• English
    • లాగిన్ / నమోదు

    మే 2024లో Tata, Mahindra తదితర కార్ బ్రాండ్‌లను అధిగమించి అగ్రస్థానంలో నిలిచిన Maruti, Hyundai

    జూన్ 11, 2024 07:11 pm ansh ద్వారా ప్రచురించబడింది

    66 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    టాటా, మహీంద్రా, హ్యుందాయ్‌ల కంటే ఎక్కువ విక్రయాలతో మారుతి అగ్రస్థానంలో ఉంది.

    10 Highest Selling Car Brands In May 2024

    మే 2024 యొక్క బ్రాండ్ వారీగా అమ్మకాల నివేదిక విడుదల చేయబడింది, యధావిధిగా మారుతి, హ్యుందాయ్ మరియు టాటా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. టాప్-10లో ఉన్న కార్ల తయారీ సంస్థలు నెలవారీ (MoM), సంవత్సరవారీ (YoY) గణాంకాల్లో వృద్ధిని నమోదు చేసుకోగా, కొన్ని నష్టాలను కూడా చవిచూశాయి. మే 2024 లో ఈ బ్రాండ్ల అమ్మకాలను మరింత లోతుగా పరిశీలిద్దాం. 

    కార్ తయారీదారు

    మే 2024

    ఏప్రిల్ 2024

    MoM వృద్ధి %

    మే 2023

    YoY వృద్ధి %

    మారుతి

    1,44,002

    1,37,952

    4.4 %

    1,43,708

    0.2 %

    హ్యుందాయ్

    49,151

    50,201

    - 2.1 %

    48,601

    1.1 %

    టాటా

    46,700

    47,885

    - 2.5 %

    45,880

    1.8 %

    మహీంద్రా

    43,218

    41,008

    5.4 %

    32,883

    31.4 %

    టయోటా

    23,959

    18,700

    28.1 %

    19,379

    23.6 %

    కియా

    19,500

    19,968

    - 2.3 %

    18,766

    3.9 %

    హోండా

    4,822

    4,351

    10.8 %

    4,660

    3.5 %

    MG

    4,769

    4,485

    6.3 %

    5,006

    - 4.7 %

    రెనాల్ట్

    3,709

    3,707

    0.1 %

    4,625

    - 19.8 %

    వోక్స్వాగన్

    3,273

    3,049

    7.3 %

    3,286

    - 0.4 %

    ముఖ్యాంశాలు

    • టాటా, హ్యుందాయ్, మహీంద్రాల కంటే ఎక్కువ అమ్మకాలతో మారుతి ఇప్పటికీ ముందంజలో ఉంది. MoM, YoY అమ్మకాల గణాంకాల్లో ఈ బ్రాండ్ వృద్ధిని సాధించింది.

    Hyundai Creta

    • హ్యుందాయ్ యొక్క వార్షిక అమ్మకాలు కొంచం పెరిగాయి, కానీ నెలవారీ అమ్మకాలు 2 శాతం తగ్గాయి.

    •  టాటా అమ్మకాల గణాంకాలు హ్యుందాయ్ వంటి ఫలితాన్ని ఎదుర్కొన్నాయి, ఇక్కడ దాని వార్షిక అమ్మకాలు దాదాపు 2 శాతం పెరిగాయి, అయితే నెలవారీ అమ్మకాలు 2.5 శాతం నష్టాన్ని చవిచూశాయి.

    ఇది కూడా చదవండి: టాటా ఆల్ట్రోజ్ రేసర్ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్: 5 ముఖ్యమైన వ్యత్యాసాలు వివరించబడ్డాయి

    • మహీంద్రా యొక్క MoM వృద్ధి కేవలం 5 శాతానికి పైగా ఉండగా, దాని YoY వృద్ధి 31.4 శాతంగా ఉంది, ఇది మే 2024 లో ఏ కార్ల తయారీదారుకైనా అత్యధికం.

    • మే 2024 లో టయోటా కార్లు బాగా అమ్ముడయ్యాయి, దాని నెలవారీ అమ్మకాలు 28 శాతానికి పైగా పెరిగాయి మరియు వార్షిక అమ్మకాలు దాదాపు 24 శాతం పెరిగాయి.

    • కియా నెలవారీ అమ్మకాలు తగ్గాయి, కానీ మే 2023 తో పోలిస్తే, దాని వార్షిక అమ్మకాలు దాదాపు 4 శాతం పెరిగాయి. ఈ జాబితాలో 10,000 యూనిట్ల అమ్మకాల మార్కును దాటిన చివరి బ్రాండ్ కూడా ఇదే.

    Honda Elevate

    • నెలవారీ మరియు వార్షిక అమ్మకాలలో వృద్ధిని చూసిన చివరి తయారీదారు హోండా. దీని MoM గణాంకాలు దాదాపు 11 శాతం వృద్ధిని సాధించాయి, YoY గణాంకాలు 3.5 శాతం పెరిగాయి.

    • ఏప్రిల్ కంటే మే 2024 లో MG ఎక్కువ కార్లను విక్రయించగా, దాని వార్షిక అమ్మకాలు దాదాపు 5 శాతం నష్టాన్ని చవిచూశాయి మరియు సంచిత అమ్మకాల గణాంకాలు 5,000 యూనిట్ల అమ్మకాల మార్కు కంటే దిగువకు వెళ్ళాయి. 

    ఇది కూడా చూడండి: 7 చిత్రాలలో MG గ్లోస్టర్ డెసర్ట్‌స్టార్మ్ ఎడిషన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి

    • గత నెలతో పోలిస్తే మే 2024 లో రెనాల్ట్ కేవలం రెండు యూనిట్లు మాత్రమే అందనంగా విక్రయించగా, దాని YoY అమ్మకాలు దాదాపు 20 శాతం పడిపోయాయి.

    • చివరగా, వోక్స్వాగన్ ఈ నెలలో నెలవారీ అమ్మకాలలో 7 శాతానికి పైగా పెరుగుదల మరియు వార్షిక అమ్మకాలలో స్వల్ప నష్టంతో 10 వ స్థానంలో ఉంది.

    was this article helpful ?

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం