• English
  • Login / Register

మారుతీ వారు టోక్యో మోటరు షో 2015 లో ఇగ్నీస్ ని ప్రదర్శించనున్నారు

అక్టోబర్ 01, 2015 10:48 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మారుతీ సుజూకీ ఇగ్నిస్ అలియాస్ im-4, రాబోయే టోక్యో మోటరు షోలో దర్శనం ఇవ్వనుంది. వచ్చే కాలంలో భారతదేశానికి అలాగే ప్రపంచానికి అందించనున్నాము అని ప్రకటించిన 15 కార్లలో ఈ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ కూడా ఒకటి.

దీని తయారీ అంతకు మునుపు చూపించిన కాన్సెప్ట్ మాదిరిగానే ఉంది. డబ్బా ఆకారంలో ఉండే ఈ కారుకి ముందున వెడల్పాటి గ్రిల్లు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ తో ఉన్న డేలైట్ రన్నింగ్ ల్యాంప్స్ వరకు సాగి ఉంటుంది. కిందకు దించిన నంబర్ ప్లేట్ వలన బంపర్ ఇంకాస్త సాఫీగా క్రోము పూత ఉన్న ఫాగ్ ల్యాంప్స్ తో ఉంది. దీనికి అల్లోయ్ వీల్స్ జత చేయబడ్డాయి. స్విఫ్ట్ మరియూ బలేనో లో ఉన్నట్టుగానే A మరియూ B పిల్లర్స్ బ్లాక్ లో ఉన్నాయి.

కారు లోపల డ్యువల్-టోన్ డ్యాష్‌బోర్డ్ కి పెద్ద టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టము రావొచ్చు. ఇతర మారుతీ కార్ల లా కాకుండా ఇందులో విభిన్నంగా ఉండేందుకు వినూత్న స్టీరింగ్ వీల్ అందించడంతో పాటుగా సెంట్రల్ కన్సోల్ లో AC కంట్రోల్ ని అమర్చవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎలా ఉంటుంది అనేది తెలియరాలేదు కానీ భిన్నంగా అయితే ఉండవచ్చును.

ఇందులోని ఇంజిను విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు కాని, 1.0-లీటర్ టర్బో చార్జ్‌డ్ బూస్టర్ జెట్ ఇంజిను ఉండవచ్చు. పైగా, స్విఫ్ట్ నుండి 1.2-లీటర్ మోటరు, సియాజ్ నుండి 1.3-లీటరు SHVS మైల్డ్ హైబ్రీడ్ డీజిల్ తాత్కాలికంగా పునికి తెచ్చుకోవచ్చును. విడుదల వచ్చే ఏడాది ఉండవచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience