Tata Nexon CNG టెస్టింగ్ ప్రారంభం, త్వరలో ప్రారంభమౌతుందని అంచనా
టాటా నెక్సన్ కోసం ansh ద్వారా మార్చి 15, 2024 04:18 pm ప్రచురించబడింది
- 163 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారత మార్కెట్లో టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తున్న మొదటి CNG కారు ఇదే
-
120 PS మరియు 170 Nm టార్క్ విడుదల చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది.
-
మాన్యువల్ మరియు AMT ఎంపికలు రెండింటినీ పొందవచ్చని భావిస్తున్నారు.
-
CNG వేరియంట్‌లు సుమారు రూ. 1 లక్ష ప్రీమియంతో రావచ్చు.
ఫేస్‌లిఫ్టెడ్ టాటా నెక్సాన్ గత సంవత్సరం అదే టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ప్రారంభించబడింది. 2024 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో, టాటా సబ్‌కాంపాక్ట్ SUV యొక్క CNG వెర్షన్‌ను ప్రదర్శించింది. ఇటీవల, నెక్సాన్ యొక్క ముసుగుతో ఉన్న టెస్ట్ మ్యూల్ గుర్తించబడింది మరియు ఇది రాబోయే CNG వెర్షన్ కావచ్చు.
పవర్‌ట్రెయిన్ వివరాలు
నెక్సాన్ CNG భారత మార్కెట్లో టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో CNG ఎంపికను అందించే మొదటి కారు. ఇది సాధారణ వెర్షన్ వలె అదే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగిస్తుంది, ఇది 120 PS మరియు 170 Nm పవర్, టార్క్ లను విడుదల చేస్తుంది, అయితే ఇక్కడ అవుట్‌పుట్ గణాంకాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ లాంగ్ రేంజ్ vs టాటా నెక్సాన్ EV (పాత): వాస్తవ ప్రపంచ పనితీరు పోలిక
ట్రాన్స్‌మిషన్ ఎంపిక పరంగా టాటా, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది మరియు ఇది టియాగో మరియు టిగోర్ సిఎన్‌జి వలె AMT ఎంపికను కూడా పొందవచ్చు. నెక్సాన్ CNG యొక్క పనితీరు మరియు మైలేజ్ స్పెసిఫికేషన్‌లు ఇంకా తెలియరాలేదు.
ఫీచర్లు & భద్రత
ప్రస్తుతానికి, CNG ఎంపిక అగ్ర శ్రేణి వేరియంట్‌లో లభిస్తుందో లేదో ఖచ్చితంగా తెలియదు, అయితే అది అందుబాటులో ఉంటే, ఇది మార్కెట్లో అత్యుత్తమంగా అమర్చబడిన CNG SUV అవుతుంది. ఒక అగ్ర శ్రేణి నెక్సాన్ CNG, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి లక్షణాలతో వస్తుంది.
ఇది కూడా చదవండి: తమిళనాడులో కొత్త ప్లాంట్ కోసం టాటా మోటార్స్ రూ. 9,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
భద్రత పరంగా, ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మరియు బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరాతో రావచ్చు.
ధర & ప్రత్యర్థులు
టాటా నెక్సాన్ ధర రూ. 8.15 లక్షల నుండి రూ. 15.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది మరియు CNG వేరియంట్‌లు సంబంధిత పెట్రోల్-మాన్యువల్ వేరియంట్‌తో పోలిస్తే దాదాపు రూ. 1 లక్ష ప్రీమియాన్ని కలిగి ఉంటాయని అంచనా. ప్రారంభం అయిన తరువాత, దాని ప్రత్యక్ష ప్రత్యర్థి మారుతి బ్రెజ్జా యొక్క CNG వేరియంట్‌లు మాత్రమే. సాధారణ నెక్సాన్- కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్‌లతో తన పోటీని కొనసాగిస్తుంది.
మరింత చదవండి : టాటా నెక్సాన్ AMT
0 out of 0 found this helpful