నూర్బుర్గ్రింగ్ వద్ద బహిర్గతం అయిన కొత్త జాగ్వార్ ఎక్స్ ఎఫ్ మోడల్
జాగ్వార్ ఎక్స్ కోసం manish ద్వారా నవంబర్ 02, 2015 12:09 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
కొత్త జాగ్వార్ ఎక్స్ ఎఫ్ సెడాన్ యొక్క పొడవైన వీల్బేస్ వెర్షన్ టెస్ట్ మ్యూల్, పరీక్ష సమయంలో గూడచర్యం చెయ్యబడింది. ఈ లగ్జరీ సెడాన్ నూర్బుర్గ్రింగ్ వద్ద, బహిర్గతం అయినది మరియు ఇది, ప్రామాణిక ఎక్స్ ఎఫ్ వెర్షన్ తో పోలిస్తే ఏ విధమైన మార్పులను కలిగి లేదు. ఈ వాహనం పొడవైన వీల్బేస్ ను కలిగి ఉంది దీని కారణంగా వెనుక క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. వీటి వలన ఈ వాహనం లగ్జరీ గా కనపడటం మాత్రమే కాదు సెలూన్ యొక్క సౌకర్య అంశాలను కూడా అందజేస్తుంది. ప్రామాణిక ఎక్స్ ఎఫ్ వెర్షన్ తో పోలిస్తే పొడవైన వీల్బేస్ ను కలిగి ఉన్న ఈ వాహనం యొక్క వెనుక డోర్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ టెస్ట్ మ్యూల్ యొక్క వెనుక విండోస్ మరియు విండ్ షీల్డ్ నలుపు రంగుతో చాలా ఆడంభరంగా కనిపిస్తాయి. వెనుక క్యాబిన్ నవీకరణలకు సంబంధించి ఏ రకమైన నిర్ధారణ తేలియజేయలేదు.
మరోవైపు, పొడవైన వీల్బేస్ ను కలిగి ఉన్న ఈ వాహనం యొక్క బి పిల్లార్ ప్రక్క భాగంలో ఒక అదనపు స్థలం అందించబడుతుంది. అంతేకాకుండా, వెనుక క్యాబిన్ విశాలంగా ఉండటం వలన వెనుక భాగం లో ఉండే ప్రయాణికులకు, అదనపు లెగ్ రూం అందించబడుతుంది. ఈ వాహనాన్ని, ప్రస్తుతం ఉన్న ప్రామాణిక జాగ్వార్ ఎక్స్ ఎఫ్ మరియు ఎక్స్ ఎఫ్ ఎల్ వాహనాలతో పోలిస్తే కొన్ని అంగుళాలు ఎక్కువ పొడవుగా ఉంటుంది. కానీ, ప్రస్తుత మోడళ్ళతో పోలిస్తే, ఈ వాహనం ఖచ్చితంగా ఎంత ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. పెరిగిన క్యాబిన్ స్పేస్, ఒక మంచి వార్త ను తీసుకురాకపోవచ్చు. ఎందుకంటే ఈ వాహనం, ప్రస్తుతం ఉన్న ఎక్స్ ఎఫ్ మరియు ఎక్స్ ఎఫ్ ఎల్ వాహనాలలో ఉండే జాగ్వార్ యొక్క కొత్త 2.0 లీటర్ ఇంజన్ మరియు 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్ లతో వచ్చే అవకాశం ఉంది మరియు యాంత్రిక నవీకరణలకు బదులుగా శక్తి నుండి బరువు నిష్పత్తి తగ్గి రావచ్చు. ఈ ప్రత్యేక మోడల్ బహుశా, టెస్లా మరియు ఆడి వంటి కార్ల తయారీ సంస్థలతో పాటు చైనీస్ మార్కెట్ పై దృష్టి పెట్టింది. అంతేకాకుండా జాగ్వార్, బీజింగ్ మోటార్ వద్ద వచ్చే ఏడాది ప్రదర్శింపబడుతుంది.
0 out of 0 found this helpful