శాంగ్యాంగ్ టివోలి అనధికారికంగా తొలిసారి భారతదేశంలో కనిపించింది.

డిసెంబర్ 30, 2015 05:41 pm raunak ద్వారా ప్రచురించబడింది

శాంగ్యాంగ్ టివోలి హ్యుందాయ్ క్రిట నేతృత్వంలో దేశంలోని కాంపాక్ట్ SUV లైనప్ తో పోటీ చేయనుంది.

న్యూ డిల్లీ;

శాంగ్యాంగ్ భారతదేశంలో టివోలి కాంపాక్ట్ క్రాస్ఓవర్ ని పరీక్షించాలని అనుకుంది. దీనిని ఫిబ్రవరి 2016 లో భారత ఆటోఎక్స్పోలో తొలిసారిగా ప్రదర్శించబోతున్నారు. ఈ వాహనం ఈ సంవత్సరం ప్రారంభం లో పెట్రోల్, మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లు రెండింటితో యూరోపియన్ మార్కెట్లో ప్రారంభం కాబోతోంది. భారత ఆటోమోటివ్ మార్కెట్లో కాంపాక్ట్ SUV / క్రాస్ఓవర్ విభాగంలో హ్యుందాయ్ క్రిట విజయం సాధించింది. కొరియన్ SUV జులైలో ప్రారంభించబడిన తర్వాత దాదాపు 80,000 బుకింగ్స్ ని పొందింది. క్రిట ని కొనాలనుకునే వినియోగదారులందరికీ " టివోలి" కుడా అదే విధమయిన ప్యాకేజీ ని అందిస్తుంది.

యూరోప్ లో ప్రారంభించబోయే టివోలి, 1.6 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల ఆప్షన్స్ తో అనగా క్రిట వాహనం లోని ఇంజిన్ల లాగానే అందించబోతోంది. ఈ 1.6 లీటర్ e -XGi160 పెట్రోల్ ఇంజన్ 6,000 ఆర్ పి ఎం వద్ద 128 PS గరిష్ట శక్తిని, 4,600 rpm వద్ద 160నం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. e -XDi160 డీజిల్ ఇంజిన్ 3,400-4,000 ఆర్ పి ఎం వద్ద 115PS శక్తిని, మరియు 1,500-2,500 ఆర్ పి ఎం వద్ద 300 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. రెండు మోటార్లు ప్రామాణిక 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో రాబోతున్నాయి. అయితే ఐసిన్ యొక్క 6-స్పీడ్ ఆటోమాటిక్ ఆప్షనల్ గా ఉంటుంది.

క్రిట లో 6-స్పీడ్ ఆటోమాటిక్ ఆప్షన్ ఉన్నప్పటికీ దాని యొక్క వేటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండటాన్ని అదనపు ప్రయోజనంగా తీసుకొని శాంగ్యాంగ్,టివోలి వాహనానికి 6-స్పీడ్ ఆటో ఆప్షన్ ని ప్రవేశపెట్టింది.

అంతే కాకుండా ఇది 2WD మరియు 4WD అనే కాన్ఫిగరేషన్ లతో రాబోతోంది.

శాంగ్యాంగ్ టివోలి వాహనం యొక్క కొలతలు పొడవు 4,195 మిమీ. ,మొత్తం వెడల్పు 1,795 మిమీ. ఎత్తు 1,590 మిమీ.మరియు వాహనం యొక్క వీల్బేస్ 2,600 మిమీ. ఉంటుంది. ఈ గణాంకాలు అన్నీ దాని ప్రత్యర్ది వాహనాలు అయిన రెనాల్ట్ డస్టర్ మరియు హ్యుందాయ్ క్రిట ల తో పోల్చదగినవి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience