్ చేసిన టాటా హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ తో మాత్రమే అందించే అవకాశం ఉంది.
  •  క్విడ్ మరియు మారుతి ఎస్-ప్రెస్సో లో ఉండేటటువంటి కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుందని ఆశిస్తున్నాము.
  •  టియాగో ఫేస్‌లిఫ్ట్ వాగన్ఆర్, సెలెరియో మరియు సాంట్రో వంటి వాటికి ప్రత్యర్థి అవుతుంది.
  •  ఇది 2020 ప్రారంభంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నాము.

టాటా  టియాగో మొట్టమొదటిసారిగా 2016 లో ప్రారంభించబడింది, గత రెండు సంవత్సరాలుగా అనేక నవీకరణలు, ప్రత్యేక ఎడిషన్ లు, కొత్త భద్రతా లక్షణాలతో పాటు కొత్త టాప్-స్పెక్ వేరియంట్‌ను పొందింది. ఇప్పుడు, ఇది నవీకరణకు ఉంది మరియు ఇది మళ్లీ పరీక్షించబడుతుందని మేము గుర్తించాము. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ 2020 ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నాము.  

Tata Tiago Facelift Spied Again, Gets Altroz Like Front Profile

ముందు భాగంలో చూస్తే, టియాగో ఫేస్ లిఫ్ట్ రాబోయే టాటా ఆల్ట్రోజ్ నుండి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. ఎయిర్ డ్యామ్ డిజైన్ చేసిన విధానం ఆల్ట్రోజ్ మాదిరిగానే ఉంటుంది. నోస్ భాగం మునుపటి కంటే పాయింటియర్ గా ఉంది మరియు గ్రిల్ కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. టాప్-స్పెక్ వేరియంట్లు మునుపటిలా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను అందిస్తాయని ఆశిస్తున్నాము. డే టైం LED లు కార్డుల్లో కూడా ఉంటాయని భావిస్తున్నారు. ముందు ప్రొఫైల్‌తో పోలిస్తే, వెనుక భాగం ఇప్పటికే ఉన్న మోడల్ లాగా కనిపిస్తుంది. బంపర్‌కు కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.        

ఇవి కూడా చూడండి: టాటా యొక్క రాబోయే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ మరోసారి మా కంటపడింది, ఇంటీరియర్ స్పష్టంగా చూడడం జరిగింది  

టియాగో ఫేస్ లిఫ్ట్ కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని కలిగి ఉంటుందని భావిస్తున్నాము. ఈ సెటప్ మేము ఇప్పటికే రెనాల్ట్ ట్రైబర్ మరియు క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో చూసినట్లుగా కనిపిస్తుంది. ఇది లోపలి భాగంలో అతిపెద్ద మార్పు అవుతుంది. మొత్తం లేఅవుట్ అయితే మేము ఊహించినట్టుగా మారదు.  

ఇవి కూడా చూడండి: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ క్విడ్ లాంటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో మా కంటపడింది

Tata Tiago Facelift Spied Again, Gets Altroz Like Front Profile

హుడ్ కింద, టియాగో ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత కారులో మాదిరిగానే అదే 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ ద్వారా శక్తినివ్వగలదని భావిస్తున్నారు. ఇది 85Ps గరిష్ట శక్తిని మరియు 114Nm  పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా పెట్రోల్ మోటారు అప్‌గ్రేడ్ అవుతుందని భావిస్తున్నప్పటికీ, బిఎస్ 6 ఉద్గార నిబంధనలను అమలు చేసిన తర్వాత చిన్న డీజిల్ కార్లను అమ్మదలుచుకోలేదని టాటా ఇప్పటికే ప్రకటించినందున ప్రస్తుత 1.05-లీటర్ డీజిల్ యూనిట్ ఇబ్బందులని ఎదుర్కోకోక తప్పదు.     

టియాగో ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ సాంట్రో, మారుతి వాగన్ ఆర్ మరియు మారుతి సెలెరియోలకు ప్రత్యర్థిగా కొనసాగుతుంది. 

ఫొటో తీయండి బహుమతులు గెలుచుకోండి: 

మీ దగ్గర రహస్యంగా తీయబడిన చిత్రాలు ఉన్నయా? అయితే వాటిని  editorial@girnarsoft.com కి పంపండి మరియు మంచి విలువైన బహుమతులు లేదా వోచర్స్ గెలుచుకోండి.

మరింత చదవండి: టాటా టియాగో ఆన్ రోడ్ ప్రైజ్

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన టాటా టియాగో 2019-2020

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?