మినీ కొత్త తరం క్లబ్మ్యాన్ రంగప్రవేశం

మినీ కూపర్ క్లబ్మ్యాన్ కోసం arun ద్వారా జూన్ 29, 2015 04:52 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై: మినీ కొత్త తరం క్లబ్ మ్యాన్ వచ్చేసింది. మినీ సంస్థ యొక్కమోడళ్ల లైనప్ లో 3-డోర్ మరియు 5-డోర్ల దిగ్గజంగా పేరు పొందిన మినీ కూపర్ వెర్షన్ మళ్లీ వచ్చేసింది.

మినీ ఉత్పత్తి చేసే వాహనాలలో క్లబ్మ్యాన్ చాలా పెద్ద ఉత్పత్తి. ఇది 4.2 మీటర్ల పొడవు ను కలిగి ఉంది. ఈ కొత్త మినీ క్లబ్మ్యాన్ యొక్క కొలతలు మునుపటి తరం మినీ క్లబ్మ్యాన్ కంటే పెద్దగా ఉన్నాయి. ఇది కూడా 270 మి.మీ పొడవుగా, 73 మి.మీ వెడల్పుగా, మినీ 5-డోర్ల హాచ్ కంటే 100 మి.మీ వీల్బేస్ తో పెద్దగా ఉంది. దీని బూట్ 360 లీటర్ల వాల్యూమ్ ను కలిగి ఉంది, దీనిని వెనుక సీట్లు మడవటం ద్వారా దీనిని 1,250 లీటర్ల వరకు పొడిగించవచ్చు.

ఈ క్లబ్మ్యాన్, క్రోమ్ చుట్టూ దాని విస్తారమైన వృత్తాకార హెడ్ల్యాంప్స్ తో ఉండడం వలన , గ్రిల్ మీద హెక్సాగోనల్ ఆకృతులను కలిగి ఉండడం వలన, మరియు పవర్ తో కూడిన అధునాతన ఎంపికలతో ఇది సందేహం లేకుండా మినీ వలె కనిపిస్తోంది. డిఆర్ఎల్స్ తో కూడిన ఎల్ఈడి హెడ్ల్యాంప్స్ మినీకి అదనంగా ఆప్షనల్ గా ఉన్నాయి. ఒక మందపాటి నలుపు రక్షణ కవచం భారీ వీల్స్ ను పూరిస్తుంది మరియు కారు యొక్క పొడవు అంతటా వ్యాపించి ఉంటుంది. 

ఈ కారు వెనుక, ప్రత్యేకమైన స్ప్లిట్ టెయిల్-గేట్ ను కలిగి ఉంది, వీటిని విడివిడిగా లేదా ఒకే యూనిట్ గా తెరవవచ్చు. దీని భారీ టెయిల్-ల్యాంప్స్ మరియు రెండు ఖాళీ బీఫి బంపర్లు కారు వెనుక భాగాన్ని పూర్తిగా కవర్ చేస్తాయి. నాలుగు నాన్-మెటాలిక్ మరియు ఎనిమిది లోహపు పెయింట్ లతో కూడిన క్లబ్ మ్యాన్ లు దీని ప్ర్రారంభ సమయంలో అందుబాటులో ఉంటాయి. అవి మెల్టింగ్ సిల్వర్ లోహం మరియు మొదటి సారిగా ప్యూర్ బుర్గుండి లోహంతో మరియు మీ మినీ లాపిస్ లగ్జరీ బ్లూ వర్ణముతో తయారు చేయబడిన వివిధ రంగులతో రాబోవుచున్నాయి. రూఫ్ మరియు వెలుపలి మిర్రర్ క్యాప్స్ మాత్రం వైట్, బ్లాక్ లేదా ఏవైనా ఒక డిఫరెంట్ కలర్ తో రాబోవుచున్నాయి మరియు సిల్వర్ మాత్రం ప్రత్యేకమైనది గా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రాబోతుంది.

మినీలో అంతర్భాగాలు ప్రామాణికంగా జిగురుగా ఉన్న స్టీరింగ్ వీల్, ఎల్ఇడి బాక్ లైటింగ్ మరియు టోగుల్ స్విచ్లు తో (ఒక 6.5 లేదా 8.8 అంగుళాల స్క్రీన్) కలిగియున్న వృత్తాకార సెంట్రల్ స్క్రీన్ ని కలిగి ఉంటుంది. దీని వెనుక సీట్లు సాధారణంగా 60:40 మడవగలిగే సీట్లు వస్తాయి. అదేవిధంగా 40:20:40 మడవగలిగే సీట్లు ఆప్ష్నల్ గా ఎంచుకునేందుకు అందుబాటులో ఉన్నాయి.

ఈ కొత్త మినీ క్లబ్ మాన్ రెండు పెట్రోల్ ఇంజన్లు మరియు 4 సిలిండర్లు కలిగినటువంటి ఒక డీజిల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది. కూపర్ క్లబ్ మాన్ 3 సిలిండర్ టర్బో-చార్జ్డ్ 1.5 లీటర్ ఇంజన్, 136 హెచ్ పి శక్తిని మరియు 220 టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. కూపర్ డి క్లబ్ మాన్ కొత్త 2 లీటరు, 4 సిలిండర్ ఇంజన్, 150హెచ్ పి మరియు 350ఎన్ ఎం టార్క్ ని అందిస్తుంది. కూపర్ ఎస్ క్లబ్ మాన్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 192హెచ్ పి మరియు ట్విస్ట్ 280ఎన్ ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6 స్పీడ్ మాన్యువల్ లు మరియు 6 స్పీడ్ స్టెప్ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లు అందుబాటులో ఉన్నాయి. కూపర్ ఎస్ క్లబ్ మాన్ మరియు కూపర్ డిక్లబ్ మాన్ రెండూ కూడా 8 స్పీడ్ స్పెట్రోనికల్, పెడల్ షిఫ్టర్స్ తో పాటూ అందుబాటులో ఉన్నాయి. 

మినీ ప్రస్తుతం భారతదేశం లో (3-డోర్, 5-డోర్ మరియు కన్వర్టబుల్) మోడల్స్ ని కంట్రీ మాన్ తో పాటుగా విక్రయిస్తుంది. ఈ క్లబ్ మాన్ భారత దేశంలో వస్తుందా రాదా అనేది సందేహం. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మినీ కూపర్ Clubman

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience