• English
  • Login / Register

మారుతి స్విఫ్ట్ డీజిల్ vs హ్యుందాయ్ గ్రాండ్ i10 డీజిల్ - రియల్ వరల్డ్ పెర్ఫామెన్స్ & మైలేజ్

మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం dinesh ద్వారా మార్చి 29, 2019 12:16 pm ప్రచురించబడింది

  • 247 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Maruti Suzuki Swift VS Hyundai Grand i10

మారుతి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ i10 తమ సంస్థల జాబితాలో లో-ఎండ్ వేరియంట్స్ మరియు ప్రీమియం హ్యాచ్బ్యాక్ల మధ్య స్థానంలో ఉన్నాయి. ఈ రెండు హ్యాచ్బ్యాక్లు పోటీ పరంగా మంచి ధరను కలిగి ఉన్నాయి మరియు విస్తృతమైన పరికరాలు జాబితాను అందిస్తున్నాయి. మీరు మార్కెట్ లో ఈ రెండిటిలో ఏదో ఒక కారు డీజిల్ లో కొనుగోలు చేయాలనుకుంటే, మీ కొనుగోలు నిర్ణయాన్ని సులభతరం చేయడానికి ఈ కార్ల యొక్క వాస్తవిక పనితీరు మరియు మైలేజ్ ఫలితాలు ఇక్కడ ఉన్నాయి.

ఆక్సిలరేషన్ మరియు రోల్ ఆన్ టెస్ట్‌లు: గ్రాండ్ i10 వేగంగా ఉంటుంది,ఇది దీనిలో చాలా ముఖ్యమైన అంశం.

కార్

0-100kmph

30-80kmph

మారుతి స్విఫ్ట్

12.38s

8.54s

హ్యుందాయ్ గ్రాండ్ i10

13.21s

7.93s

స్విఫ్ట్ మరియు గ్రాండ్ i10 రెండూ కూడా డీజిల్ ఇంజిన్ లో 75Ps శక్తిని ని అందిస్తున్నాయి మరియు రెండు ఇంజిన్లు కూడా అదే 190Nm టార్క్ ని అందజేస్తాయి. కానీ స్విఫ్ట్ యొక్క 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ 4 సిలిండర్ యూనిట్, గ్రాండ్ i10 యొక్క 1.2 లీటర్ ఇంజన్ 3 సిలిండర్లు కలిగి ఉన్నాయి.

Hyundai Grand i10

0-100Kmph పరీక్షలో, స్విఫ్ట్ కారు గ్రాండ్ i10 ను ఓడించింది, ఇది 12.38 సెకన్లలో 100Kmph మార్క్ ని చేరుకుంది, గ్రాండ్ i10 కారు 13.21 సెకన్లలో 100kmph మార్క్ ని చేరుకోగా స్విఫ్ట్ కారు i10 కంటే 0.83 సెకన్లు ముందంజలో ఉంది. అయితే, అది 30kmph నుండి 80kmph వరకూ ఇన్-గేర్ ఆక్సిలరేషన్ విషయానికి వస్తే గ్రాండ్ i10 స్పీడ్ గా ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్  30kmph-80kmph వరకూ 8.54 సెకెండ్స్ లో చేరుకోగా, గ్రాండ్ i10 కారు 7.93 సెకెండ్స్ లో  చేరుకొని స్విఫ్ట్ కంటే ముందంజలో ఉంది. దీనికి గల కారణం గ్రాండ్ i10 ఇంజిన్  1750rpm వద్ద  గరిష్ట టార్క్ తో విస్తృతమైన టార్క్ బ్యాండ్ ని కలిగి ఉండవచ్చని మేము భావిస్తున్నాము, స్విఫ్ట్ 2000rpm వద్ద టార్క్ ని అందిస్తుంది.

బ్రేక్ టెస్ట్: స్విఫ్ట్ ఇక్కడ లీడ్ లో ఉంది

కార్

100-0kmph

80-0kmph

మారుతి స్విఫ్ట్

42.40m

27.08m

హ్యుందాయ్ గ్రాండ్ i10

47m

28.3m


భారతదేశంలో చాలా ఇతర సామూహిక మార్కెట్ కార్లు వలే స్విఫ్ట్ మరియు గ్రాండ్ i10 రెండూ కూడా ముందు భాగంలో డిస్క్ బ్రేక్లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్లను పొందుతున్నాయి. బ్రేకింగ్ టెస్ట్ లో, స్విఫ్ట్ 100Kmph నుండి స్థిరమైన పొజిషన్ కి రావడానికి  గ్రాండ్ i10  కంటే 45 సెకెన్స్ తక్కువ సమయం తీసుకుంటుంది మరియు 4.6 మీటర్స్ ముందుగా ఆగుతుంది.

ఇంధన సామర్ధ్యం

Maruti Suzuki Swift

2018 లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి,కారు మంచి ఇంధన సామర్థ్యాన్ని ఇస్తే గనుక కొంత ఉపశమనం వస్తుంది. ఇంధన సామర్ధ్యం గురించి మాట్లాడుకుంటే, స్విఫ్ట్ డీజిల్ సిటీ ట్రాఫిక్ లో 19.74Kmpl మైలేజ్ ఇవ్వగా ఇది గ్రాండ్ i10 కంటే కొద్దిగా బెటర్ ఎందుకంటే గ్రాండ్ i10 19.1Kmpl మైలేజ్ ని అందిస్తుంది. మీరు ఎక్కువగా నగరంలో డ్రైవింగ్ చేస్తున్నట్లయితే, ఈ కార్లు ఇంధన సామర్ధ్యం దృక్పథంలో మంచి ఎంపిక ఉంటుంది.

ఏదేమైనప్పటికీ, స్విఫ్ట్ కారు గ్రాండ్ i10 తో పోలిస్తే హైవే మీద మరింత ఇంధన సామర్థ్యం ఉన్న కారుగా మారుతుంది. స్విఫ్ట్ 27.38Kmpl మైలేజ్ అందించగా, గ్రాండ్ i10 కారు 22.19Kmpl  మైలేజ్ ని అందిస్తుంది. మీరు ఇంధన సామర్ధ్యం గురించి ఆలోచించినట్లయితే మరియు మరింత తరచుగా హైవే పై డ్రైవ్ చేయాలనుకున్నా మీకు స్విఫ్ట్ చాలా మంచి ఎంపిక.

ఈ రెండింటి మధ్య ఇంకా అయోమయంగా ఉన్నారా? స్విఫ్ట్ Vs  గ్రాండ్ i10 సమీక్ష ఇక్కడ చూడండి.  

రెండు కార్లు సాంకేతిక వివరాలు ఇక్కడ ఉన్నాయి.

 

మారుతి స్విఫ్ట్

హ్యుందాయ్ గ్రాండ్ i10

ఇంజిన్

1.3-లీటర్, 4-సిలిండర్ డీజిల్

1.2 లీటర్ 3 సిలిండర్ డీజిల్

పవర్

75PS @ 4000rpm

75PS @ 4000rpm

టార్క్

190Nm @ 2000rpm

190Nm @ 1750-2250rpm

ట్రాన్స్మిషన్

5MT / AMT

5MT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti స్విఫ్ట్ 2014-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience