టోక్యో మోటార్ షోలో రివీల్ అవ్వడానికి ముందే కవరింగ్ లేకుండా న్యూ-జనరేషన్ హోండా జాజ్ మా కంటపడింది
హోండా జాజ్ కోసం dhruv ద్వారా అక్టోబర్ 19, 2019 10:57 am ప్రచురించబడింది
- 22 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హోండా యొక్క కొత్త జాజ్ ఎటువంటి కవరింగ్ లేకుండా గుర్తించబడింది మరియు ఇది భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రెండవ తరం జాజ్‌కు త్రోబాక్ లాగా కనిపిస్తుంది
- అక్టోబర్ 23 నుండి ప్రారంభమయ్యే 2019 టోక్యో మోటార్ షోలో న్యూ జాజ్ పూర్తిగా వెల్లడి అవుతుంది.
- హోండా యొక్క కర్వీ డిజైన్ థీమ్ మీకు రెండవ తరం జాజ్ ని మనకి గుర్తు చేస్తుంది.
- ఇది హోండా యొక్క డ్యూయల్-మోటార్ హైబ్రిడ్ వ్యవస్థను పొందుతుంది.
- 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో ఎప్పుడైనా భారతదేశానికి రావచ్చని అంచనా.
రాబోయే 2019 టోక్యో మోటార్ షోలో జాజ్ యొక్క తరువాతి తరం మోడల్ వెల్లడి అవుతుండడంతో హోండా అభిమానులకి ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఇంకా ఏమిటంటే, ఇది భారతదేశంలో ఎంతో ఇష్టపడే రెండవ తరం జాజ్ ని మీకు గుర్తు చేస్తుంది. మేము ఇంటర్నెట్ లో నాల్గవ-తరం అమేజ్ యొక్క చిత్రాన్ని చూసినందున మేము దీనిని చెప్పగలం.
ఈ చిత్రం కారు యొక్క ఫ్రంట్ ఎండ్ ను మాత్రమే చూపిస్తుంది, హోండా భవిష్యత్తులోకి వెళ్ళడానికి బదులుగా కొంత కాలం వెనక్కి వెళ్ళి తమ యొక్క కొత్త 2020 జాజ్ డిజైన్ కి తమ పాత కారు డిజైన్ ని స్పూర్తిగా తీసుకుంది. హెడ్‌ల్యాంప్‌ల యొక్క కర్వీ డిజైన్ తక్షణమే మీ మనస్సును భారతదేశంలో మనకు లభించిన మొట్టమొదటి జాజ్ వైపుకు తీసుకువెళుతుంది.
ప్రస్తుత థర్డ్-జెన్ జాజ్ తో కూడా దీనికి పోలికలు ఉన్నయి, మీసం లా ఉండే ఫ్రంట్ గ్రిల్ దానికి బలంగా ఉండే క్రోం బార్ దాని ముఖం భాగం మీదగా వెళుతుంది, దీని ప్రస్తుత తరం జాజ్ లో చిన్న చిన్న మార్పులతో కొద్దిగా నిలువుగా దానిని లిఫ్ట్ చేయడం జరిగింది. మిగిలిన హోండా వాహనాలలో కూడా అలాగే ఉంటుంది. స్పై షాట్ల ప్రకారం, వెనుక ప్రొఫైల్‌లో టెయిల్ ల్యాంప్స్ చుట్టూ తిరిగుతూ ఉంటుంది. లోపలి భాగంలో, జాజ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ స్క్రీన్‌తో కనీస లేఅవుట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
మేము రాబోయే జాజ్ యొక్క ఫ్రంట్ ఎండ్ మాత్రమే చూడగలిగాము, అది త్వరలోనే త్వరలో మనకి మొత్తం వెళ్ళడి అవుతుంది. హోండా ఇప్పటికే కొత్త జాజ్‌ను సరికొత్త డ్యూయల్-మోటారు హైబ్రిడ్ సిస్టమ్ తో అందిస్తున్నట్లు ప్రకటించింది, ఇది రాబోయే సిటీ లో ఉండే అవకాశం ఉంది.
2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో హోండా కొత్త జాజ్‌ను భారతదేశానికి తీసుకువస్తుందని మేము ఆశిస్తున్నాము. రాబోయే 2019 టోక్యో మోటార్ షో నుండి మరిన్ని అప్‌డేట్స్ కోసం కార్డెఖో.కామ్‌లో ఉండండి.
మరింత చదవండి: జాజ్ ఆటోమేటిక్
0 out of 0 found this helpful