న్యూ ఆడి R8 వర్సెస్ మెర్సిడెస్ ఎఎమ్ జి GTఎస్ వాహనాలు రెండింటిలో ఏ వాహనం ముందంజలో ఉండబోతోంది?
ఆడి ఆర్8 కోసం sumit ద్వారా ఫిబ్రవరి 16, 2016 12:48 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఆడి ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్పో 2016 వద్ద దాని క్రొత్త R8 ని ప్రారంభించింది. కారు ధర రూ.2.47 కోట్లుతో మొదలవుతుంది. దీని ధరని దాదాపు అందరూ అనగా ఆటోమొబైల్ వారు అందరూ ఇప్పటికే ఊహించే ఉంటారు. మరింత శక్తివంతమైన వేరియంట్ (V10 పవర్ ప్లస్) ఇప్పుడు మరింత శక్తి స్థాయిలు కలిగిన 10-సిలిండర్ ఇంజన్ని అందిస్తుంది. అంతే కాక ఇది ఒక పరిసరాలతో అనుసందానం కలిగిన 12.3 అంగుళాల వర్చువల్ కాక్పిట్ వ్యవస్థ ని కూడా అందిస్తుంది. ఒక్కటేమిటి ఇందులో అన్ని రకాల కొత్త రకం ఫీచర్స్ ని అందిస్తుంది.
అయితే ప్రస్తుతం R8 ఇప్పటికే భారత మార్కెట్లో ఉంది కానీ ఇప్పుడు మరిన్ని అదనపు హంగులు జోడించబడిన ఈ కొత్త వాహనం అందరినీ మరింత ఉత్షాహం తో నింపడానికి దీనిని అందిస్తుంది. ఈ కారు ఇక్కడ మెర్సిడెస్ AMG GT తో పోటీ పడబోతుంది. దీని యొక్క ఎంపిక తప్పకుండా కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ఈ విభాగంలో ఎవరయితే ఒక కారుని తీసుకోవాలని అనుకుంటున్నారో వారి ఏమ్పికని సులభతరం చేసుకోవటానికి ఈ క్రింది నిర్దిష్ట లక్షణాలని రెండువాహనాలలో పోల్చి చూసుకుంటే అర్ధం అవుతుంది. ఒకసారి వీక్షించండి.
అవును, కొత్త R8 కూడా మెర్సిడెజ్ ఉత్పత్తి వాహనంలో లాగానే విద్యుత్తుని ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. దీని యొక్క మైలేజే తక్కువగా ఉంటుంది. ఈ విభాగంలో వాహనం కొనాలనుకునే వారు ఒకసారి ఈ విషయాన్ని పరిశీలించుకొని చూడండి. అయితే దీనిలో ముఖ్యమయిన విషయం ఏమిటంటే ఇది ఎక్కువ శక్తిని కలిగి ఉండి, మంచి పనితీరుని కలిగి ఉంటుంది. ఈ వాహనం 120 మిల్లీమీటర్ల అదనపు పొడవుని కలిగి ఉంటుంది. AMG GT S వాహనం కూడా అంతే పొడవుని కలిగి ఉంటుంది. మీరు రెండు కార్ల ప్రక్కన వ్యూని చూసినప్పుడు ఇది అర్ధం అవుతుంది. GT ఎస్ భారీగా కనిపిస్తూ అద్భుతంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ కారు చూసే వారందిరికీ ఒక స్పోర్టీ ఫీల్ ని కలిగిస్తుంది. రెండు కార్లు కూడా ఒకే ధరకి వచ్చినపుడు (GT ఎస్ రూ.2.5 కోట్లు) వినియోగదారులు ఏవి ఎక్కువ ఉత్సాహంగా ఉత్తేజపరుస్తుందో తెలియాల్సి ఉంది. కానీ తప్పనిసరిగా నూతన R8లో తాజా సాంకేతిక మరియు అభివృద్ధి లక్షణాలని అనగా నవీకరిచిన లక్షణాలని కలిగి ఉంటుంది.
0 out of 0 found this helpful