సుజుకీ ఐఎం4 కాన్సెప్ట్ యొక్క పేటెంట్ ఫోటోలు కంటపడ్డాయి
ఆగష్టు 26, 2015 09:53 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
సుజుకీ వారి ఐఎం4 కాన్సెప్ట్ పేటెంట్ ఫోటోలు బయటపడ్డాయి. అందులో కనపడిన కారు అదే రూపంలో ఉండి కాస్త రూపాంతరం చెందినట్టుగా కనపడింది. ఫోటోల బట్టి చూస్తే, ఈ కారు తయారీ జరిగి ప్రపంచంలోకి అడుగు పెట్టేది 2016 సంవత్సరం చివరిలోనే.
ఫోటోల బట్టి, ఈ కారు లో అంతకు మునుపు ఉన్న ఎలీడీ హెడ్ల్యాంప్స్ మరియూ టెయిల్ ల్యాంప్స్ కి బదులుగా సాధారణ వి ఉన్నాయి, బాడీతో కలిసిపోయిన డోర్ హ్యాండల్స్ స్థానంలో ఇప్పుడు లాగే విధంగా ఉన్న హ్యాండల్స్ ఉన్నాయి. పెద్ద వీల్స్ ఇప్పుడు చిన్న వీల్స్ తో భర్తీ చేయబడగా, కాంపాక్ట్ వెర్షన్ తో పోలిస్తే, ఇందులో కనబడే బాహ్యపు అద్దాలు సాధారణంగా ఉన్నాయి. ఇందులో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ కూడా తీసివేయబడింది. ఇవి కాకుండా, బాహ్య రూపం మొత్తం ఇంచు మించుగా కాన్సెప్ట్ మాదిరిగానే ఉంది.
దీనిలో అంతర్జాతీయ మార్కెట్ల 1.0-లీటర్ టర్బో పెట్రోల్ లేదా 1.2-లీటరు డ్యువల్ జెట్ ఇంజిను ఉండే అవకాశం ఉంది. మరొపక్క, ఇది గనుక భారతదేశానికి వచ్చినట్టు అయితే, స్విఫ్ట్ యొక్క 1.2-లీటర్ పెట్రోల్ మరియూ 1.3-లీటర్ డీజిల్ ఇంజినుతో రావొచ్చు.