ఎలక్ట్రిక్ ఆర్మ్ పేరును Tata.ev గా మార్చిన టాటా
ఆగష్టు 30, 2023 03:32 pm rohit ద్వారా ప్రచురించబడింది
- 99 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త బ్రాండ్ గుర్తింపు టాటా మోటార్స్ యొక్క EV విభాగానికి కొత్త ట్యాగ్ లైన్ ను తీసుకువస్తుంది: అర్థవంతంగా ముందుకు సాగండి
-
టాటా వారి ఎలక్ట్రిక్ కార్ల విభాగానికి కొత్త లోగోను రివీల్ చేశారు.
-
ఈ కొత్త బ్రాండ్ చిహ్నం కూడా కొత్త గుర్తింపుని పొందుతుంది.
-
కొత్త టాటా.EV బ్రాండ్ కోసం కార్ల తయారీ సంస్థ వారి ఎవో టీల్ కలర్ పథకాన్ని ఉపయోగించారు.
-
టాటా మోటార్స్ కొత్త బ్రాండ్ గుర్తింపు మరియు లోగోను దశలవారీగా విడుదల చేయనుంది.
ఎలక్ట్రిక్ వాహనం (EV) రంగంలో ప్రస్తుతం అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) గా పిలువబడే తన EV విభాగాన్ని టాటా.EVగా మార్చింది. ఇది మహీంద్రా ఇటీవల తన రాబోయే శ్రేణి బోర్న్ ఎలక్ట్రిక్ (BE) వాహనాల కోసం చేసిన మాదిరిగానే ఉంది.
ఎందుకు మార్చారు?
స్థిరత్వం, కమ్యూనిటీ, టెక్నాలజీ విలువలను మేళవించడమే ఈ చర్యకు కారణమని కార్ల తయారీదారు పేర్కొన్నారు. ఈ కొత్త బ్రాండ్ గుర్తింపు దాని స్వంత ట్యాగ్ లైన్ తో వస్తుంది - అర్థవంతంగా ముందుకు సాగండి.
ఇది కూడా చదవండి: BS6 ఫేజ్ 2 కంప్లైంట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ టయోటా ఇన్నోవా హైక్రాస్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ప్రోటోటైప్ను ఆవిష్కరించిన నితిన్ గడ్కరీ
ఇతర సవరణలు
టాటా తన EV ఆర్మ్ కి కొత్త గుర్తింపు ఇవ్వడమే కాకుండా సరికొత్త లోగోను కూడా ఇచ్చింది. దీనికి '.ev' అనే ఉపపదం ఉంది, ఇది ఒక కక్ష్యలో ఉంచబడింది, టాటా ప్రకారం, ఇది మానవ మరియు పర్యావరణ పరస్పర చర్య యొక్క వృత్తాకార పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి సహాయపడుతుంది.
కార్ తయారీదారు టాటా.EV కోసం తన విలక్షణమైన ఇవో టీల్ కలర్ పథకాన్ని ఉపయోగించారు, ఇది దాని సుస్థిరత కట్టుబాట్లను హైలైట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు మరియు శక్తివంతమైన రిపుల్ సౌండ్ కలయికతో టాటా తన కొత్త బ్రాండ్ గుర్తింపుకు ఒక ప్రత్యేకమైన ధ్వనిని ఇచ్చింది.
ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ఎలక్ట్రిక్ కార్ల రంగంలో 70 శాతానికి పైగా మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న టాటా దశలవారీగా కొత్త బ్రాండ్ గుర్తింపులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 14 న రాబోయే టాటా నెక్సాన్ EV ఫేస్ లిఫ్ట్ తో ప్రారంభమయ్యే కొత్త లోగో మరియు గుర్తింపును మనం త్వరలో చూడగలమని భావిస్తున్నాము.
టాటా నెక్సాన్ EV ప్రైమ్ మరియు మ్యాక్స్తో పాటు మరో రెండు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి: టియాగో EV, టిగోర్ EV. ఎలక్ట్రిక్ వాహనాలైన పంచ్ EV, హారియర్ EV, కర్వ్ EV త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
ఇది కూడా చదవండి: టాటా పంచ్ EV తొలిసారిగా కెమేరా ముందు ఛార్జింగ్ అవుతుంది