మారుతి & హ్యుందాయి జనవరి అమ్మకాలలో కొంచెం క్షీనత నమోదు చేసుకున్నాయి
ఫిబ్రవరి 03, 2016 11:34 am nabeel ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- ఒ క వ్యాఖ్యను వ్రాయండి
మారుతి మరియు హ్యుందాయి రెండు సంస్థలు కూడా జనవరి 2016 అమ్మకాల్లో తగ్గుదలను చూశాయి. దానికి కారణం బహుశా ధరల పెంపు, చాలా మంది వినియోగదారులకు గత ఏడాది కార్లు కొనుగోలు చేసి రూ. 12,000 వరకూ ఆదా చేసుకోగలిగారు. అయితే మారుతి సంస్థ 2.6% క్షీణించగా, హ్యుందాయి సంస్థ చిన్నగా 1.23% క్షీణత నమోదు చేసుకుంది. జనవరిలో మారుతి సంస్థ రూ .4,000 వరకు అన్ని తన కార్ల ధరలను పెంచగా, హ్యుందాయి సంస్థ రూ .12,000 ధరలను పెంచింది. హ్యుందాయ్ సంస్థ రూ. 30,000 వరకూ ధరల పెంపు ప్రకటించగా ఇది జనవరి 2016 నుండి వర్తిస్తాయని చెప్పవచ్చు. అంతేకాక, ఈ వార్త భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) వాహనాల అమ్మకాల పెరుగుదల పద్నాలుగో వరుస నెలలలో పెరుగుతాయని ప్రకటించినప్పుడు వచ్చింది. ఈ నివేదిక డిసెంబర్ 2015 లో వచ్చింది. 172,671 యూనిట్లు తయారీదారుల నుండి డీలర్షిప్లకు పమపడం జరిగింది.
మారుతి సంస్థ గత ఏడాది ఇదే నెలలో 1,16,606 యూనిట్లు విక్రయించగా, ఈ నెల 1,13,606 యూనిట్లు అమ్మకాలు చేసింది. ఈ సంఖ్య దిగుమతులు మరియు ఎగుమతులు మొత్తం కలగలిపి వచ్చింది. దేశీయ దృష్టాంతంలో జనవరి 2015 సంవత్సరంలో 1,05,559 యూనిట్లు అమ్మకాలు కాగా, ఈ యేడాది 1,06,383 యూనిట్ల అమ్మకాలతో 0.8% పెరుగుదల కనిపించింది. జిప్సీ, గ్రాండ్ విటారా మరియు ఎర్టిగా తో ఉన్న యుటిలిటీ వాహనాల అమ్మకాలు జనవరి 2015 లో 6,432 యూనిట్లతో పోలిస్తే జనవరి 2016లో 8,114 యూనిట్ల అమ్మకాలతో 26.2% పెరిగింది. " దేశీయ అమ్మకాలు అమ్మకాలు అధికంగా ఉండవచ్చు కానీ జనవరి 2016 లో పని రోజులు తక్కువ సంఖ్యలో ఉండడం మూలాన మొత్తం ఉత్పత్తి మరియు డిస్పాచ్ పైన ప్రభావం చూపబడి అమ్మకాల తగ్గుదలకి కారణమయ్యింది. " అని మారుతి సంస్థ తెలిపింది. ఎగుమతులు జనవరి 2015 లో 11,047 యూనిట్లతో పోల్చుకుంటే ఇప్పుడు 7,223 యూనిట్ల విదేశీ అమ్మకాలతో 34.6% క్షీణించింది.
హ్యుందాయి సంస్థ ఏడాది ఇదే కాలంలో 44,783 యూనిట్లు అమ్మకాలతో పోలిస్తే జనవరి 2016 ఈ ఏడాది 44,230 యూనిట్లు విక్రయించింది. దేశీయ అమ్మకాలు జనవరి 2015 లో 34,780 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది 38,016 యూనిట్లు అమ్మకాలు చేయబడి 9.3% పెరుగుదలని నమోదు చేసుకుంది. ఎగుమతులు కూడా 2015 ఇదే కాలంలో 10,003 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది 6,214 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయి సంస్థ కూడా కొంతవరకూ నిరాశ చెందింది. ఈ సంస్థకి 37.87% క్షీణించింది.
హెచ్ఎంఐఎల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్), రాకేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ "గత సంవత్సరం గ్రాండ్ క్రెటా మరియు ఐ 20 ఎలైట్ / యాక్టివ్ వంటి ఉత్పత్తుల బలమైన ప్రదర్శనతో అభివృద్ధి జోరందుకుంది. " ఆటో ఎక్స్పో లైనప్ కోసం వ్యాఖ్యానిస్తూ " మేము మా ఉత్పత్తులు మరియు టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు పెరుగుతున్న ఆకాంక్షలను చేరుకొనేందుకు ఆటో ఎక్స్పోలో హ్యుందాయ్ యొక్క ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాము. " అని తెలిపారు.