• English
  • Login / Register

22,000 యూనిట్‌ పెండింగ్ ఆర్డర్‌లను కలిగి ఉన్న మారుతి ఫ్రాంక్స్

మారుతి ఫ్రాంక్స్ కోసం rohit ద్వారా ఆగష్టు 03, 2023 04:32 pm ప్రచురించబడింది

  • 151 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ కారు తయారీదారుకు ఉన్న సుమారు 3.55 లక్షల డెలివరీ చేయని యూనిట్‌లలో మారుతి ఫ్రాంక్స్ భాగం 22,000 యూనిట్‌లుగా ఉంది

Maruti Fronx

  • బాలెనో ఆధారిత ఫ్రాంక్స్ؚను మారుతి ఏప్రిల్ 2023లో విడుదల చేసింది

  • ఈ కారు తయారీదారు ప్రతి నెల సగటున 9,000 ఫ్రాంక్స్ యూనిట్‌లను ఉత్పత్తి చేస్తుంది.

  • ఫ్రాంక్స్ؚ 1.2-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌లను పొందుతుంది; CNGలో కూడా అందించబడుతుంది.

  • 9-అంగుళాల టచ్ؚస్క్రీన్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, మరియు 360-డిగ్రీల కెమెరాలను పొందుతుంది. 

  • ధర రూ.7.46 లక్షలు మరియు రూ.13.14 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంటుంది.

ఏప్రిల్ 2023లో, మారుతి ఫ్రాంక్స్ రూపంలో కొత్త క్రాస్‌ఓవర్ SUV మన ముందుకు వచ్చింది. ఇది మారుతి బాలెనో-ఆధారిత స్టైలింగ్ؚతో వస్తుంది, అయితే ఇది గ్రాండ్ విటారా డిజైన్ నుండి ప్రేరణ పొందింది. ఈ కారు తయారీదారు, తమ ఇటీవలి త్రైమాసిక ఫలితాల డిక్లరేషన్ మీటింగ్ؚలో, ఈ సబ్-4m క్రాస్ؚఓవర్ సగటు ఉత్పత్తి గణాంకాలు మరియు పెండింగ్ ఆర్డర్‌లకు సంబందించిన వివరాలు వెల్లడించారు, తద్వారా ఈ మోడల్ ఆర్డర్ బ్యాక్ؚలాగ్ వివరాలు తెలిసాయి.

ఫ్రాంక్స్ మరియు పెండింగ్ ఆర్డర్‌ల వివరాలు

Maruti Fronx side

మారుతి ప్రతి నెల సగటున 9,000 ఫ్రాంక్స్ యూనిట్‌లను ఉత్పత్తి చేస్తుంది, దీని ఎగుమతులు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. ఈ కారు తయారీదారు సుమారుగా 22,000 ఫ్రాంక్స్ యూనిట్‌లను డెలివరీ చేయాలని ఇటీవల తెలిపారు. ప్రస్తుతానికి మారుతి వద్ద 3.55 లక్షల పెండింగ్ ఆర్డర్‌లు ఉన్నాయని కూడా వెల్లడించారు. 

మారుతి ఫ్రాంక్స్: సారాంశం

Maruti Fronx front

మారుతి ఫ్రాంక్స్ రెండు పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది: 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్, ఇది 90PS పవర్ మరియు 113Nm టార్క్‌ను విడుదల చేస్తుంది; మరొకటి మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతతో 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (110PS/148Nm). మొదటిది 5-స్పీడ్ MT మరియు AMT ఎంపికలను పొందుతుంది, రెండవది 5-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ ATని పొందుతుంది.

మారుతి ఫ్రాంక్స్‌ను 1.2-లీటర్ యూనిట్ పై CNG కిట్ ఎంపికతో కూడా అందిస్తుంది, ఇది 77.4 PS పవర్ మరియు 98.5Nmను టార్క్‌ను విడుదల చేస్తుంది, మాన్యువల్ గేర్ బాక్స్ؚతో మాత్రమే జోడించబడుతుంది.

Maruti Fronx cabin

ఈ క్రాస్ఓవర్ SUV వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో 9-అంగుళాల టచ్ؚస్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, హెడ్స్అప్ డిస్ప్లే, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, మరియు 360-డిగ్రీల కెమెరా వంటి ఫీచర్‌లతో వస్తుంది. 

ఇది కూడా చదవండి: త్వరలోనే రానున్న “టయోటా ఫ్రాంక్స్”, 2024 మే నెలలో రావచ్చు! 

ధరలు మరియు పోటీదారులు

Maruti Fronx rear

మారుతి ఫ్రాంక్స్ؚను రూ.7.46 లక్షలు మరియు రూ.13.14 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య విక్రయిస్తుంది. ఫ్రాంక్స్ؚకు ప్రత్యక్ష పోటీదారులు ఎవరూ లేకపోయినా, సిట్రోయెన్ C3 మరియు హ్యుందాయ్ ఎక్స్టర్‌తో పోటీ పడుతుంది. సబ్-4మీ SUVలు అయిన హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి కూడా పోటీని ఇస్తుంది. 

ఇది కూడా చూడండి: మొదటిసారిగా కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ ప్రొడక్షన్ؚకు సిద్ధంగా ఉన్న హెడ్ؚలైట్‌లు

ఇక్కడ మరింత చదవండి: ఫ్రాంక్స్ AMT

was this article helpful ?

Write your Comment on Maruti ఫ్రాంక్స్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience