శాంగ్యాంగ్ తివోలీ: మీరు ఈ హ్యుందాయ్ క్రెటా ప్రత్యర్థి గురించి ఏమి తెలుసుకోవాలి

ఫిబ్రవరి 15, 2016 03:41 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

తివోలి వాహనం అనునది, కొరియన్ యుటిలిటీ తయారీదారుల బ్రాండ్ లను మహీంద్రా స్వాధీనం చేసుకున్న తరువాత శాంగ్యాంగ్ నుండి విడుదల అయిన మొదటి ప్రధాన నూతన ఉత్పత్తి!

మహీంద్రా త్వరలో దేశంలో ఈ కాంపాక్ట్ ఎస్యూవి ను ప్రారంభించనున్నట్లు తెలిపింది మరియు ఈ వాహనం, అనేక ఇతర హ్యుందాయ్ వాహనాలు అయినటు వంటి హ్యుందాయ్ క్రెటా పోటీ వాహనానికి పోటీగా రాబోతుంది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క ధర సుమారు క్రెటా ను పోలి ఉండవచ్చునని అంచనా. అయితే, ఇదే కోవకు చెందింది మహింద్రా యొక్క స్కార్పియో. ఇది కూడా సుమారు అదే ధరను కలిగి ఉంటుంది. కానీ, అది కస్టమర్ యొక్క ఒక భిన్నమైన మరియు తివోలీ విక్రయాల ఫలితాల విషయంలో అంచనా లేదు. క్రెటా తో పాటు టివోలి కూడా, రాబోయే 7 సీట్ల హోండా బి ఆర్ వి వాహనానికి అలాగే రెనాల్ట్ దస్టర్ ఫేస్లిఫ్ట్ వాహనంతో పాటు ఇతర వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వనుంది.

ఇంజన్లు

ఒకే విధంగా చెప్పాలంటే, హ్యుందాయ్ క్రెటా మరియు యూరప్ లో ఉండే టివోలి వాహనాలకు ఒకే 1.6 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ లను అందించడం జరిగింది. అంతేకాకుండా, ఇది మన దేశంలో ఇదే ఇంజన్ అలాగే ఒకే విధమైన ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ముందుగా 1.6 లీటర్ ఈ- ఎక్స్ జి ఐ 160 పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 6000 ఆర్ పి ఎం వద్ద 128 పి ఎస్ పవర్ ను అదే విధంగా 4600 ఆర్ పి ఎం వద్ద 160 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ- ఎక్స్ డి ఐ 160 డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 3400 నుండి 4000 ఆర్ పి ఎం మధ్యలో 115 పి ఎస్ పవర్ ను అదే విధంగా 1500 నుండి 2500 ఆర్ పి ఎం మధ్యలో 300 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఇంజన్ లు కూడా ప్రామాణిక 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. మరోవైపు ఇవే ఇంజన్లు, ఐసిన్ యొక్క 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఆప్షనల్ గా అందించబడుతుంది. అంతేకాక, ఇది ప్రపంచ వ్యాప్తంగా 4 డబ్ల్యూడి తో అందించబడుతుంది మరియు అలాగే భారతదేశంలో కూడా అందించబడుతుంది అని భావిస్తునారు.

లక్షణాలు మరియు భద్రత

తివోలి వాహనం, ఎల్ ఈ డి ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్ లతో పాటు ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లతో అందించబడుతుంది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క టైల్ ల్యాంప్ లలో కూడా ఎల్ ఈ డి లైటింగ్ అందించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా, ఈ వాహనానికి 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆప్షనల్ గా అందించబడతాయి. అయితే భారత మోడల్ విషయానికి వచ్చే సరికి, ఎక్స్పో లో ప్రదర్శించబడిన వాహనం బట్టి చూసినట్లైతే ఈ వాహనానికి 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. మరోవైపు ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, ఈ వాహనం ఒక బారీ 7- అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ తో పాటు బిల్ట్ ఇన్ నావిగేషన్ వ్యవస్థ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా కోసం ఒక ప్రదర్శన వంటి అంశాలు అందించబడతాయి. అదే యూరప్ మోడల్ విషయానికి వస్తే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క వెనుక మూడ్ బట్టి మార్చవచ్చు. అంతేకాక, ఈ వాహనానికి, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెధర్ అపోలిస్ట్రీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, క్రూజ్ కంట్రోల్ మొదలగున అంశాలు అందించబడతాయి. మహీంద్రా- శాగ్యాంగ్ భారతదేశం లో ఇటువంటి అన్ని అంశాలతో అందించబడే అవకాసం ఉంది అని ఆశిస్తున్నారు.

భద్రత పరంగా, ఈ వాహనం అంతర్జాతీయంగా 7 ఎయిర్బ్యాగ్స్ తో అందించబడుతుంది. అదే భారతీయ వెర్షన్ విషయానికి వస్తే, కనీసం అగ్ర శ్రేణి వాహనంలో అయినా కనీసం ఆరు ఎయిర్బాగ్లు అందించబడతాయని ఆశిస్తున్నారు. వీటన్నింటితో పాటు, ఈ వాహనానికి ఈ ఎస్ పి, టైర్ ప్రెజర్ మోనిటోరింగ్ మరియు ఐసోఫిక్స్ వంటి అంశాలు అందించబడతాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience