• English
  • Login / Register

మారుతి బాలెనో వేరియంట్స్ - మీకు ఏది ఉత్తమమైనదో తెలుసుకోండి

మారుతి బాలెనో 2015-2022 కోసం nabeel ద్వారా డిసెంబర్ 09, 2015 03:52 pm ప్రచురించబడింది

  • 21 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మారుతి బాలెనో  ఒక తుఫాను లాగా  భారత ఆటోమోటివ్ మార్కెట్ లోనికి అడుగు పెట్టింది. ఇది ఇప్పటికే 40,000 బుకింగ్స్ దాటి చాలా దృఢంగా ఉంది. ఇంకా, ఇది ఒక మరింత శక్తివంతమైన డీజిల్ ఇంజన్ ని త్వరలోనే పొందవచ్చు, తద్వారా ఎవరైతే తక్కువ శక్తి అందిస్తుందని పిర్యాదు చేసారో వాళ్ళకి తృప్తి కలుగుతుంది. బాలెనో, ఇప్పటివరకు నవంబర్ 2015 నెలలో  6 వ స్థానం వద్ద భారతదేశం లో టాప్ టెన్ బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ప్రవేశించి ఉంది. దాని ప్రత్యర్ద్ది హ్యుందాయి ఎలీట్ ఐ20 22% శాతం అమ్మకాల తరుగుదలను చూడడంతో ఇది విజయం సాధించింది. అంతేకాకుండా,  స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కూడా 34% అమ్మకాల తరుగుదలతో మారుతి బాలెనో మరింత విజయం సాధించిందని చెప్పవచ్చు. చాలా మంది పాఠకులు మారుతి బాలెనో యొక్క ఏ వేరియంట్ కొనుగోలు చేసుకోవాలో తేల్చుకోలేక పోతున్నారు. అందువలన ఇక్కడ బాలెనో వేరియంట్ యొక్క సమగ్ర సమాచారం అందించడం జరిగింది.         

మారుతి బాలెనో పెట్రోల్ మరియు డీజిల్ రెండిటిలోని 4 వేరియంట్స్ తో వస్తుంది; అవి సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డెల్టా పెట్రోల్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. సిగ్మా వేరియంట్ కొత్తగా ఎంట్రీ లెవల్ కారు నుండి ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో అడుగు పెట్టాలనుకునేవారికి చాలా ఉత్తమమైన కారు. ఆల్ఫా వేరియంట్ ఎవరైతే రెండవ కారు కొనాలనుకుంటారో లేదా హ్యాచ్‌బ్యాక్ కావాలనుకుంటారో వారికి సరైనది. సమకాలిన మార్కెట్ కి విభిన్నమైన ధర ను కలిగి ఉన్న బాలెనో యొక్క ప్రతీ వేరియంట్ పైన మరింత వివరాలు తెలుసుకోండి   

సిగ్మా

బేస్: పెట్రోల్: రూ. 4.99 లక్షలు, డీజిల్: రూ. 6.16 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ఇది కారు యొక్క బేస్ వేరియంట్. ఇది అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంది, కానీ మిగిలిన వేరియంట్స్ అందించేటటువంటి విలాశవంతమైన సౌకర్య లక్షణాలను ఇది అందించడంలో కోల్పోయింది. వినియోగదారులు తక్కువ బడ్జెట్ తో  మొదటిసారి ప్రీమియం హాచ్ వేరియంట్ పై వెళ్ళాలి అనుకుంటుంటే వారికి ఇది సరైన హ్యాచ్‌బ్యాక్. ఈ వేరియంట్ కి సంబందించి కొన్ని కీలకమైన లక్షణాలు

. శరీర రంగు డోర్ హ్యాండిల్స్
. స్టీల్ వీల్స్
. డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్
. EBD తో ABS
. పవర్ విండోస్ (ఫ్రంట్ మాత్రమే)
. సెంట్రల్ లాకింగ్
. టిల్ట్  ఫంక్షన్ తో పవర్ స్టీరింగ్
. హీటర్ తో మాన్యువల్ AC
. యాంటీ తెఫ్ట్ సేఫ్టీ సిస్టం

డెల్టా

పెట్రోల్: రూ. 5.71 లక్షలు (CVT: రూ. 6,76 లక్షలు), డీజిల్: రూ. 6.81 లక్షలు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ఈ వేరియంట్ లో మారుతి  ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందిస్తుంది. అలాగే, ఈ వేరియంట్ బేస్ వేరియంట్ కి ముందు గ్రిల్, పూర్తి వీల్ క్యాప్  మరియు అనేక ఫంక్షనల్ లక్షణాలు వంటి అధనపు  కాస్మెటిక్ లక్షణాలు అందిస్తుంది. ఎవరైతే ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ కి కొత్తగా ఉండి,  కారుని డీసెంట్ లక్షణాలతో కావాలనుకుంటారో వారికి ఈ విభాగం మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా CVT ట్రాన్స్మిషన్ యొక్క ఎంపికతో, చాలా మంది వినియోగదారులు దీనిపై ఆకర్షితులు అవుతారు. ఈ వేరియంట్ కి సంబందించి కొన్ని కీలకమైన లక్షణాలు

. ORVM ల పై టర్న్ ఇండికేటర్స్
. డోర్ హ్యాండిల్స్ మరియు పార్కింగ్ బ్రేక్ లోపల మెటల్ ఫినిష్
. పించ్ గార్డు పవర్ విండో (డ్రైవర్)
. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు
. వెనుక వైపర్, వాషర్ మరియు డీఫాగర్
. FM/MP3/CD తో ఆడియో, బ్లూటూత్, ఆక్స్ మరియు USB
. స్టీరింగ్ పై అమర్చబడిన ఆడియో కంట్రోల్
. రిమోట్ కీలెస్ ఎంట్రీ
. అన్ని పవర్ విండోస్
. విద్యుత్ తో మడతవేయగల ORVMs
. ఆటో AC
. 60: 40 స్ప్లిట్ సీటు (రేర్)
. ఆటో అప్ పవర్ విండో (డ్రైవర్)

జీటా

పెట్రోల్: రూ . 6,31 లక్షలు, డీజిల్: రూ. 7.41 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ఎవరైతే లక్షణాలు మరియు విలాశవంతమైన విషయాలలో రాజీ పడరో అటువంటి వారికి జీటా వేరియంట్ సంపూర్ణమైన వాహనం. ఈ వేరియంట్ దాదాపు అన్ని ప్రీమియం సౌందర్య మరియు సౌకర్యవంతమైన లక్షణాలను అందించి మీ ప్రయాణాన్ని మరింత సుఖంగా చేస్తుంది. ఈ వేరియంట్ యొక్క కొన్ని కీలక అంశాలు.  

. క్రోం  డోర్ హ్యాండిల్స్
. మిశ్రమ లోహ చక్రాలు
. UV కట్ గ్లాస్
. గ్లోవ్ బాక్స్, లగేజ్ రూం మరియు  ఫ్రంట్ ఫుట్ వెల్ ఇల్ల్యుమినేషన్
. మల్టీ  ఇన్ఫర్మేషన్ స్పీడోమీటర్ ట్Fట్ ప్లస్ రంగు ప్రదర్శన
. లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్
. ఆటో డిమ్మింగ్  IRVM
. టెలీస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్
. ఫాలోమీ హోం/లెడ్ టు వెహికెల్
. స్టోరేజ్ తో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్
. ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
.  స్మార్ట్ కీ తో పుష్ స్టార్ట్/స్టాప్

ఆల్ఫా

పెట్రోల్: రూ. 7.01 లక్షలు, డీజిల్: రూ. 8.11 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)  

ఆల్ఫా మారుతి బాలెనో యొక్క అగ్ర శ్రేణి వేరియంట్. ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ నుండి ఆశించే అన్ని లక్షణాలను కలిగి ఉంది. ఎవరైతే విలాశవంతమైన హ్యాచ్‌బ్యాక్ కావలనుకుంటారో వారికి ఇది సరైన హ్యాచ్‌బ్యాక్. దీనిలో దాదాపు అన్ని లక్షణాలు జీటా ట్రిం కి సమానంగా ఉంటాయి, అధనంగా DRLs మరియు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ వంటి లక్షణాలు ప్రజలను ఈ ట్రిం వైపు ఆకర్షించేందుకు బహుశా అందించడం జరిగింది. ఈ కారు అనేక సౌందర్యకరమైన లక్షణాలతో అందించబడుతుంది. ఇక్కడ టాప్ వేరియంట్ యొక్క కొన్ని కీలక అంశాలు అందించడం జరిగింది.  

. LED తో పగటి పూట నడిచే లైట్లు
. ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్
. స్మార్ట్ ప్లే  సమాచార వినోద వ్యవస్థ
. రేర్ పార్కింగ్ కెమెరా
. నావిగేషన్ వ్యవస్థ
. వాయిస్ కమాండ్
. స్మార్ట్ఫోన్ కనెక్ట్ / ఆపిల్ కార్‌ప్లే

మారుతి బాలెనో యొక్క మొదటి డ్రైవ్ వీక్షించండి

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience