2.6 లక్షల కంటే అధికంగా ఉన్న మహీంద్రా పెండింగ్ ఆర్డర్‌లు, ఇందులో సుమారు 1.2 లక్షల ఆర్డర్‌లు స్కార్పియో N మరియు స్కార్పియో క్లాసిక్ؚలవే
మహీంద్రా ఎక్స్యూవి300 కోసం rohit ద్వారా ఫిబ్రవరి 14, 2023 04:31 pm ప్రచురించబడింది
- 68 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అత్యంత ప్రజాదరణ పొందిన తమ SUVల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని మహీంద్రా సాధ్యమైనంత కృషి చేస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆర్డర్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి
డిసెంబర్ 31, 2022 నాటికి ముగిసే మూడవ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలను ఇటీవల ఇన్వెస్టర్ మీటింగ్ؚలో మహీంద్రా వెల్లడించింది, ఈ కాలంలో తమ SUV శ్రేణి కొనుగోలులో 60 శాతం వృద్ధి సాధించింది అని పేర్కొంది. ఫిబ్రవరి 1 నాటికి తమ మొత్తం పెండింగ్ ఆర్డర్‌లు సుమారు 2.66 లక్షలుగా ఉన్నట్లు ఈ కారు తయారీదారు ప్రకటించారు.
పెండింగ్ ఆర్డర్‌లలో 70% వరకు స్కార్పియోలు, SUV700లు
మోడల్‌లు |
పెండింగ్ ఆర్డర్ |
స్కార్పియో N మరియు స్కార్పియో క్లాసిక్ |
1.19 లక్షలు |
XUV700 |
77,000 |
థార్ (థార్ RWDతో సహా) |
37,000 |
XUV300 మరియు XUV400 |
23,000 |
బొలెరో, బొలెరో నియో |
9,000 |
ఈ ఆలస్యం దేనికి?
పేరుకుపోతున్న తమ పెండింగ్ ఆర్డర్‌ల కారణాన్ని మహీంద్రా నేరుగా వెల్లడించకపోయినా అంతర్జాతీయ వివాదాలు, సరఫరా పరిమితులు, చిప్ కొరత మొదలైన ప్రపంచ సామాజిక-ఆర్ధిక కారకాల వలన ఆలస్యం జరుగుతున్నది అనేది స్పష్టంగా తెలుస్తుంది.
అంతేకాకుండా ప్రస్తుత జనరేషన్ థార్, XUV700తో ప్రారంభించి మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటి నుండీ మహీంద్రా కొత్త మోడల్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. XUV700 వాహనం కోసం వేచి ఉండాల్సిన సమయం రెండేళ్ళు అనే అపఖ్యాతిని మూటకట్టుకుంది. దీనికి తోడు, ఇటీవల వచ్చిన XUV400, స్కార్పియో Nలు తమ సంబంధిత విభాగాలలో అలజడిని సృష్టించాయి.
ఇవి కూడా చూడండి: పొదునైన రూఫ్ؚతో వింటేజ్-ఎరా జీప్ؚలా కనిపించిన భారతదేశపు మొదటి మహీంద్రా థార్
ఇలాంటి పరిస్థితులనే ఎదురుకుంటున్న ఇతర బ్రాండ్ؚలు
ఆర్డర్‌లను పూర్తి చేసే విషయంలో వెనుకబాటును ఎదుర్కొంటున్నది కేవలం మహీంద్రా మాత్రమే అని అనుకుంటున్నారా. తాము కూడా డెలివరీలలో ఆలస్యాలను ఎదుర్కొంటున్నామని మారుతి, హ్యుందాయ్ 2023 ప్రారంభంలో వెల్లడించాయి.
సంబంధించివవి: మహీంద్రా XUV700 కార్డ్ؚబోర్డ్ మోడల్‌ను చూడండి
కారు తయారీదారులు వారి వార్షిక ఉత్పత్తి సామర్ధ్యాలను పెంచుకోవడం ద్వారా ఈ పరిస్థితులను ఎదురుకోవచ్చు, ఫోర్డ్ؚ పాత ప్లాంట్ؚను కొనుగోలు చేసిన తరువాత టాటా చేస్తున్నది ఇదే. ఇది వేచి ఉండే సమయాన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా XUV300 AMT
0 out of 0 found this helpful