మారుతి S-క్రాస్ ప్రత్యేక ఎడిషన్ ని రూ. 8.99 లక్షల వద్ద ప్రారంభించింది
మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం అభిజీత్ ద్వారా డిసెంబర్ 10, 2015 05:43 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మారుతి సంస్థ 'ప్రీమియా'అనే S-క్రాస్ యొక్క ప్రత్యేక ఎడిషన్ ని ప్రారంభించింది. ఈ కారు S-క్రాస్ DDiS200 డెల్టా వేరియంట్ ఆధారంగా ఉంది మరియు ఇది రెండవ వేరియంట్. ఇది రూ. 8.99 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లక్షల ధర వద్ద ప్రారంభించబడి ప్రామాణిక కారులో అందుబాటులో లేని అదనపు లక్షణాలను కలిగి ఉంది.
దీనిలో అల్లాయ్ వీల్స్, ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS, కలర్ డిస్ప్లేతో గర్మిన్ నావిగేషన్ సిస్టమ్, కెమెరా మరియు ఫాగ్ ల్యాంప్స్ తో రేర్ పార్కింగ్ సహాయాన్ని అందిస్తుంది. ప్రీమియా వెర్షన్ ఒక ప్రత్యేక వెర్షన్ అయినప్పటికీ ప్రామాణిక డెల్టా వేరియంట్ కంటే అధనపు ఆఫరింగ్స్ తో తక్కువ ధర వద్ద అందించబడింది.
ఒక లిమిటెడ్ వెర్షన్ గా, ఈ S-క్రాస్ మాత్రమే పరిమిత కాల డీలర్షిప్ల వద్ద ఉంటుంది. అంతేకాకా యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండి నగరాల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రీమియా వెర్షన్ యొక్క ప్రారంభంతో ఈ ప్రత్యేక కారు సేల్స్ మరింతగా పెరగాలనే లక్ష్యంతో ఉంది.
ఒక 1.3-లీటర్ డీజిల్ ఇంజన్ శక్తితో , S-క్రాస్ DDiS200 90PS శక్తిని మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది. ఇది కాకుండా, 1.6 లీటర్ DDiS320 ఇంజన్ కూడా అందుబాటులో ఉంది మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది.
ఇంకా చదవండి