Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కొత్త SUV లతో పాటుగా తిరిగి డస్టర్ؚ ను కూడా భారతదేశానికి పరిచయం చేయనున్న రెనాల్ట్-నిస్సాన్

ఫిబ్రవరి 08, 2023 01:38 pm ansh ద్వారా ప్రచురించబడింది

ఈ కొత్త జనరేషన్ SUVలు బలమైన-హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ؚతో రానున్నాయి.

నిస్సాన్ మరియు రెనాల్ట్ తమ స్నేహపూర్వక ఒప్పందాన్ని ఈ సంవత్సరం చివరలో పునరుద్ధరించనున్నాయి మరియు స్వల్ప, మధ్యకాలిక భవిష్యత్తు కోసం మార్కెట్-వారీగా తమ లక్ష్యాలను ప్రకటించనున్నాయి. ఈ జపాన్ మరియు ఫ్రెంచ్ కారు తయారీదారులు భారతదేశం కోసం SUVలతో సహా కొత్త భాగస్వామ్య వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ SUVలు డస్టర్ కొత్త వేరియెంట్‌లు కావచ్చు అని భావిస్తున్నాము. గతంలో టెర్రానో విషయంలో జరిగినట్లుగా, కొత్త డస్టర్ నిస్సాన్ؚకు ప్రత్యామ్నాయాన్ని కూడా తయారుచేయవచ్చు.

పేరు మరియు డిజైన్

భారతదేశ కారు మార్కెట్‌లో డస్టర్ జనధారణ పొందినందున అదే పేరుతో రెనాల్ట్ తమ వాహనాలను తిరిగి తీసుకురావచ్చు, అంతగా జనధారణ పొందని టెర్రానో విషయానికి వస్తే నిస్సాన్ తమ కారు మోడల్‌లకు కొత్త పేరును పరిగణించవచ్చు. ఈ జపనీస్ సంస్థ కిక్స్ మోనికర్ పేరును కూడా పరిగణించవచ్చు.

ఇది కూడా చదవండి: భారతదేశంలో బలమైన హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚను అందించే చివరి జపనీస్ కారు తయారీదారు నిస్సాన్

రెండు SUVలు ఒకే ప్లాట్ؚఫారమ్‌పై ఆధారపడతాయి, స్పెసిఫికేషన్‌లు కూడా ఒకేలా ఉండవచ్చు. కైగర్, మాగ్నైట్ వంటి రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్యంలో ఇటీవలి ఇతర ఉత్పత్తులలాగే, ఈ రెండు కాంపాక్ట్ SUVలు కూడా ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉన్నాయి.

కొత్త జనరేషన్

విదేశాలలో రెండవ-జనరేషన్ డస్టర్ ఇప్పటికే మార్కెట్ؚలో అందుబాటులో ఉన్నందున, భారతదేశంలో రెనాల్ట్ తన మొదటి-జనరేషన్ డస్టర్ؚను 2022లో నిలిపివేసింది. యూరోపియన్ మార్కెట్ؚలో డస్టర్, రెనాల్ట్ గ్రూప్ؚకు సొంతమైన డేసియా బ్రాండ్ ద్వారా విక్రయించబడుతుంది, ఇది బహుళ పవర్ ట్రెయిన్ పెట్రోల్ మరియు డీజిల్ ఎంపికలలో రెండవ-జనరేషన్ వేరియంట్‌గా కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే, ఈ కారు తయారీదారు డస్టర్ؚను తిరిగి భారతదేశంలోకి తీసుకొని వస్తే, ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న మూడవ-జనరేషన్ మోడల్ؚ అయిన EV వాహనాలను తీసుకురావచ్చు.

పవర్ ట్రెయిన్ ఫీచర్‌లు

మూడవ-జనరేషన్ డస్టర్ కేవలం పెట్రోల్ యూనిట్ؚతో బలమైన-హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ؚలను తీసుకురావచ్చు, కానీ డీజిల్ ఎంపిక అందుబాటులో ఉండకపోవచ్చు, ఇదే జరిగితే, దాని భాగస్వామి నిస్సాన్ కూడా ఇదే ఎంపికలో రావచ్చు, ఈ రెండు కొత్త హైబ్రిడ్ కాంపాక్ట్ SUVలు మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ؚలతో పోటీ పడటానికి భారతీయ మార్కెట్లలోకి ప్రవేశించవచ్చు.

ఇది కూడా చదవండి: రానున్న నిస్సాన్ X-ట్రెయిల్ గురించి తెలుసుకోవలసిన 7 ముఖ్య విషయాలు

ఫీచర్‌ల విషయంలో కూడా, కొత్త రెనాల్ట్-నిస్సాన్ SUVలు మెరుగైన డిస్ప్లే యూనిట్‌లు, మరికొన్ని ప్రీమియం సౌకర్యాలతో డస్టర్, టెర్రానోల ధృడమైన ఆకర్షణను కూడా నిలుపుకుంటాయని ఆశిస్తున్నారు.

విడుదల సమయం అంచన

రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్యం ఈ కాంపాక్ట్ SUVలను 2024లోగా పరిచయం చేసి, వెంటనే మార్కెట్‌లోకి వాహనాలను విడుదల చేయనుంది. ఈ రెండు SUVలు ఒకే ధరను కలిగి ఉండవచ్చు. ఇవి మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, వోక్స్ؚవ్యాగన్ టైగూన్ వంటి వాటితో పోటీ పడవచ్చు.

పెద్ద SUVలు కూడా ఉండవచ్చు

భారతదేశ కాంపాక్ట్ SUV విభాగంలోకి రెనాల్ట్-నిస్సాన్ తిరిగి ప్రవేశిస్తాయని ఆశిస్తున్నాము, ఈ తయారీదారులు నుండి పెద్దవైన, ప్రీమియం మోడల్‌ల విడుదలను కూడా ఆశించవచ్చు. నిస్సాన్ X-ట్రెయిల్ భారతదేశానికి వస్తుందని ఇప్పటికే నిర్ధారణ అయింది, ఇది సిట్రోయెన్ C5 ఎయిర్ క్రాస్, స్కోడా కోడియాక్ వంటి వాటికి CBU (ఇంపోర్టెడ్) ప్రత్యర్ధి అవుతుంది. రెనాల్ట్, కూపే-స్టైల్ ఆర్కానాతో మళ్ళీ మిడ్ؚసైజ్ SUV రంగంలోకి రావచ్చు.

ఇది కూడా చదవండి: నాలుగు కొత్త ప్రామాణిక భద్రతా ఫీచర్ లను పొందిన 2023 రెనాల్ట్ మోడల్‌లు

డస్టర్ పునరాగమనం కోసం రెనాల్ట్, నిస్సాన్ؚలు CMF-B ప్లాట్ ఫారంను స్థానికీకరణ చేస్తాయని ఆశిస్తున్నారు, దీని మాడ్యూలర్ డిజైన్‌తో మరింత కాంపాక్ట్ మోడల్‌లను అభివృద్ధి చేయవచ్చు. ఇవి డిజైన్ మరియు ఫీచర్‌లను బట్టి ప్రత్యేకంగా ఉంటాయి, మరింత ధృఢమైన మోడల్‌లకు సంభావ్య ప్రత్యామ్నాయాలు కావచ్చు.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర