తదుపరి సంవత్సరం చివరి భాగంలో రాబోతున్న కొత్త మినీ కంట్రీమాన్
మినీ కూపర్ కంట్రీమ్యాన్ 2018-2021 కోసం manish ద్వారా జూలై 23, 2015 01:44 pm ప్రచురించబడింది
- 16 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: కొత్త మినీ ప్రస్తుతం ఉన్న మినీ కంట్రీమ్యాన్ ని భర్తీ చేయడానికి వస్తుంది. కొత్త మోడల్ కోడ్ నేమ్ ఎఫ్60, వచ్చే సంవత్సరం చివరిలో రంగ ప్రవేశం చేయనున్నదని భావిస్తున్నారు. 2016 మొదటి భాగంలో మినీ కాబ్రిలె ప్రారంభమైన తరువాత సంవత్సరం చివరి భాగంలో కొత్త కంట్రీ మ్యాన్ ని ప్రారంభించడానికి సిద్ధపడతారు.
ఇది డాకార్ ర్యాలీలో విజేతగా నిలిచినటువంటి మినీ ఎక్స్-రైడ్ నుండి ప్రేరణ పొంది స్పోర్టి స్టైలింగ్ తో పునఃరూపకల్పన చేయబడుతున్నది. ఇది పక్కన పెడితే, ఈ కొత్త కారు ప్రస్తుత మోడల్ కంటే మరింత విశాలంగా ఉంటుంది భావిస్తున్నారు. ఇది యు కె ఎల్ వేదిక మీద ఆధారపడి ఉంటుంది.
కంట్రీ మ్యాన్ యొక్క ఆఫ్ రోడింగ్ వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ కొత్త కంట్రీమ్యాన్ బి ఎం డబ్లు 2 సిరీస్ యాక్టివ్ టూరర్ నుండి హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ని తీసుకొని అమర్చబడుతుంది. దీని పొడవు 150mm మరియు వెడల్పు 10mm ఉన్న కారణం చేత ఈ కారు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. దీనితోపాటుగా ఈ కొత్త కంట్రీమాన్ అతిపెద్ద బూట్ స్పేస్ తో కూడా అందుబాటులో ఉంది.
మినీ భవిష్యత్తు ఐదు మోడల్ పోర్ట్ఫోలియో కింద మినీ సూపర్ లెగ్రా, కూపర్, క్లబ్మాన్, మినీ కాబ్రిలె మరియు కంట్రీమాన్ ఇలా అయిదు మోడల్స్ ఉన్నాక, మినీ కొత్త కంట్రీ మాన్ ని అధనంగా చేర్చి ఆరు మోడల్స్ చేస్తారా లేదా అనేది సందేహం.