మారుతి ఫ్రాంక్స్ కోసం వేచి ఉండాలా లేదా దాని పోటీదారులలో ఏదైనా ఎంచుకోవడం మంచిదా?
బాలెనో, బ్రెజ్జాల మధ్య వేరియంట్‌గా బలమైన ఫీచర్‌లతో ఫ్రాంక్స్ నిలుస్తుంది. కానీ దీని కోసం వేచి ఉండడం మంచిదేనా, లేదా దీని పోటీదారులలో ఒక దాన్ని ఎంచుకోవాలా?
‘బాలెనో-ఆధారిత SUV’ అని వార్తలలో ఎక్కిన కొత్త మోడల్ ఫ్రాంక్స్ؚను, మారుతి ఆటో ఎక్స్ؚపో 2023లో ఆవిష్కరించింది. ఈ క్రాస్ؚఓవర్ వేరియంట్ లైన్ؚఅప్, పవర్ ట్రెయిన్ؚలు మరియు ఫీచర్‌లతో సహా అనేక వివరాలను కారు తయారీదారు వెల్లడించారు. ఫ్రాంక్స్ బుకింగ్‌లు ప్రారంభంతో, సబ్ؚకాంపాక్ట్ SUV విభాగంలోని దీని పోటీదారులతో పోలిస్తే ఫ్రాంక్స్ؚను ఎంచుకోవచ్చా లేదా అని మీరు ఆలోచిస్తున్నారా. ఆయితే మరింత తెలుసుకుందాం.
మోడల్ |
ఎక్స్-షోరూమ్ ధర |
మారుతి ఫ్రాంక్స్ |
రూ. 8 లక్షల నుండి (అంచనా) |
రెనాల్ట్ కైగర్/నిస్సాన్ మాగ్నైట్ |
రూ. 5.97 లక్షల నుండి రూ 10.79 లక్షలు |
హ్యుందాయ్ వెన్యూ/కియా సోనెట్ |
రూ. 7.62 లక్షల నుండి రూ. 14.39 లక్షలు |
మారుతి బ్రెజ్జా |
రూ. 7.99 లక్షల నుండి రూ. 13.96 లక్షలు |
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
రెనాల్ట్ కైగర్/నిస్సాన్ మాగ్నైట్: సరసమైన ధరలు, దాదాపుగా సమానమైన ఫీచర్‌లు, మెరుగైన భద్రత రేటింగ్ కోసం కొనుగోలు చేయండి
ధరల పరంగా, 4m కంటే తక్కువ ఎత్తు ఉన్న SUV విభాగంలో రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ؚల జంట ముందువరుసలో నిలుస్తాయి. ఈ SUV బ్రాండ్‌ల ధరలు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ధరలతో సమానంగా ఉన్నపటికి వీటి పరిమాణం, ఫీచర్‌ల పరంగా తగిన విధంగా ఉన్నాయి. ఈ రెండిటిలో సన్‌రూఫ్, ఎనిమిది-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ప్రీమియం ఫీచర్‌లు ఉన్నాయి. ఫ్రాంక్స్ؚ అందిస్తున్నట్లుగా, ఈ వాహనాలను రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో అందిస్తున్నారు. రెనాల్ట్ మరియు నిస్సాన్, 1-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ (72PS/96Nm) లేదా 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (100PS/180Nm) ఎంపికలను అందిస్తున్నాయి. CVT గేర్ బాక్స్ؚతో, టర్బో చార్జెడ్ పవర్ ట్రెయిన్ కలిగిన రెండు SUVలు మా ప్రధాన ఎంపిక. కైగర్, మాగ్నైట్ؚలతో మరొక ప్రయోజనం ఏమిటంటే, ఈ రెండు వాహనాలు గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో తమ పనీతిరుతో ఫోర్ స్టార్ రేటింగ్ؚను సాధించాయి.
సంబంధించినవి: పూర్తిగా-ఎలక్ట్రిక్‌తో రాబోతున్న మారుతి ఫ్రాంక్స్, టాటా నెక్సాన్ EVకు గట్టి పోటీగా నిలుస్తుంది
హ్యుందాయ్ వెన్యూ/కియా సోనెట్: ప్రీమియం SUV అనుభూతి మరియు డీజిల్ పవర్ ట్రెయిన్‌ల కోసం కొనుగోలు చేయండి
అనేక మోడల్‌లతో పోటీ ఎక్కువగా ఉన్న 4m కంటే తక్కువ ఎత్తు SUV విభాగంలో, హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సోనెట్ రెండు మోడల్‌లు ప్రత్యేకంగా నిలుస్తాయి. మెరుగైన పరికరాలతో ప్రధానంగా డీజిల్ పవర్ ట్రెయిన్ ఎంపికలతో ప్రీమియం సబ్ కాంపాక్ట్ SUV కోసం చూస్తుంటే ఈ రెండిటిలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. సోనెట్ؚలో, డీజిల్ؚతో పాటు టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ ఎంపిక కూడా ఉంటుంది. మరొకవైపు, భారతదేశంలో స్పోర్ట్స్ వర్షన్ SUV కోసం చూస్తున్న వారి కోసం హుందాయ్, వెన్యూలో N లైన్ ట్రీట్మెంట్ؚను అందిస్తుంది.
మారుతి బ్రెజ్జా: బారీ పెట్రోల్ ఇంజన్ ఎంపిక మరియు విశాలమైన SUV కోసం దీన్ని కొనుగోలు చేయండి
మారుతి సేకరణలో, 4m కంటే తక్కువ ఎత్తు SUVలలో మాజీ రాజు బ్రెజ్జా. ఏటవాలు ఆకారం కలిగి ఉన్న ఫ్రాంక్స్ؚతో పోలిస్తే, కొత్త బ్రెజ్జా విశాలమైన ఇంటీరియర్ؚను కలిగిన పెద్ద SUV. అంతేకాకుండా, ఇది చిన్న SUV వంటి సాధారణ బాక్సీ అప్పీల్ؚను అందిస్తుంది. 103PS, 137Nmల అత్యధిక పనితీరును అందించే, అనుకూలమైన మరియు పొందికైన ఆరు-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ లేదా ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన పెద్ద 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది.
మారుతి ఫ్రాంక్స్: ప్రత్యేకమైన లుక్స్, విశాలమైన ఇంటీరియర్, అధిక ఫీచర్‌లు కలిగిన క్యాబిన్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపిక కోసం దీన్ని కొనుగోలు చేయండి
మారుతి ఫ్రాంక్స్, బాలెనో డిజైన్‌పై ఆధారపడింది, కానీ ఫ్రాంక్స్ ముందు మరియు వెనుక భాగాలు నవీకరించబడ్డాయి, అందువలన ఇది మినీ గ్రాండ్ విటారాలా కనిపిస్తుంది (అనుసంధానమైన LED DRLలను, టెయిల్ లైట్‌లను చూడండి). అంతేకాకుండా, సాధారణంగా ఉండే ప్లాట్ؚఫారం ప్రయోజనం ఏమిటంటే, ఆరు అడుగుల వరకు పొడవు ఉండే వారి కోసం హెడ్‌రూమ్ؚతో సహా, ఎక్కువ క్యాబిన్ స్పేస్ కూడా ఫ్రాంక్స్ؚలో ఉంటుంది. తొమ్మిది-అంగుళాల టచ్ స్క్రీన్, హెడ్స్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీల కెమెరా అంతే కాకుండా వైర్ లెస్ ఫోన్ ఛార్జర్(హ్యాచ్‌బ్యాక్‌లో అందుబాటలులో లేదు) చేర్చడంతో సహా బాలెనోలో ఉన్న ముఖ్యమైన ఫీచర్‌లను మారుతి, ఫ్రాంక్స్ؚలో అందించింది. ఇవే కాకుండా ఫ్రాంక్స్, టర్బో-పెట్రోల్ ఇంజన్ పునరాగమనాన్ని కూడా సూచిస్తుంది, ఇది కొత్త మారుతి వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్న ఔత్సాహికులను కూడా తప్పకుండా ఆకట్టుకుంటుంది. మరింత ఆచరణాత్మకత కోసం, బాలెనోలో చివరిసారిగా కనిపించిన, 100PS 1-లీటర్ బూస్టర్ జెట్ యూనిట్ కూడా ఆరు-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ఎంపికను పొందింది.
ఇది కూడా చదవండి: CD మాటలలో: మారుతి కార్‌లకు టర్బో-పెట్రోల్ ఇంజన్‌లు కొత్త ఉత్తేజాన్ని తీసుకువస్తాయా?