సియాజ్ హైబ్రిడ్ వాహనాన్ని స్వాతంత్ర్య దినోత్సవం తరువాత తీసుకురాబోతున్న మారుతి
మారుతి సియాజ్ కోసం nabeel ద్వారా ఆగష్టు 11, 2015 11:46 am ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మారుతి సంస్థ వారు, సియాజ్ హైబ్రిడ్ ను స్వాతంత్ర్య దినోత్సవం తరువాత ప్రారంభించబోతున్నారు. ఆ తేదీ ఇంకా నిర్ధారించబడలేదు అయితే, నివేదికలు ఏం చెబుతున్నాయంటే, ఈ కారు ఆగస్టు 15 తర్వాత ఒక వారం లోపల ప్రారంభించబడుతుంది అని చెబుతున్నారు. ఈ హైబ్రిడ్ వెర్షన్, ప్రస్తుతం ఉన్న డీజిల్ వేరియంట్ ను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ లో ఏ మార్పులు వచ్చే అవకాశాలు లేవు. ఈ హైబ్రిడ్ కారు అదే 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్ తో వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, ఈ హైబ్రిడ్ వాహనం, ఎస్ హెచ్ వి ఎస్ టెక్నాలజీ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వాహనం, లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించుకుని పునరుత్పాదక బ్రేకింగ్ తో రాబోతుంది. దీని వలన అధనపు టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, అత్యధిక పవర్ ను కూడా విడుదల చేస్తుంది. దీని ఫలితంగా, ఈ సియాజ్ హైబ్రిడ్ వెర్షన్ 28-30 కె ఎం పి ఎల్ అత్యధిక మైలేజ్ ను విడుదల చేస్తుంది. దీని పాత వెర్షన్ అయితే 26 కె ఎం పి ఎల్ మైలేజ్ ను మాత్రమే అందిస్తుంది.
ఈ కొత్త కారు యొక్క పెట్రోల్ వేరియంట్ కొన్ని కాస్మెటిక్ మార్పులను చోటు చేసుకోబోతుంది. ఈ కొత్త హైబ్రిడ్ వేరియంట్, కొత్త ప్రత్యేక నెక్సా షోరూం ల ద్వారా నే అమ్ముడవుతుంది. ఈ నెక్సా షోరూం లలో ప్రస్తుతం ఇటీవల విడుదల అయిన ఎస్-క్రాస్ ను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. మారుతి డీలర్స్ సియాజ్ పై రూ 25,000 డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఎందువలన అంటే, కొత్త హైబ్రిడ్ మోడల్ వచ్చే లోగా పాత మోడల్ ను తీసివేసి ఒక ఎత్తుగడ కావచ్చు. సుజుకి చే ఎస్ హెచ్ వి ఎస్ టెక్నాలజీ తో విడుదల కాబోతున్న ఈ హైబ్రిడ్ వాహనాన్ని 2015 జెనీవా మోటార్ షోలో మారుతీ ద్వారా ప్రదర్శించారు. అంతేకాకుండా, లిథియం-అయాన్ బ్యాటరీల తో అదనపు టార్క్ అందించడానికి ప్రత్యేకమైన ఇంజిన్ తో రాబోతుంది అని ఈ మోటార్ షోలో వివరించారు. నివేదికల ప్రకారం, ఈ కొత్త హైబ్రిడ్ సియాజ్ వేరియంట్, ప్రస్తుత కారు కంటే రూ .75,000 నుండి 1.2 లక్షల వరకు వేరియంట్ ను బట్టి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
0 out of 0 found this helpful