మరింత సురక్షితంగా, 3 డ్యూయల్-టోన్ కలర్ ఎంపికలతో రానున్న మారుతి సియాజ్

మారుతి సియాజ్ కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 16, 2023 07:48 pm ప్రచురించబడింది

  • 58 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డ్యూయల్-టోన్ ఎంపిక కేవలం టాప్-స్పెక్ ఆల్ఫా వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది

Maruti Ciaz 2023

బాలెనో, ఎర్టిగా, XL6లను నవీకరించిన కొన్ని రోజులకే, మారుతి తన సియాజ్ మోడల్ؚలలో కొత్త భద్రత ఫీచర్‌లను, డ్యూయల్-టోన్ ఎక్స్ؚటీరియర్ షేడ్‌లను ప్రవేశపెట్టింది. 

మెరుగుపరచిన భద్రత 

Maruti Ciaz

అన్నీ సియాజ్ వేరియెంట్‌లలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్ ప్రామాణికంగా ఉంటాయి. అంతేకాకుండా, వీటిలో రెండు ముందు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ISOFIX వెనుక పార్కింగ్ సెన్సార్లు, పిల్లల-సీట్ యాంకరేజ్ؚలు వంటి భద్రత ఫీచర్‌లు కలిగి ఊన్నాయి.

ఇది కూడా చూడండి: CNG ఎంపికతో మారుతి ఫ్రాంక్స్ రానుంది; బాలెనో పెట్రోల్-CNG ఇంజన్ؚను ఉపయోగిస్తుంది

కొత్త డ్యూయల్-టోన్ రంగులు 

Maruti Ciaz

ఎక్స్ؚటీరియర్ కలర్ ఎంపికల గురించి చెప్పాలంటే, సియాజ్ ఇప్పుడు పర్ల్ మెటాలిక్ ఒప్యులెంట్ రెడ్, పర్ల్ మెటాలిక్ గ్రాండియర్ గ్రే, డిగ్నిటీ బ్రౌన్ – వంటి మూడు రంగులలో డ్యూయల్-టోన్ ఫినిష్ కోసం నల్లటి రూఫ్ؚతో అందించబడుతుంది. దీనిలో ఇప్పుడు మొత్తం 10 రంగుల ఎంపికలు ఉన్నాయి, వీటిలో ఏడు మోనోటోన్ రంగులు - నెక్సా బ్లూ, పర్ల్ మెటాలిక్ డిగ్నిటీ బ్రౌన్, పర్ల్ మిడ్ؚనైట్ బ్లాక్, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, ఒపులెంట్ రెడ్ మరియు పెర్ల్ ఆర్క్ؚటిక్ వైట్. 

కేవలం టాప్-స్పెక్ ఆల్ఫా వేరియెంట్‌లోనే మాన్యువల్, ఆటోమ్యాటిక్ؚల కోసం డ్యూయల్-టోన్ ఎంపిక అందుబాటులో ఉంది. అంతేకాకుండా, పర్ల్ మిడ్ؚనైట్ బ్లాక్ మోనోటోన్ రంగు ఎంపికను నెక్సా మోడల్ బ్లాక్ ఎడిషన్ؚగా అందిస్తున్నారు

ఇది కూడా చదవండి: జనవరిలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాహనాలు- సబ్-4m SUVలు టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా

ఫీచర్‌లు

Maruti Ciaz Interior

ఈ మారుతి కాంపాక్ట్ సెడాన్ ఫీచర్‌ల జాబితాలో ఆపిల్ కార్ؚప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో ఏడు-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, LED హెడ్‌లైట్‌లు, ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ؚతో పాసివ్ కీలెస్ ఎంట్రీ, క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: ముంబై, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, ఇతర ప్రధాన నగరాలలో మారుతి హ్యాచ్ؚబ్యాక్ వెయిటింగ్ పీరియడ్

మెకానికల్ పరంగా ఎటువంటి మార్పులు లేవు

Maruti Ciaz Engine

సియాజ్ ఇప్పటికీ 1.5-లీటర్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ؚను, ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్‌ల టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ను ఉపయోగిస్తుంది. ఈ కారు మాన్యువల్ వేరియెంట్‌లో 20.65 మైలేజ్‌ను, ఆటోమ్యాటిక్ వేరియెంట్‌లో 20.04kmpl మైలేజ్‌ను అందిస్తుంది అని కారు తయారీదారులు తెలిపారు. 

ధరలు 

నవీకరించిన ప్రామాణిక భద్రతా ఫీచర్‌ల కోసం మారుతి ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు. సియాజ్ మోనోటోన్ ఎంపికలతో పోలిస్తే, డ్యూయల్-టోన్ ఎంపికల కోసం కస్టమర్‌లు రూ.15,000 అధికంగా వెచ్చించవలసి ఉంది. 

ఇప్పుడు మారుతి సియాజ్ ధరలు రూ.9.20 నుండి 12.35 లక్షల పరిధిలో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. ఇది హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, వోక్స్ؚవాగన్ విర్టస్, స్కోడా స్లేవియాలతో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: మారుతి సియాజ్ ఆటోమ్యాటిక్ 

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి సియాజ్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience