Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

విడుదలకు సిద్ధంగా ఉన్న Tata Nexon EV Facelift: మీరు తెలుసుకోవలసిన విషయాలు

టాటా నెక్సాన్ ఈవీ కోసం tarun ద్వారా సెప్టెంబర్ 13, 2023 10:42 pm ప్రచురించబడింది

టాటా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ అన్ని వివరాలను వెల్లడించారు, ప్రస్తుతానికి వీటి ధరలను వెల్లడించలేదు.

  • టాటా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ؚను మూడు వేరియెంట్ؚలలో అందిస్తున్నారు –క్రియేటివ్, ఫియర్ؚలెస్ మరియు ఎంపవర్డ్

  • పునరుద్ధరించిన ముందు మరియు వెనుక భాగాలతో సరికొత్త స్టయిలింగ్ؚ, మరియు కనెక్టెడ్ LED లైట్ ఎలిమెంట్ؚలతో వస్తుంది.

  • టచ్-ఆధారిత AC ప్యానెల్ మరియు 2-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ؚలతో క్యాబిన్ؚను కూడా గణనీయంగా పునరుద్ధరించారు.

  • ప్రస్తుతం 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్, 12.3-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు 9-స్పీకర్‌ల JBL సౌండ్ సిస్టమ్ؚను కలిగి ఉంది.

  • ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు (ప్రామాణికంగా), 360-డిగ్రీల కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్‌లను పొందింది.

  • మిడ్ రేంజ్ వేరియెంట్ؚలు 325 కిమీ మరియు లాంగ్ రేంజ్ వేరియెంట్ؚలు 465 కిమీల పరిధిని అందిస్తాయి.

టాటా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. గత మూడు సంవత్సరాలలో అందుకున్న చిన్న మార్పులు కాకుండా, ఇది ఈ ఎలక్ట్రిక్ SUV మొదటి భారీ నవీకరణ. దిని బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరియు ఇది ఇప్పటికే డీలర్ షిప్ؚలను చేరుకుంది.

టాటా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు:

వేరియెంట్ؚలు

నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ మూడు విస్తృత వేరియెంట్ؚలలో లభిస్తుంది –క్రియేటివ్, ఫియర్ؚలెస్ మరియు ఎంపవర్డ్. బేస్ వేరియెంట్ కేవలం మిడ్-రేంజ్ (MR) బ్యాటరీ ప్యాక్ؚతో మాత్రమే లభిస్తుంది, మిగిలినవి MR మరియు లాంగ్-రేంజ్ (LR) ఎంపికలు రెండిటితో లభిస్తుంది.

ఎక్స్ؚటీరియర్ స్టైలింగ్

సరికొత్త గుర్తింపును అందించడానికి, టాటా నెక్సాన్ EV ఫేస్ లిఫ్ట్ కు మరిన్ని మార్పులు అందించారు. కనెక్టెడ్ LED DRLలు, నాజూకైన క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ మరియు హ్యారియర్ EV డిజైన్ నుండి ప్రేరణ పొందిన స్ప్లిట్ హెడ్ؚలైట్ సెట్అప్ؚతో ముందు వైపు మరింత ఆధునికమైన మరియు ఫ్యూచరిస్టిక్ అప్పీల్ؚను కలిగి ఉంది.

16-అంగుళాల ఏరోడైనమికల్లీ స్టైల్డ్ అలాయ్ వీల్స్ؚను మినహహించి, పక్క వైపు చెప్పుకోదగిన మార్పులు చేయలేదు. వెనుక వైపు DRLల వంటి కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంపులు ఉన్నాయి, ఇవి వెల్కమ్ లైట్ ఫంక్షన్ؚకు మద్దతు ఇస్తుంది. బూట్ లిడ్ మరియు బంపర్‌లను కూడా రీడిజైన్ చేశారు, ఇవి మరింత కొట్టొచ్చినట్లు ఉన్న ధృఢమైన రూపాన్ని అందిస్తున్నాయి. రూపాన్ని సంపూర్ణం చేసేలా, వెనుక వైపు వైపర్ స్పాయిలర్ؚలో చక్కగా అమర్చబడింది. స్టైలింగ్ మార్పులు ICE-ఆధారిత నెక్సాన్ؚకు అనుగుణంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన నవీకరణలు కూడా ఉన్నాయి.

సంబంధించినవి: చూడండి: నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ బ్యాక్‌లిట్ స్టీరింగ్ వీల్ؚలో టాటా ఎయిర్ బ్యాగ్ؚను ఎలా అమర్చింది

ఇంటీరియర్ స్టైలింగ్

కొత్త డ్యూయల్-టోన్ థీమ్ మరియు రీడిజైన్ చేసిన డ్యాష్ؚబోర్డ్ లేఅవుట్ క్యాబిన్‌కు కొత్త రూపాన్ని అందించాయి. టాటా అవిన్యా కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందిన బ్యాక్ؚలిట్ డిస్ప్లేతో కొత్త రెండు-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ టాటా లోగోని కలిగి ఉంది.

సాధారణ నెక్సాన్ؚలో ఉన్న టచ్-ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌ను కొనసాగించారు. చివరిగా, వేరియెంట్‌పై ఆధారపడి ఈ EV ప్రత్యేకమైన సీట్ అప్ؚహోల్ؚస్ట్రీని పొందుతుంది.

కొత్త ఫీచర్‌లు

కొత్త 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను కూడా జోడించారు, ఇది ఆన్ؚస్క్రీన్ నావిగేషన్ؚకు మద్దతు ఇస్తుంది. ఇప్పటివరకు ఏ మోడల్‌లో లేనటువంటి భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను టాటా ఇందులో అందించింది ؚ: 12.3-అంగుళాల ల్యాండ్ స్కేప్-ఓరియెంటెడ్ యూనిట్ؚను అమర్చింది.

ఇతర కొత్త ఫీచర్‌లలో 9-స్పీకర్‌ల JBL సౌండ్ సిస్టమ్ మరియు ఫ్రంట్ ప్యాసెంజర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమ్యాటిక్ AC, క్రూయిజ్ కంట్రోల్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు నెక్సాన్ EV ఫీచర్‌ల జాబితాలో ఇప్పటికే భాగంగా ఉన్నాయి.

EVకి ప్రత్యేకమైన సామర్ధ్యాలలో, కొత్త నెక్సాన్ EV, V2L మరియు V2V ఛార్జింగ్ؚలకు మద్దతు ఇస్తుంది. ఇవి మీ ఎలక్ట్రిక్ SUVని, ఉపకరణాలను ఉపయోగించడానికి (క్యాంపింగ్ సమయంలో) భారీ పవర్ బ్యాంక్ؚగా ఉపయోగించవచ్చు, లేదా కొంత అదనపు పరిధి కోసం మరొక EVని చార్జ్ చేయవచ్చు.

ఇది కూడా పరిశీలించండి: చూడండి: టాటా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ V2L ఫీచర్ పనితీరును

మరింత భద్రత

ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు (ప్రామాణికం), ESC, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు, 360-డిగ్రీల కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు రెయిన్-సెన్సింగ్ వైపర్ؚల కారణంగా భద్రత పరంగా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ మరింత మెరుగ్గా కనిపిస్తుంది.

మెరుగైన పరిధి

స్పెక్స్

మిడ్ రేంజ్

లాంగ్ రేంజ్

బ్యాటరీ

30.2kWh

40.5kWh

పరిధి

325 kms

465 kms

పవర్/టార్క్

129PS/ 215Nm

144PS/ 215Nm

నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ 30.2kWh మరియు 40.5kWh బ్యాటరీ ప్యాక్ؚలను కొనసాగిస్తుంది, అయితే పరిధి మరియు శక్తిని మెరుగుపరిచారు. మిడ్ రేంజ్ (ఇంతకు ముందు ప్రైమ్) వేరియెంట్ ప్రస్తుతం 13 కిలోమీటర్‌లు మరియు లాంగ్ రేంజ్ (ఇంతకుముందు మాక్స్) 12 కిలోమీటర్‌ల అదనపు పరిధిని అందిస్తాయి.

అంచనా ధరలు

నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత ధర పరిధి రూ.14.49 లక్షల నుండి రూ.19.54 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ధరతో వస్తుంది. ఈ టాటా ఎలక్ట్రిక్ SUV మహీంద్రా XUV400 EVతో పోటీని కొనసాగిస్తుంది, MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి వాటికి చవకైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ AMT

Share via

Write your Comment on Tata నెక్సాన్ ఈవీ

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.48.90 - 54.90 లక్షలు*
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.17.49 - 21.99 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర