ఆటో ఎక్స్పో 2016 కి రానున్న మారుతి ఇగ్నిస్
జనవరి 19, 2016 01:23 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి ఇగ్నిస్ నొయిడాలో జరగనున్న రాబోయే 2016 ఆటో ఎక్స్పోలో రావడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు ఆటోమొబైల్ ఈవెంట్ కోసం మారుతి సంస్థ యొక్క లైనప్ లో భాగంగా ఉంటుంది. అక్కడ బాలెనో ఆర్ఎస్ మరియు విటారా బ్రెజ్జా వంటి కార్లలో కొత్త టెక్నాలజీ లు ప్రదర్శించబడనున్నాయి.
ఇగ్నిస్ మొదటి టోక్యో మోటార్ షో 2015 వద్ద ఆవిష్కరించబడింది మరియు మహీంద్రా KUV100 వంటి వాటితో పోటీ పడనున్నది. ఎక్స్పో వద్ద కేవలం కాన్సెప్ట్ ఇగ్నిస్ బహిర్గతమవుతుందని భావిస్తున్నారు, అయితే ఉత్పత్తి కారు తరువాత ఈ సంవత్సరం ప్రారంభం కావచ్చు. దీని ధర రూ. 4.5 లక్షల నుండి రూ. 7 లక్షల పరిధిలో ఉండవచ్చని అంచనా.
యాంత్రికంగా ఇగ్నిస్ వాహనం బాలెనో లో ఉన్నటువంటి అదే ఇంజన్ చే ఆధారితం చేయబడే అవకాశం ఉంది. బాలెనో వాహనం 1.3 లీటర్ DDiS డీజిల్ ఇంజన్ ని కలిగి ఉండి 74 బిహెచ్పిల గరిష్ట శక్తిని మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ని అందిస్తుంది. పెట్రోల్ వైపున, అది 1.2 లీటర్ ఇంజన్ చే అమర్చబడి 83.1 bhp శక్తిని అందిస్తుంది.
గత ఏడాది చేసిన ప్రకటనను అనుసరించి, మారుతి ఇటీవల తన నమూనాల ధరలు పెంచింది. దాని ప్రారంభ స్థాయి హాచ్బాక్ ఆల్టో మరియు S- క్రాస్ వరుసగా రూ. 1,000 మరియు రూ.4,000 లకు పెంచబడింది మరియు బాలెనో రూ.5,000 నుండి రూ. 12,000 పెంచబడింది.