కొన్ని డీలర్ؚషిప్ؚల వద్ద ప్రారంభమైన Tata Nexon ఫేస్ؚలిఫ్ట్ ఆఫ్ؚలైన్ బుకింగ్ؚలు
టాటా నెక్సన్ కోసం rohit ద్వారా సెప్టెంబర్ 01, 2023 02:30 pm ప్రచురించబడింది
- 107 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నవీకరించిన టాటా నెక్సాన్ విక్రయాలు సెప్టెంబర్ 14 నుండి ప్రారంభం కానున్నాయి, దీనితో పాటుగా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ విక్రయాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది
-
2020 ప్రారంభంలో మొదటి నవీకరణ తరువాత, టాటా ఈ సబ్‌కాంపాక్ట్ SUVకి ప్రస్తుతం రెండవ భారీ నవీకరణను అందిస్తుంది.
-
ఎక్స్ؚటీరియర్ మార్పులలో కొత్త ముందు భాగం, సరికొత్త అలాయ్ వీల్స్ మరియు కనెక్టెడ్ టెయిల్‌లైట్లు ఉన్నాయి.
-
లోపలి వైపు, కర్వ్ؚలో ఉన్నటుగా 2-స్పోక్ؚల స్టీరింగ్ వీల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు డ్యూయల్-టోన్ థీమ్ ఉన్నాయి.
-
కొత్త నెక్సాన్ֶలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్, 360-డిగ్రీల కెమెరా మరియు ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు ఉన్నాయి.
-
పెట్రోల్ మరియు డీజిల్ పవర్ؚట్రెయిన్ؚలు రెండిటిలో అందించనున్నారు; టాటా కొత్త 1.2-లీటర్ టర్బో యూనిట్ؚను కూడా పొందవచ్చు.
-
ధరలు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చు.
టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ త్వరలో విడుదల కానుంది (సెప్టెంబర్ 14). కప్పబడకుండా లోపల మరియు వెలుపల డిజైన్ మార్పులను చూపించే అనేక రహస్య చిత్రాలు కెమెరాకు చిక్కాయి. కొన్ని డీలర్ షిప్ؚలు నవీకరించిన ఈ SUV ఆఫ్ؚలైన్ బుకింగ్ؚలను అంగీకరిస్తున్నారు అని తెలుసుకున్నాము. 2020 మొదట్లో జరిగిన నవీకరణ తరువాత, ఈ టాటా SUVకి ఇది రెండవ భారీ నవీకరణ. ఇప్పటి వరకు మనకు తెలిసిన వాటి శీఘ్ర పునశ్చరణ ఈ క్రింద చూద్దాం:
ఎక్స్ؚటీరియర్ؚకు భారీ నవీకరణలు
ఇది ప్రస్తుతం మరింత పదునైన ముందు భాగంతో వస్తుంది, నాజూకైన గ్రిల్ మరియు మార్పులు చేసిన LED DRLలు ఉన్నాయి. కొత్త నెక్సాన్ బంపర్ వంగి ఉన్నట్లుగా కనిపించే డిజైన్ؚతో వస్తుంది, నవీకరించ LED హెడ్ؚలైట్ల పోర్ؚట్రెయిట్ ఓరియెంటేషన్ మరియు క్రింది సగంలో అలంకరణలు ఇందులో కలిగి ఉంటాయి.
కొత్త అలాయ్ వీల్స్‌ను మినహాయించి, SUV పక్క వైపు ఎటువంటి మార్పులు లేవు. ఈ మార్పులు అన్నిటినీ టాటా నెక్సాన్ EVలో కూడా అందించే అవకాశం ఉంది. ఇది EVకి ప్రత్యేకమైన నీలం హైలైట్‌లు మరియు మూసిన ప్యానెల్స్ؚతో వస్తుంది.
కొత్త నెక్సాన్ వెనుక ప్రొఫైల్ నాజూకైన మరియు కనెక్టెడ్ LED టెయిల్ؚలైట్ సెట్అప్, ‘నెక్సాన్’ బ్యాడ్జింగ్ కలిగిన నవీకరించిన టెయిల్ؚగేట్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్ؚతో దృఢమైన బంపర్ؚను కలిగి ఉంది. పొడవైన మరియు మరింత స్పష్టంగా కనిపిస్తున్న వెనుక రిఫ్లెక్టర్‌లను కలిగి ఉండే సవరించిన వెనుక బంపర్ؚను కూడా ఇది పొందుతుంది.
ఇది కూడా చదవండి: ప్రస్తుతం టాటా తన ఎలక్ట్రిక్ విభాగానికి టాటా.ev అనే గుర్తింపును ఇచ్చింది
లోపలి వైపు కూడా కొత్త మార్పులు
నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ؚను కొత్త డ్యాష్ؚబోర్డ్ లేఅవుట్ మరియు కర్వ్ؚలో ఉన్నట్లు 2-స్పోక్ؚల ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ؚతో టాటా అందిస్తుంది (మెరిసే టాటా లోగో ఉంటుంది). క్యాబిన్ؚకు చేసిన ఇతర మార్పులలో సీట్ؚలు, డ్యాష్ؚబోర్డ్ మరియు స్టీరింగ్ؚవీల్ పై ఊదారంగులో డ్యూయల్-టోన్ థీమ్ ఉన్నాయి.
కొత్త ఫీచర్‌లతో నిండి ఉంది
నవీకరించిన టాటా నెక్సాన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు 360-డిగ్రీల కెమెరా రూపంలో కొన్ని కొత్త ఎక్విప్మెంట్ؚలను పొందవచ్చు. కొత్త మోడల్‌లో ఉన్న ఇతర ఫీచర్‌లలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ డిస్ప్లే మరియు వైర్ؚలెస్ యాపిల్ కార్ؚప్లే మరియు అండ్రాయిడ్ ఆటో, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి.
ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు మరియు బహుశా ఎంచుకున్న అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS) ఉండవచ్చు.
దీన్ని ఏది నడుపుతుంది?
ప్రస్తుత మోడల్‌లో ఉన్న 6-స్పీడ్ AMT లేదా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚను టాటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో అందిస్తుందని అంచనా. అంతేకాకుండా, టాటా కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో (125PS/225Nm) కూడా వచ్చే అవకాశం ఉంది, ఇది కొత్త DCT ఎంపికతో (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ؚమిషన్) జోడించబడుతుంది. నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ పవర్‌ట్రెయిన్‌లో కూడా ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. రెండు విభిన్న బ్యాటరీ సైజులలో ప్రైమ్ మరియు మ్యాక్స్ వర్షన్ؚలలో విక్రయించడం కొనసాగవచ్చు.
ఇది కూడా చూడండి: అనేక డిజిటల్ హంగులను పొందిన ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్ క్యాబిన్
ధర మరియు పోటీదారులు
కారు తయారీదారు కొత్త నెక్సాన్ ధరను ప్రస్తుత మోడల్ ధర కంటే (రూ.8 లక్షల నుండి రూ.14.60 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఎక్కువగా నిర్ణయిస్తారని భావిస్తున్నాము. నవీకరించిన SUV హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్. నిస్సాన్ మాగ్నైట్, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్, మరియు మారుతి ఫ్రాంక్స్ క్రాస్ؚఓవర్ؚతో కూడా పోటీని ఎదుర్కొంటుంది.
ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ AMT
0 out of 0 found this helpful