మారుతి ఫ్రాంక్స్ ధరలు రూ. 7.46 లక్షల నుండి ప్రారంభం

మారుతి ఫ్రాంక్స్ కోసం tarun ద్వారా ఏప్రిల్ 24, 2023 03:57 pm సవరించబడింది

  • 61 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ హ్యాచ్‌బ్యాక్ క్రాస్‌ఓవర్ సహజ సిద్దమైన అలాగే టర్బోపెట్రోల్ ఇంజన్‌లతో  అందుబాటులో ఉంది.

Maruti Fronx

  • ఫ్రాంక్స్ ధర రూ.7.46 లక్షల నుంచి రూ.13.14 లక్షల వరకు ఉంది.
  • సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా మరియు ఆల్ఫా వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
  • 9-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్ మరియు పాడిల్ షిఫ్టర్‌ వంటి అంశాలను కలిగి ఉంటుంది.
  • ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ESP మరియు హిల్ హోల్డ్ అసిస్ట్‌ వంటి అంశాల ద్వారా మరింత భద్రత అందించబడుతుంది.
  • ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో జత చేయబడిన 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది.
  • ఇది, సబ్ కాంపాక్ట్ SUV మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగాలకు ప్రత్యర్థి.

బాలెనో-ఆధారిత ఫ్రాంక్స్ SUV ధరలను, మారుతి వెల్లడించింది. ఈ హ్యాచ్‌బ్యాక్-SUV క్రాసోవర్ ధర ఇప్పుడు రూ. 7.46 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). కొనుగోలుదారులు ఈ వాహనాన్ని సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా మరియు ఆల్ఫా అనే ఐదు వేర్వేరు వేరియంట్లలో పొందవచ్చు. వేరియంట్ వారీగా ధరలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:  

ధర తనిఖీ

వేరియంట్

1.2-లీటర్ పెట్రోల్-MT

1.2-లీటర్ పెట్రోల్-AMT

1-లీటర్ టర్బో-పెట్రోల్ MT

1-లీటర్ టర్బో-పెట్రోల్ AT

సిగ్మా

రూ.7.46 లక్షలు

-

-

-

డెల్టా

రూ.8.33 లక్షలు

రూ.8.88 లక్షలు

-

-

డెల్టా+

రూ.8.73 లక్షలు

రూ.9.28 లక్షలు

రూ.9.73 లక్షలు

-

జీటా

-

-

రూ.10.56 లక్షలు

రూ.12.06 లక్షలు

ఆల్ఫా

-

-

రూ.11.48 లక్షలు

రూ.12.98 లక్షలు

ఆల్ఫా DT

-

-

రూ.11.64 లక్షలు

రూ.13.14 లక్షలు

సిగ్మా వేరియంట్, 1.2-లీటర్ పెట్రోల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికతో వస్తుంది. డెల్టా+ వేరియంట్ విషయానికి వస్తే, రెండు ఇంజన్ లతో వస్తుంది కానీ, టర్బో-పెట్రోల్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో అందుబాటులో ఉండదు. టర్బో ఆటోమేటిక్ వేరియంట్‌లు, మాన్యువల్ వేరియంట్‌ల కంటే రూ. 1.5 లక్షలు అధిక ధరను కలిగి ఉంటాయి. AMT వేరియంట్‌ల విషయానికొస్తే, అవి మాన్యువల్ వేరియంట్ల కంటే రూ. 55,000 అధిక ధరతో అందుబాటులో ఉంటాయి.

సంబంధిత: మారుతి ఫ్రాంక్స్ Vs ప్రీమియం హ్యాచ్బ్యాక్ ప్రత్యర్థులు: ఇంధన సామర్థ్య పోలిక   

Maruti Fronx

కొలతలు

పొడవు

3995మి.మీ

వెడల్పు

1765మి.మీ

ఎత్తు

1550మి.మీ

వీల్ బేస్

2520మి.మీ

గ్రౌండ్ క్లియరెన్స్

190మి.మీ

ఫ్రాంక్స్ అనేది మారుతి బాలెనో ఆధారిత ఉప నాలుగు మీటర్ల ఎంపిక. బాలెనోతో పోల్చితే, దృఢమైన బంపర్‌లు, రూఫ్ రైల్స్ మరియు బాడీ క్లాడింగ్ కారణంగా ఇది కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. హ్యాచ్బ్యాక్ తో పోలిస్తే, ఈ భారీ కొలతలు విశాలమైన క్యాబిన్ స్పేస్ ను అందించలేవు.

Maruti Fronx

లక్షణాలు

  • మారుతి ఫ్రాంక్స్ అనేక ప్రీమియం ఫీచర్ల జాబితాతో నిండిపోయింది. అవి వరుసగా:
  • ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు
  • వైర్లెస్ ఛార్జర్
  • పాడిల్ షిఫ్టర్లు (AT కోసం మాత్రమే)
  • ఇంజిన్ పుష్ స్టార్ట్-స్టాప్ బటన్
  • వెనుక AC వెంట్లు
  • 9-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
  • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే
  • క్రూజ్ నియంత్రణ
  • హెడ్స్-అప్ డిస్ప్లే 

ఇది కూడా చదవండి: మారుతి ఫ్రాంక్స్ ఫస్ట్ డ్రైవ్: నేర్చుకున్న 5 విషయాలు

భద్రత

ఫ్రాంక్స్ అనేక భద్రతా అంశాలతో అందించబడుతుంది, అవి వరుసగా:

  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ప్రామాణికం)
  • హిల్ హోల్డ్ అసిస్ట్ (ప్రామాణికం)
  • ప్రయాణీకులందరికీ మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు (ప్రామాణికం)
  • ఐసోఫిక్స్ ఎంకరేజ్‌లు (ప్రామాణికం)
  • ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల వరకు
  • 360-డిగ్రీ కెమెరా
  • ఆటో-డిమ్మింగ్ IRVMలు

Maruti Fronx

ఇంజన్లు

మారుతి ఇప్పుడు నిలిపివేయబడిన బాలెనో ఆర్ఎస్' బూస్టర్ జెట్ టర్బో-పెట్రోల్ మోటార్‌తో పాటు బాలెనో యొక్క 1.2-లీటర్ సహజ సిద్దమైన పెట్రోల్ ఇంజన్‌తో, ఫ్రాంక్స్‌ను అందిస్తోంది. ఈ రెండు పవర్‌ట్రెయిన్‌లు వేర్వేరు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి. స్పెసిఫికేషన్లు క్రింది ఇవ్వబడ్డాయి:

ఇంజిన్

1.2-లీటర్ పెట్రోల్

1-లీటర్ టర్బో-పెట్రోల్

పవర్ / టార్క్

90పిఎస్ / 113ఎన్ఎమ్  

100పిఎస్ / 148ఎన్ఎమ్  

ట్రాన్స్మిషన్

5-స్పీడ్ ఎంటి / 5-స్పీడ్ ఏఎంటి 

5-స్పీడ్ ఎంటి / 6-స్పీడ్ ఏటి 

ఇంధన సామర్ధ్యం

21.79కెఎంపిఎల్ / 22.89కెఎంపిఎల్

21.5కెఎంపిఎల్ / 20.1కెఎంపిఎల్ 

ప్రత్యర్థులు

పోటీ విషయానికి వస్తే, మారుతి ఫ్రాంక్స్‌కు చాలా మంది ప్రత్యర్థులు ఉన్నారు. ఇది హ్యుందాయ్ వెన్యూ మరియు టాటా నెక్సాన్ వంటి సబ్‌కాంపాక్ట్ SUVలకు ప్రత్యర్థిగా ఉంది, అయితే హ్యుందాయ్ ఐ20 మరియు టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. అంతేకాకుండా ఈ క్రాస్‌ఓవర్, సమానమైన ధర పరిధిలో ఉన్న బాలెనో మరియు బ్రెజ్జా లకు కూడా ప్రత్యామ్నాయంగా ఉంది.

మరింత చదవండి: ఫ్రాంక్స్ ఆన్ రోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి ఫ్రాంక్స్

1 వ్యాఖ్య
1
L
leela ramanan
Apr 25, 2023, 4:40:01 AM

Excellent Features New Maruthi FRONEX SUV

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience