• English
  • Login / Register

భారతదేశంలో లక్షకు పైగా అమ్ముడైన మహీంద్రా XUV700

మహీంద్రా ఎక్స్యూవి700 కోసం shreyash ద్వారా జూలై 05, 2023 02:15 pm ప్రచురించబడింది

  • 65 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చివరి 50,000 మహీంద్రా XUV700 యూనిట్‌లు గత 8 నెలలలో డెలివరీ చేయబడ్డాయి

Mahindra XUV700 Reaches 1 Lakh Homes In India

మహీంద్రా XUV700 బహుశా ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ SUV కావచ్చు. ఇది 1 లక్ష యూనిట్‌ల డెలివరీ మైలురాయిని చేరుకుంది. 2021లో విడుదల అయ్యి మహీంద్రా XUV500 స్థానంలో వచ్చిన ఈ మోడల్, ఈ కారు తయారీదారు ఫ్లాగ్ؚషిప్ SUVగా నిలుస్తుంది.

XUV700 కేవలం 20 నెలలలో ఈ అద్భుతమైన మైలురాయిని సాధించింది, అత్యంత ఖరీదైన ప్రజాదరణ పొందిన ఈ వాహన మోడల్‌లు సుమారు రూ.20 లక్షల ధరను కలిగి ఉన్నాయి. విడుదల అయినప్పటి నుండి XUV700 వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగానే ఉంది. మొదటి మూడు గంటలలో మహీంద్రా 50,000 బుకింగ్‌లను అందుకుంది మరియు అన్నీ యూనిట్‌లను డెలివర్ చేయడానికి 12 నెలలు సమయం పట్టింది. తదుపరి 50,000 యూనిట్‌లను కేవలం 8 నెలలలో డెలివర్ చేసింది. మహీంద్రా చేసిన ప్రకటన ప్రకారం, XUV700 వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికీ ఎక్కువగానే ఉంది మరియు తదుపరి 50,000 యూనిట్‌ల డెలివరీని వేగవంతం చేయడానికి ప్రస్తుతం తమ దృష్టిని ఉత్పత్తి సామర్ధ్యం పెంచడంపై నిలిపింది. 

ఇది ఏమి అందిస్తుంది

Mahindra XUV700 Reaches 1 Lakh Homes In India

విడుదలైనప్పటి నుండి XUV700లో ఎటువంటి భారీ మార్పులను చేయలేదు, దీని ఫీచర్‌ల జాబితాలో అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేతో ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల స్క్రీన్ సెట్అప్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరామిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు సోనీ 12-స్పీకర్ 3D సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. 

ఏడు ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీల కెమెరా, రివర్సింగ్ కెమెరా మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ మరియు హై-బీమ్ అసిస్ట్ వంటి అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటివి ప్రయాణీకుల భద్రత కోసం ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 9 లక్షల ఉత్పత్తి మైలురాయిని దాటిన మహీంద్రా స్కార్పియో 

IFrame

పవర్ؚట్రెయిన్ వివరాలు

Mahindra XUV700 Reaches 1 Lakh Homes In India

మహీంద్రా XUV700 రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 2-లీటర్‌ల టర్బో పెట్రోల్ ఇంజన్ (200PS/380Nm) మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ (185PS/450Nm), ఇవి రెండూ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడింది. టాప్-స్పెక్ డీజిల్ వేరియెంట్ؚలు కూడా ఆల్-వీల్ డ్రైవ్ డ్రైవ్ؚట్రెయిన్ؚతో అందిస్తున్నారు.

ధర & పోటీదారులు 

XUV700 ధరలు రూ.14.04 లక్షలు మరియు రూ.26.18 లక్షల మధ్య ఉన్నాయి (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా). టాటా సఫారి, MG హెక్టార్ ప్లస్ మరియు హ్యుందాయ్ ఆల్కజార్ వంటి వాటితో దీనికి పోటీ ఉంది. XUV700 తక్కువ వేరియెంట్ؚలు కూడా 5-సీటర్ కాన్ఫిగరేషన్ؚతో అందిస్తున్నారు, ఇవి టాటా హ్యారియర్, MG హెక్టార్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి 5-సీటర్ SUVలతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా XUV700 ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra ఎక్స్యూవి700

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience