రేపే వెల్లడించనున్న 2023 Tata Nexon Facelift ధరలు
టాటా నెక్సన్ కోసం ansh ద్వారా సెప్టెంబర్ 13, 2023 10:36 pm ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2023 నెక్సాన్ పూర్తిగా కొత్త డిజైన్ؚతో వస్తుంది, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు రెండిటినీ కొనసాగిస్తుంది
-
ఆకర్షణీయమైన ఫ్రంట్ ప్రొఫైల్, కొత్త అలాయ్ వీల్స్ మరియు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ؚలను పొందింది.
-
మరిన్ని వర్టికల్ ఎలిమెంట్ؚలతో పూర్తిగా పునర్నిర్మించిన క్యాబిన్ؚతో వస్తుంది.
-
10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లలను పొందింది.
-
దీన్ని రెండు ఇంజన్‌ల ఎంపికలో అందిస్తున్నారు: 115PS పవర్, 1.5-డీజిల్ ఇంజన్ మరియు 120PS పవర్, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.
-
దీని ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుంది.
2023 టాటా నెక్సాన్ ఆవిష్కరించబడింది మరియు ఫేస్ؚలిఫ్ట్‌ను రేపు విడుదల చేయనున్నారు. నవీకరించిన SUV సరికొత్త డిజైన్‌తో, రీడిజైన్ చేసిన ఇంటీరియర్ؚలతో మరియు ఫీచర్ జాబితాకు మరిన్ని జోడింపులతో వస్తుంది. దీని బుకింగ్‌లు కొద్ది రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి మరియు దిని విడుదలకు ముందు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ అందించబడ్డాయి.
ఆధునిక డిజైన్
ఈ ఫేస్ؚలిఫ్ట్ జనరేషన్ అప్ؚడేట్ؚగా కనిపించేలా రూపొందించడానికి టాటా ఎంతో కృషి చేసింది. ఆకర్షణీయమైన బోనెట్, సీక్వెన్షియల్ LED DRLలు, హ్యారియర్ EV కాన్సెప్ట్ నుండి పొందిన పొడవుగా అమర్చిన LED హెడ్ؚలైట్ؚలు మరియు నాజూకైన బంపర్ؚలతో పూర్తిగా రీడిజైన్ చేసిన లుక్‌ను పొందింది.
కొత్త ఏరోడైనమిక్ؚగా డిజైన్ చేసిన 16-అంగుళాల అలాయ్ వీల్స్ మినహా సైడ్ ప్రొఫైల్ దాదాపుగా అదే విధంగా ఉంది. అయితే, ముందు భాగంలో చేసిన విధంగానే, వెనుక భాగంలో కూడా ఎన్నో మార్పులు చేశారు. ఇక్కడ మరింత ప్రధానమైన ఫీచర్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ సెట్అప్ మరియు ఇది ఫ్లాట్టర్ ఫినిష్ మరియు రీడిజైన్ చేసిన బంపర్ؚను కూడా పొందుతుంది.
నవీకరించిన క్యాబిన్
ఎక్స్ؚటీరియర్ విధంగానే, ఇంటీరియర్ؚను కూడా పూర్తిగా రీడిజైన్ చేశారు. డ్యాష్ؚబోర్డ్ మునుపటి వంపు తిరిగిన డిజైన్ కంటే ఎక్కువ నిటారుగా కనిపిస్తుంది. ఈ కొత్త క్యాబిన్ ముఖ్యాంశాలలో భారీ సెంట్రల్ డిస్ప్లే, సెంటర్ కన్సోల్ؚలో కొన్ని ఫిజికల్ నియంత్రణలు మరియు బ్యాక్ؚలిట్ టాటా లోగోతో కొత్త రెండు-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ ఉన్నాయి. కొత్త క్యాబిన్ థీమ్ రంగులను కూడా పొందింది (ఎంచుకున్న కొత్త పెయింట్ ఎంపికలకు మ్యాచ్ అవుతాయి) ఇవి అప్ؚహోల్ؚస్ట్రీ పై కూడా ఉంటాయి.
కొత్త ఫీచర్‌లు
ప్రస్తుతం నెక్సాన్ వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ؚప్లేలతో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ప్యాడిల్ షిఫ్టర్ؚలు మరియు టచ్-ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ؚలను పొందింది. నిలిపివేస్తున్న నెక్సాన్ؚలోని వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్‌లను ఇందులో కొనసాగించారు.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ వెన్యూతో పోలిస్తే టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ పొందిన 7 అదనపు ఫీచర్‌లు
భద్రత విషయానికి వస్తే, ఇది 6 ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా పొందింది, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు బ్లైండ్ వ్యూ మానిటర్ؚతో 360-డిగ్రీల కెమెరాలు ఉంటాయి.
మునపటి పవర్ؚట్రెయిన్
నెక్సాన్ డిజైన్ మరియు ఫీచర్ జాబితాలను టాటా నవీకరించింది, ఇంజన్ ఎంపికలలో ఎటువంటి మార్పులు చేయలేదు. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (115PS మరియు 260Nm) మరియు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120PS మరియు 170Nm) ఇంజన్‌లతో వస్తుంది.
ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ వేరియెంట్-వారీ పవర్ؚట్రెయిన్ؚలు మరియు రంగుల ఎంపికను పరిశీలించండి
డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ AMTతో జోడించబడింది, టర్బో-పెట్రోల్ యూనిట్ ప్రస్తుతం 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT మరియు 7-స్పీడ్ DCT అనే నాలుగు ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో వస్తుంది.
ధర & పోటీదారులు
టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల అవుతుందని అంచనా. ఇది కియా సోనెట్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT