• English
  • Login / Register

ఆటో గేర్ షిఫ్ట్ కార్ల కు మారుతీ సుజూకీ 50,000 అమ్మకాలు నమోదు చేసింది

సెప్టెంబర్ 24, 2015 04:47 pm cardekho ద్వారా సవరించబడింది

  • 18 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: దేశంలోని అతి పెద్ద కారు తయారీదారి అయిన మారుతీ వారు 50,000 యూనిట్ల ఆటో గేర్ షిఫ్ట్ టేక్నాలజీలను అమ్మి మరొక ఘనత సాధించారు. కంపెనీ వారు టెక్నాలజీ ని వారి చిన్న కారు అయిన సెలెరియో లో అమర్చిన తరువాత ఈ విజయం కేవలం 1.5 సంవత్సరాల తక్కువ కాలంలోనే సాధించారు. తరువాత, మారుతీ వారు ఇదే టెక్నాలజీని ఆల్టో K10 లో కూడా ఈ టెక్నాలజీ ని అమర్చారు. ఈ ఘనత కంపెనీ వారి లక్ష్యం అయిన 2020 కి 2 మిలియన్ల అమ్మకాలు చేయాలి అన్నదాని కి అణుగునంగానే ఉంది.

ఆటోమాటిక్ గేర్ షిఫ్ట్ టెక్నాలజీ కార్ల అమ్మకాలు ఇది అందించే వెసులుబాటు గురించి అని కంపెనీ వారు తెలిపారు. ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు, ఈ ఆటోమాటిక్ కార్లు డ్రైవరు తొందర పడకుండ చూసుకోవడమే కాక మైలేజీని కూడా పెంచుతుంది.

"కొనుగోలు చేసే సామర్థ్యం మరియూ మైలేజీ దెబ్బతినకుండా ట్రాఫిక్ లో సులువుగా నడపగలిగే వీలు వంటి ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ యొక్క లక్షణాలు వలన ఈ కారు దేశం అంతటా పేరు పొందింది," అని మారుతీ సుజూకీ ఇండియా లో మార్కెటింగ్ & సేల్స్ విభాగానికి ఎగ్జెక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆర్ ఎస్ కల్సీ అన్నారు. కంపెనీ వారు మరిన్ని కస్టమర్ ఫ్రెండ్లీ టెక్నాలజీలను తీసుకువస్తుంది అని ఆయన అన్నారు.  

ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ పై కస్టమర్ల మక్కువ పెరుగుతుంది అనే విషయం ఏజీఎస్ వేరియంట్ అయిన సెలెరొయో మరియూ ఆల్టో k10 మొత్తం అమ్మకాలలో 25% భాగం పొందినప్పుడే అర్థం అయ్యింది. ఆటోమాటిక్ కార్లపై కస్టమర్ల ఆసక్తిని గమనించి, మహింద్రా మరియూ టాటా వారు కూడా జెస్ట్ ఇంకా TUV 300 ఆటోమాటిక్ వేరియంట్స్ ని విడుదల చేశారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience