• English
  • Login / Register

లిమిటెడ్ ఎడిషన్‌లో మాట్టే రంగు ఎంపికను పొందిన స్కోడా కుషాక్

స్కోడా కుషాక్ కోసం tarun ద్వారా జూలై 05, 2023 02:23 pm ప్రచురించబడింది

  • 68 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మాట్టే ఎడిషన్ కేవలం 500 యూనిట్‌లకు మాత్రమే పరిమితం, మీరు దీన్ని పొందాలనుకుంటే త్వరపడాల్సి ఉంటుంది

Skoda Kushaq Matte Edition

  • కొత్త స్కోడా కుషాక్ మాట్టే ఎడిషన్ ధర రూ.16.19 లక్షల నుండి ఉంటుంది.

  • టాప్-ఎండ్ స్టైల్ వేరియెంట్‌తో పోలిస్తే రూ.40,000 అధిక ధరను కలిగి ఉంది.

  • 1-లీటర్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚలతో మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికతో లభ్యమవుతుంది. 

  • కార్బన్ స్టీల్ మాట్టే పెయింట్ؚతో వస్తుంది. ORVMలు, డోర్ హ్యాండిల్స్ మరియు వెనుక స్పాయిలర్‌లపై మెరిసే నలుపు రంగు ఫినిష్ ఉంటుంది. 

  • ఇంటీరియర్ డిజైన్ మార్పులు ఏవీ లేవు; భారీ 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ؚతో వస్తుంది. 

ఆకట్టుకునే ఇంజన్ కలిగిన ప్రీమియం SUVలను కొనుగోలు చేసేవారు చాలావరకు మాట్టే ఫినిష్‌ను ఇష్టపడతారు. ప్రస్తుతం స్కోడా కుషాక్ కూడా కొత్త మాట్టే ఎడిషన్ؚను అందిస్తుంది, ఇది కార్బన్ స్టీల్ రంగు ఎంపికతో వస్తుంది. ఈ పరిమిత ఎడిషన్ టాప్-ఎండ్ స్టైల్ మరియు మాంటే కార్లో వేరియెంట్ؚల మధ్య స్థానంలో నిలుస్తుంది మరియు కేవలం 500 యూనిట్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

వేరియెంట్-వారీ ధరలు 

మాట్టే ఎడిషన్ 

మాన్యువల్ 

ఆటోమ్యాటిక్ 

1-లీటర్ TSI

రూ. 16.19 లక్షలు 

రూ. 17.79 లక్షలు 

1.5-లీటర్ TSI

రూ. 18.19 లక్షలు

రూ. 19.39 లక్షలు

మాట్టే ఎడిషన్, స్టైల్ వేరియెంట్ؚల కంటే రూ.40,000 అధిక ధరను కలిగి ఉంది మరియు టాప్-స్పెక్ మాంటే కార్లో కంటే రూ.30,000 చవకగా వస్తుంది.

స్టైలింగ్ మార్పులు

Skoda Kushaq Matte Edition Rear

స్కోడా కుషాక్ ఇప్పటికే కార్బన్ స్టీల్ రంగులో లభ్యమవుతుంది, కానీ మాట్టే పెయింట్ ఎంపిక మరింత స్పోర్టియర్‌గా కనిపిస్తుంది. ORVMలు, డోర్ హ్యాండిల్స్ మరియు వెనుక స్పాయిలర్ؚలు మెరిసే నలుపు రంగులో ఉంటాయి ఇవి కార్బన్ స్టీల్ రంగుకు మరింత ఆకర్షణీయతను పెంచుతాయి. అయితే, పూర్తిగా నలుపు రంగులో కాకుండా గ్రిల్, ట్రంక్ గార్నిష్ మరియు విండో గార్నిష్ؚలపై క్రోమ్ ఫినిషింగ్ కొనసాగుతుంది. 1.5-లీటర్ TSI వేరియెంట్ؚలపై ప్రత్యకమైన బ్యాడ్జ్ కూడా ఉంటుంది, ఇది 1-లీటర్ TSI వేరియెంట్ కంటే భిన్నంగా ఉండటంలో సహాయపడుతుంది. 

ఇంటీరియర్‌లో ఎటువంటి మార్పులు లేవు

Skoda Kushaq Cabin

స్టైలింగ్ పరంగా ఇంటీరియర్ؚలో ఎటువంటి మార్పులు లేవు మరియు ఇది ఇప్పటికే లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీతో నలుపు రంగు క్యాబిన్ؚను పొందింది. అయితే, ఇది 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ సిస్టమ్‌లో వైర్ؚలెస్ యాపిల్ కార్ؚప్లే మరియు అండ్రాయిడ్ ఆటో మరియు సబ్ వూఫర్ؚతో 6-స్పీకర్‌ల సౌండ్ సిస్టమ్ؚను కలిగి ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కార్ కొనుగోలు నిర్ణయలలో ఇంధన సామర్ధ్యం కంటే భద్రత రేటింగ్ؚలు మరియు ఎయిర్ బ్యాగ్ؚలు మరింత ముఖ్యమైనవి అని వెల్లడించిన సర్వే ఫలితాలు

ఫీచర్‌ల విషయంలో ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, ఆటోమ్యాటిక్ AC, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్ؚలెస్ ఛార్జర్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, ESC మరియు వెనుక కెమెరాలను నిలుపుకుంటుంది. 

అన్ని పవర్ؚట్రెయిన్ ఎంపికలు

Skoda Kushaq Engine

కుషాక్ మాట్టే ఎడిషన్ 115PS 1-లీటర్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో 150PS 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚలతో అందించబడుతుంది. 1-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ఎంపికను కూడా పొందుతుంది, పెద్ద ఇంజన్ؚలో 7-స్పీడ్ DSG (డ్యూయల్-క్లచ్ ఆటోమ్యాటిక్) యూనిట్ ఉంటుంది. 

ధర మరియు పోటీదారులు 

కుషాక్ ధర రూ.11.59 లక్షల నుండి రూ.19.69 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది, ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG ఆస్టర్, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్వాగన్ టైగూన్, మరియు రాబోయే హోండా ఎలివేట్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ వంటి వాటితో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: కుషాక్ ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Skoda కుషాక్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience