• English
  • Login / Register

ఇసుజు భారతదేశం ఎమ్యూ-7 స్వయంచాలక వాహనాన్ని ప్రవేశ పెట్టే అవకాశం ఉంది

ఇసుజు ఎమ్యూ 7 కోసం అభిజీత్ ద్వారా జూలై 22, 2015 12:17 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: జపనీస్ కార్ మేకర్ అయిన ఇసుజూ భారతదేశంలో ఎస్వియు ఎమ్యూ-7 ద్వారా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ని విడుదలతో చేస్తుంది. అధికారిక వెబ్సైట్ లో ప్రారంభం త్వరలో విడుదల జరుగుతుంది అని సూచించే ఒక బ్యానర్ ఉంది కానీ ఖచ్చితమైన తేదీ యొక్క ప్రస్తావన లేదు. ట్రాన్స్మిషన్ యూనిట్ ఒక 5-స్పీడ్ ఆటోమేటిక్ అయి ఉంటుంది అని భావిస్తున్నారు. 

ఎమ్యూ-7 గురించి మాట్లాడుతూ, ఇది ప్రస్తుతం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్మిషన్లో మరియు 4x2 తీరులో మాత్రమే అందించబడుతుంది. ఈ ఎస్యూవీ 4955ఎమెం పొడవు 1800ఎమెం వెడల్పు మరియు 1805ఎమెం ఎత్తు తో ఉంటుంది. 3050ఎమెం వీల్బేస్ కలిగి ఉంది. ఇది ఎండీవర్ మరియు ఫార్చ్యూనర్ కంటే ఎక్కువ. ఈ కొలతలు ఎమ్యూ-7 యొక్క గొప్ప ఆకారానికి తగినట్టుగానే ఉన్నాయి ,స్క్వేర్డ్ ఆఫ్ బొమ్మలు,  డబ్బాలా  సమానమైన ముక్కు, దీర్ఘచతురస్రాకార నిటారుగా ఉండే హెడ్ల్యాంప్స్, వెడల్పాటి హుడ్ స్కూప్, పేలవమైన చక్రం బ్యాగ్గులు మరియు ఒక సమాంతర భారీ వెనుక భాగం ఉన్నాయి .

ఈ భారీ కొలతల వల్ల లోపల కూర్చున్న వారందరికి స్థలం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇది డ్రైవర్ మరియు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన కాళ్ళ స్థలం అందిస్తుంది. సీట్లు చివరి వరుసలో ఎంతో ఖాళీని అందించింది. ఇది ఈ విభాగంలో అనేక ఇతర ఉత్పత్తులకంటే కంటే మెరుగైనది అనే చెప్పాలి.

ఎమ్యూ-7 లో గల 3.0 లీటర్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి 163పీఎస్ కాగా టార్క్ 360ఎనెం గా ఉంది. ఇది వీజీటీ ( వేరియబుల్ జియోమెట్రిక్ టర్బో చార్జర్) ని ఉపయోగిస్తుంది. ఈ సంఖ్య మీరు శక్తి మరియు పనితీరు ఎప్పుడూ సమర్ధంగా ఉండేలా చేస్తుంది. ఇసుజు వారు డీజిల్ మోటార్ల నిపుణులు మరియు వారి నైపుణ్యం వారి యొక్క ఉత్పత్తులలో ప్రతిబింబిస్తుంది.  బలమైన సేవ మరియు డీలర్ నెట్వర్క్లు లేకపోవడం వలన అమ్మకాలు తర్వాతి సేవలు విషయంలో వెనుకబడి ఉన్నారు.

was this article helpful ?

Write your Comment on Isuzu MU 7

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience