ఆల్ట్రోజ్ؚతో పంచుకునే ఒక ముఖ్యమైన ఫీచర్ؚను వెల్లడిస్తున్న నవీకరించబడిన టాటా నెక్సాన్ కొత్త రహస్య చిత్రాలు
టాటా నెక్సన్ కోసం rohit ద్వారా ఏప్రిల్ 25, 2023 04:02 pm ప్రచురించబడింది
- 35 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మార్చి 2022లో ఆల్ట్రోజ్ؚలో తమ DCT (డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్) గేర్‌బాక్స్‌ను టాటా పరిచయం చేసింది
-
కొత్త రహస్య చిత్రాలలో రానున్న నెక్సాన్ؚలో DCT గేర్ స్టిక్ కోసం ఆల్ట్రోజ్-వంటి “పార్క్” మోడ్ؚను చూడవచ్చు.
-
టాటా ఈ SUVలో పాడిల్ షిఫ్టర్ؚలను అందిస్తుందని స్పై చిత్రాలు తెలియ చేస్తున్నాయి.
-
ఇతర కొత్త ఫీచర్‌లలో 360-డిగ్రీల కెమెరా మరియు ADAS కూడా ఉంటాయి.
-
ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్లుగా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚను పొందవచ్చు; కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను కూడా పొందవచ్చు.
-
2024 ప్రారంభంలో దీని విక్రయాలు ప్రారంభించవచ్చు; రూ.8 లక్షల నుండి వీటి ధర ప్రారంభం కావచ్చు (ఎక్స్-షోరూమ్).
ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే సబ్-4మీ SUVలలో ఒకటైన టాటా నెక్సాన్, మరొక నవీకరణ పొందనుంది. దీని టెస్టింగ్ మోడల్‌లు ఇప్పటికే కొన్నిసార్లు కనిపించగా, తాజా రహస్య చిత్రాలు మరిన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడిస్తున్నాయి.
అతి ముఖ్యమైన అప్ؚడేట్
నవీకరించిన నెక్సాన్‌లో టాటా, AMT ఎంపిక స్థానంలో, ఆల్ట్రోజ్‌లో ఉండే, డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ؚమిషన్‌ను (DCT) అందిస్తుందని తాజా రహస్య చిత్రాలు సూచిస్తున్నాయి. ఈ హ్యాచ్ؚబ్యాక్ తోటి వాహనంలో ఉన్న డ్రైవ్-సెలెక్ట్ మార్కింగ్ؚల విధంగానే “పార్క్” మోడ్ؚను కూడా పొందుతుందని కొత్త చిత్రాలు వెల్లడిస్తున్నాయి. DCT ఎంపికతో, SUV ఎక్విప్మెంట్ జాబితాకు ఈ కార్ తయారీదారు పాడిల్ షిఫ్టర్ؚలను కూడా జోడిస్తారని ఈ చిత్రాల ద్వారా తెలుస్తుంది.
గతంలో గమనించిన మార్పులు
ఇటీవల నవీకరించబడిన హ్యారీయర్-సఫారి జంట మరియు కొత్త నెక్సాన్ EV మాక్స్ డార్క్ ఎడిషన్ؚలో ఉన్న భారీ 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ؚతో నవీకరించబడిన నెక్సాన్ వస్తుందని మునుపటి స్పై షాట్లు నిర్ధారించాయి. అవిన్యాలో ఉన్నటుగా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, నీలి రంగు అప్ؚహోల్స్ట్రీ మరియు బహుశా డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను కూడా కొత్త నెక్సాన్ పొందవచ్చని ఈ చిత్రాలు తెలియచేస్తున్నాయి.
360-డిగ్రీల కెమెరా, అడ్వాన్సెడ్ డ్రైవర్ ఆసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) మరియు ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚల వంటి ఇతర ఫీచర్ అప్‌గ్రేడ్ؚలు ఉండవచ్చు. ప్రస్తుతం నెక్సాన్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
పవర్ؚట్రెయిన్ వివరాలు
నవీకరించబడిన నెక్సాన్ బహుశా మాన్యువల్ మరియు AMT ఎంపికలతో మునపటి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚను కొనసాగించవచ్చు. టాటా దీన్ని నవీకరించిన 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో (125PS/225Nm) కూడా అందించవచ్చు. పెట్రోల్ ఇంజన్ ఖచ్చితంగా DCT ఎంపికతో మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚను కూడా పొందుతుంది.
ధరలు మరియు పోటీదారులు
నవీకరించబడిన నెక్సాన్ؚను టాటా వచ్చే సంవత్సరం ప్రారంభంలో, రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేయవచ్చు. ఈ సబ్-4మీ SUV కియా సోనెట్, మహీంద్రా XUV300, హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కైగర్, మారుతి బ్రెజ్జా, నిసాన్ మాగ్నైట్ మరియు మారుతి ఫ్రాంక్స్ؚతో పోటీ పడవచ్చు.
ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ AMT