స్పెసిఫికేషన్ పోలిక: 2018 హ్యుందాయ్ సాన్ట్రో vs డాట్సన్ గో ఫేస్లిఫ్ట్ vs సెలెరియో vs టియాగో vs వాగన్R
డాట్సన్ గో కోసం cardekho ద్వారా మార్చి 27, 2019 10:27 am ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డాట్సన్ దాని యొక్క గో హ్యాచ్బ్యాక్ కారుని దాని యొక్క లుక్స్ మరియు లక్షణాల పరంగా నవీకరించి కొత్త హ్యుందాయ్ సాన్ట్రా మరియు పాత కార్లు అయిన , మారుతి సుజుకి వాగన్ ఆర్, సెలెరియో, టాటా టియాగో వంటి వాటితో పోటీపడేలా చేసింది. చెప్పాలంటే, ఈ సెగ్మెంట్ లో పోటీ చాలా హోరా హోరీగా ఉంది మరియు మీకోసం మేము సరైన కారును ఎంచుకునేందుకు, ప్రతీ కార్ల యొక్క ప్రతి ప్రత్యేకతను పోల్చాము.
కొలతలు
కొలతలు |
డాట్సన్ GO |
హ్యుందాయ్ సాన్త్రో (2018) |
మారుతి సుజుకి సెలెరియో |
టాటా టియాగో |
మారుతి సుజుకి వాగన్ R / వాగనార్ Vxi + * |
|
పొడవు |
3788mm |
3610mm |
3695mm |
3746mm |
3599mm/ 3636mm |
|
వెడల్పు |
1636mm |
1645mm |
1600mm |
1647mm |
1495mm/ 1475mm |
|
ఎత్తు |
1507mm |
1560mm |
1560mm |
1535mm |
1700mm/ 1670mm |
|
వీల్బేస్ |
2450mm |
2400mm |
2425mm |
2400mm |
2400mm |
|
బూట్ స్పేస్ |
265 L |
235 L |
235 L |
242 L |
NA |
వాగనార్ Vxi అనేది ముఖ్యంగా స్ట్రింగ్రే
కొత్త డాట్సన్ గో కారు అన్నిటికంటే చాలా పొడవుగా ఉంటుంది మరియు పొడవైన వీల్బేస్ ని కూడా కలిగి ఉంటుంది. మారుతి వాగనార్ కారు అతి పొడవైనది, కానీ మిగిలినవాటితో పోలిస్తే 100 మిమీ ఎక్కువ ఇరుకైనది. బూట్ స్పేస్ పరంగా, డాట్సన్ గో కారు మళ్ళీ గెలుస్తుంది.
పెట్రోల్ ఇంజన్లు
కార్ |
ఇంజిన్ సామర్థ్యం |
సిలిండర్ల సంఖ్య |
పవర్ |
టార్క్ |
ట్రాన్స్మిషన్ |
ఇంధన సమర్థత (క్లైమెడ్) |
డాట్సన్ GO |
1.2 లీటర్ |
3 |
68PS |
104Nm |
5-స్పీడ్ MT |
19.83 kmpl |
హ్యుందాయ్ సాన్త్రో (2018) |
1.1 లీటర్ |
4 |
69PS |
99Nm |
5-స్పీడ్ MT / AMT |
20.3 kmpl |
మారుతి సుజుకి సెలెరియో |
1.0 లీటర్ |
3 |
68PS |
90Nm |
5-స్పీడ్ MT / AMT |
23.1 kmpl |
టాటా టియాగో |
1.2 లీటర్ |
3 |
85PS |
114Nm |
5-స్పీడ్ MT / AMT |
23.84 kmpl |
మారుతి సుజుకి వాగనార్ |
1.0 లీటర్ |
3 |
68PS |
90Nm |
5-స్పీడ్ MT / AMT |
20.51 kmpl |
డాట్సన్ గో మరియు టాటా టియాగో రెండు కార్లూ పెద్ద 1.2 లీటర్ ఇంజన్లను కలిగి ఉన్నాయి. ఈ పోలికలు చూసుకుంటే, అతి పెద్ద కారు ఏది అంటే టియాగో అని చెప్పవచ్చు మరియు ఈ గాణాంకాల బట్టి చూస్తే టియాగో మంచి పనితీరుని కూడా అందిస్తుందని చెప్పవచ్చు. డాట్సన్ గో ఈ జాబితాలో తక్కువ ఇంధన సమర్థవంతమైన కారు మరియు ఒక ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ను అందించనటువంటి ఒకే ఒక కారు. సాన్త్రో, వాగానార్ మరియు సెలెరియో కూడా బూట్ ప్రదేశాన్ని తగ్గించుకొని CNG కిట్ ని అందిస్తూ ఇంధన సామర్ధ్యాన్ని పెంచడం జరుగుతుంది. మరొక వైపు, టియాగో ఒక డీజిల్ ఇంజిన్ ఎంపికతో ఉన్న ఏకైక కారు.
మీడియా మరియు భద్రతా లక్షణాలు
లక్షణం |
డాట్సన్ GO |
హ్యుందాయ్ సాన్త్రో (2018) |
మారుతి సుజుకి సెలెరియో |
టాటా టియాగో |
మారుతి సుజుకి వాగనార్ |
టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ |
7 ఇంచ్ |
7 ఇంచ్ |
లేదు |
7 ఇంచ్ |
లేదు |
వెనుక పార్కింగ్ సెన్సార్లు |
ప్రామాణికంగా ఉంటుంది |
టాప్ వేరియంట్ లో మాత్రమే |
లేదు |
ప్రామాణికం కాదు |
లేదు |
ABS |
ప్రామాణికంగా ఉంటుంది |
ప్రామాణికంగా ఉంటుంది |
ప్రామాణికం కాదు |
ప్రామాణికం కాదు |
ABS అన్ని వేరియంట్లలో ఆప్ష్నల్ |
డ్రైవర్ ఎయిర్బాగ్ |
ప్రామాణికంగా ఉంటుంది |
ప్రామాణికంగా ఉంటుంది |
ప్రామాణికంగా ఉంటుంది |
ప్రామాణికం కాదు |
ప్రామాణికం కాదు |
ఫ్రంట్ ప్యాసెంజర్ ఎయిర్బాగ్ |
ప్రామాణికంగా ఉంటుంది |
టాప్ వేరియంట్ లో మాత్రమే |
ప్రామాణికం కాదు |
ప్రామాణికం కాదు |
అన్ని వేరియంట్లలో ఆప్ష్నల్ |
నవీకరించబడిన డాట్సున్ గో కారు ఒక ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని మరియు మరింత భద్రతా లక్షణాలను దాని ప్రత్యర్థుల కంటే ప్రమాణంగా పొందుతుంది, కానీ స్టీరింగ్-మౌంట్ చేయబడిన నియంత్రణలను కోల్పోతుంది. మారుతి కార్లు తక్కువ భద్రతా సామగ్రిని ప్రమాణంగా పొందుతాయి, మరియు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కి ఖచ్చితంగా ఒక నవీకరణ అవసరం. టాటా టియాగో మాత్రమే ఇటీవలే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని కొత్త XZ + టాప్ స్పెక్ వేరియంట్ లో ప్రవేశపెట్టింది. పోటీతో పోల్చినప్పటికీ, హ్యుందాయ్ సాన్త్రో కూడా లక్షణాల పరంగా బాగుంది కానీ అధిక వేరియంట్లలో మాత్రమే. ముందు ప్రయాణీకుల ఎయిర్బాగ్ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లను టాప్ వేరియంట్ కోసం మాత్రమే రిజర్వు చేయబడింది.
ధరలు
కార్ |
డాట్సన్ GO |
మారుతి సుజుకి సెలెరియో |
టాటా టియాగో |
మారుతి సుజుకి WagonR |
హ్యుందాయ్ సాన్త్రో (2018) |
ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) |
రూ .3.29 లక్షలు - రూ .4.89 లక్షలు |
రూ. 4.21 లక్షలు - రూ. 5.40 లక్షలు |
రూ .3.34 లక్షలు - రూ. 5.63 లక్షలు |
రూ .4.14 లక్షలు - రూ. 5.39 లక్షలు |
రూ. 3.9 లక్షలు - రూ. 5.65 లక్షలు |
డాట్సన్ యొక్క ధర బాగా తక్కువగా ఉండడం వలన నవీకరించిన డాట్సన్ గో కారుతో మిగిలిన దాని పోటీదారుల కార్ల ను పోలిస్తే లాభదాయకంగా ఉంటుంది. దీనిలో అన్ని బేసిక్ లక్షణాలు ఉండడం వలన ఈ మొత్తం ప్యాకేజ్ మంచి విలువని అందిస్తుంది. కొత్త హ్యుందాయ్ సాన్ట్రా కారు మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తున్నప్పటికీ, వేరే కారులకు సమానమైన భద్రతా లక్షణాలనే కలిగి ఉన్నా కూడా దాని యొక్క అధిక ధరలతో నిరాశ పరుస్తుంది. మారుతి సుజుకి సంస్థ జనవరి, 2019 లో తన యొక్క కొత్త వాగన్ఆర్ ను విడుదల చేసిన తరువాత ఈ సెగ్మెంట్ లో పోటీలు మరింత రసవత్తరంగా సాగుతుంది.
0 out of 0 found this helpful