2016 జెనీవా ఎక్స్పో ముందే అధికారికంగా ముందుకు వచ్చిన శ్యాంగ్యాంగ్ తివోలి 7-సీటర్ వేరియంట్
ఫిబ్రవరి 17, 2016 10:31 am manish ద్వార ా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొరియా అనుబంధ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా దాని రాబోయే తివోలీ కాంపాక్ట్ SUV యొక్క 7-సీటర్ వెర్షన్ ని అధికారికంగా బయట పెట్టింది. ఈ కన్సెప్ట్ 2016 జెనీవా ఆటో ఎక్స్పో ప్రదర్శన కోసం రూపొందించబడింది. ఈ ఎస్యువి కాన్సెప్ట్ 'శ్యాంగ్యాంగ్ తివోలి XLV' గా వచ్చింది. ఈ మోడల్ అంతకు ముందు ఒక సంవత్సరం క్రితం కాన్సెప్ట్ మోడల్ గా జెనీవా లో ప్రదర్శించబడింది. ఈ రాబోయే కాన్సెప్ట్ ఒక బాహ్య స్కెచ్ ద్వారా అప్పుడు కనిపించింది. ఆ శూవ్ యొక్క మొత్తం సౌందర్య వివారాలు క్రింద అందించబడ్డాయి. చూద్దాం పదండి!
సౌందర్యపరమైన అంశాల గురించి మాట్లాడుకుంటే ఈ XLV యొక్క ముందు ముఖభాగం ప్రామాణిక తివోలీ ని ప్రతిబింబిస్తుంది. ఇది ఈ యేడాది తర్వాత కొంత కాలానికి భారతదేశంలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ కారుని దగ్గర నుండి చూస్తే గనుక ఇది దాని కాంపాక్ట్ ఎస్యూవీ కన్నా గణనీయంగా పెద్దదని తెలుస్తుంది. XLV ప్రామాణిక తివోలీ వేదిక మీద 235 మిమీ ద్వారా విస్తరించింది మరియు ఇప్పుడు , 7 కుటుంబసభ్యులకు వసతి కల్పిస్తుంది. అయితే వీల్బేస్ కూడా ఏమాత్రం మార్పు లేకుండా ఉంది. XLV ఒక 7-సీటర్ అయినప్పటికీ ప్రామాణిక తివోలీ 423 లీటర్ల పోలిస్తే 720 లీటర్ల బూట్ సామర్ధ్యం కలిగి ఉంది. XLV ప్రామాణిక కాంపాక్ట్ ఎస్యూవీ వలే అదే టర్నింగ్ వ్యాసార్ధం కలిగి ఉంటుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, ఈ XLV అదే 1.6 లీటర్ ఇ-XGi 160 పెట్రోల్ మరియు ఇ-XDi 160 డీజిల్ ఇంజిన్ ఎంపికను కలిగి ఉంది. ఇదే ప్రామాణిక తివోలీ లో అందించబడుతుంది. పెట్రోల్ పవర్ప్లాంట్ 128ps శక్తిని అందించగా, డీజిల్ పవర్ప్లాంట్ 115ps శక్తిని అందిస్తుంది. దీనివలన ఇది హ్యుందాయి క్రెటా తో పోటీ పడేందుకు సహాయం చేస్తుంది.