• English
  • Login / Register

7 చిత్రాలలో వివరించబడిన MG Gloster Desertstorm Edition

ఎంజి గ్లోస్టర్ కోసం shreyash ద్వారా జూన్ 10, 2024 03:27 pm ప్రచురించబడింది

  • 34 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

MG గ్లోస్టర్ డెసర్ట్‌స్టార్మ్ డీప్ గోల్డెన్ ఎక్స్‌టీరియర్ షేడ్‌లో ఉంటుంది.

MG గ్లోస్టర్ ఇటీవలే రెండు కొత్త ప్రత్యేక ఎడిషన్స్‌ను విడుదల చేసింది: డెసర్ట్‌స్టార్మ్ మరియు స్నోస్టార్మ్ - దీని ఇంటీరియర్‌ కొత్త స్టైలింగ్ అంశాలతో ఆల్-బ్లాక్ థీం లో ఉంటుంది. గ్లోస్టర్ యొక్క ఈ రెండు ప్రత్యేక ఎడిషన్ యూనిట్లు డీలర్‌షిప్‌ల వద్ద ప్రదర్శించబడ్డాయి. డెసర్ట్‌స్టార్మ్ ఎడిషన్ యొక్క చిత్రాలను ఇక్కడ చూడండి.

MG గ్లోస్టర్ డెసర్ట్‌స్టార్మ్ ఎడిషన్‌ సింగిల్ టోన్ డీప్ గోల్డెన్ కలర్‌లో లభిస్తుంది. ఇతర రెండు స్టార్మ్ ఎడిషన్స్‌లా (స్నోస్టార్మ్ మరియు బ్లాక్‌స్టార్మ్) గ్లోస్టర్ డెసర్ట్‌స్టార్మ్‌లో మెష్ ప్యాటర్న్, ఫ్రంట్ లిప్ మరియు ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ ట్రీట్‌మెంట్‌తో బ్లాక్ గ్రిల్ లభిస్తుంది. ఇది హెడ్‌లైట్‌లలో రెడ్ కలర్ ఇన్‌సర్ట్‌లను కూడా పొందుతుంది.

సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే, గ్లోస్టర్ డెసర్ట్‌స్టార్మ్‌కి బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇవ్వబడ్డాయి, అయితే ORVM లకు బ్లాక్ మరియు క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వబడింది. ప్రామాణిక MG గ్లోస్టర్ వలె కాకుండా, డెసర్ట్‌స్టార్మ్ యొక్క విండో లైన్‌కు కూడా బ్లాక్ కలర్ ఫినిషింగ్ చేయబడింది. దీనికి స్పోర్టి అప్పీల్ ఇవ్వడానికి, దీనికి బ్లాక్ కలర్ 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో రెడ్ బ్రేక్ కాలిపర్స్ అందించబడ్డాయి.

రేర్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే, గ్లోస్టర్ డెసర్ట్‌స్టార్మ్ ఎడిషన్ దాని సాధారణ వేరియంట్‌ల మాదిరిగానే కనిపిస్తుంది కానీ ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాడ్జింగ్‌ ఇవ్వబడింది.

డెసర్ట్‌స్టార్మ్ ఎడిషన్ స్నోస్టార్మ్ ఎడిషన్ మాదిరిగానే సెంటర్ కన్సోల్‌లో, AC వెంట్‌ల చుట్టూ మరియు స్టీరింగ్ వీల్‌లో బ్రష్ చేసిన సిల్వర్ ఇన్‌సర్ట్‌లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్‌ను పొందుతుంది. 

SUV యొక్క ఈ స్పెషల్ ఎడిషన్‌లో కాంట్రాస్ట్ వైట్ స్టిచింగ్‌తో కూడిన బ్లాక్ లెదర్ సీట్ అప్‌హోల్‌స్టరీ లభిస్తుంది. MG డెసర్ట్‌స్టార్మ్ ఎడిషన్‌ను 6 మరియు 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో ప్రవేశపెట్టింది.

గ్లోస్టర్ యొక్క డెర్సర్ట్‌స్టార్మ్ ఎడిషన్ టాప్-స్పెక్ సావీ వేరియంట్‌పై ఆధారపడినందున, ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్; మెమరీ, మసాజ్, హీటింగ్ మరియు వెంటిలేషన్ ఫంక్షన్‌తో 12-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు 8-వే పవర్డ్ కో-డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు అందించబడ్డాయి. 

భద్రత పరంగా, ఈ ప్రత్యేక ఎడిషన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా మరియు లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లు అందించబడ్డాయి. 

ఇంజిన్ & ట్రాన్స్మిషన్

MG గ్లోస్టర్ డెసర్ట్‌స్టార్మ్ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) మరియు రేర్-వీల్-డ్రైవ్ (RWD) వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్‌లో 2 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ ఉంది, ఇది 215 PS పవర్ మరియు 478 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు మరియు ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడింది. దీని రేర్ వీల్ డ్రైవ్ వెర్షన్ 2 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంది, ఇది 161 PS పవర్ మరియు 373 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 

ధర & ప్రత్యర్థులు

MG గ్లోస్టర్ డెసర్ట్‌స్టార్మ్ ఎడిషన్ ధర రూ. 41.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్ మరియు స్కోడా కొడియాక్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

మరింత చదవండి: MG గ్లోస్టర్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఎంజి గ్లోస్టర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience