• English
  • Login / Register

9 లక్షల ఉత్పత్తి మైలురాయిని దాటిన మహీంద్రా స్కార్పియో నేంప్లేట్

మహీంద్రా స్కార్పియో ఎన్ కోసం rohit ద్వారా జూన్ 30, 2023 11:10 am ప్రచురించబడింది

  • 119 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N యొక్క ఉత్పత్తుల్ని కలుపుకుని దాటిన విక్రయాల మైలురాయి. 

Mahindra Scorpio production milestone

  • స్కార్పియో SUV ని రెండు దశాబ్దాల క్రితం అందుబాటులోకి తెచ్చిన మహీంద్రా.

  • ప్రస్తుతం రెండు వెర్షన్లలో అమ్మకాలు - స్కార్పియో క్లాసిక్ మరియు న్యూ-జనరేషన్ స్కార్పియో N.

  • మే 2023 నాటికి ఒక లక్షకు పైగా ఆర్డర్ బకాయిలు (బ్యాక్లోగ్లు) కలిగి ఉన్న స్కార్పియో డుయో.

  • జీవితకాలపు విక్రయాలలో (లైఫ్టైం సేల్స్) బొలెరోతో పోలిస్తే వెనుకబడి ఉన్న స్కార్పియో నేంప్లేట్. ఇప్పటికే 14 లక్షల యూనిట్లు దాటిన బొలెరో లైఫ్టైమ్ విక్రయాలు. 

  • 13 లక్షల నుండి 24.52 లక్షల వరకు పలుకుతున్న స్కార్పియో డుయో ధరలు.

మహీంద్రా స్కార్పియో నేంప్లేట్ మరొక మైలురాయిని దాటింది : కారు తయారీదారు SUV యొక్క 9 లక్షల యూనిట్లని విడుదల చేశారు. మహీంద్రా తన SUVని 2002 లో పరిచయం చేసింది. అప్పటి నుండి ఈ కారు ఎత్తైన సీటింగ్కి, రహదారి ఉనికికి (రోడ్ ప్రెజెన్స్) మరియు  అన్ని రకాల భూభాగ (ఆల్ టెర్రైన్) సామర్థ్యానికి విశేష జనాదరణ పొందింది. ఇటీవలే కార్ తయారీదారు మహీంద్రా స్కార్పియో క్లాసిక్ అనే పేరుతో స్కార్పియో యొక్క ఫేస్ లిఫ్టెడ్ రకాన్ని (వెర్షన్ని) విడుదల చేశారు. అంతేకాకుండా మహీంద్రా స్కార్పియో N అనే పేరుతో న్యూ జనరేషన్ మోడల్ని కూడా ప్రవేశపెట్టారు. ఇవి రెండు మహీంద్రా తన తాజా మైలురాయిని చేరుకునే ప్రయాణాన్ని మరింత వేగవంతం చేశాయి. 

ఇదిలా ఉండగా, స్కార్పియో నేంప్లేట్ యొక్క ఉత్పత్తి మైలురాయి బొలెరో యొక్క జీవితకాలపు విక్రయ సంఖ్య కంటే వెనుకబడే ఉంది. 14 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలతో ఒక దశాబ్దం పాటు అత్యధికంగా అమ్ముడుపోయిన మహీంద్రా వాహనాల్లో బొలెరో ఒకటి. . 

తాజా లెక్కలు 

మే 2023 సమాచారం (లెక్కల) ప్రకారం, మహీంద్రా సుమారుగా 8,000 యూనిట్ల SUV ని ఉత్త్పత్తి  చేసింది. (స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N ఉత్పత్తులను కలుపుకుని)

Mahindra Scorpio production milestone

జూన్ ఆఫర్ను పరిశీలించండి 

మహీంద్రా వరుసలో అత్యధిక డిమాండ్ కలిగిన మోడల్స్ లో స్కార్పియో ఒకటి. కారు తయారీదారుకి ఉన్న అన్ని పెండింగ్ ఆర్డర్లలో ఒక లక్షకు పైగా డెలివరీ కోసం వేచిచూస్తున్న బుకింగ్స్ స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N వే అవటం విశేషం. ఉత్త్పత్తిని వేగవంతం చేయాలనే యోచనలో ఉన్న మహీంద్రా, ఒక సంవత్సర కాలం లోపు తదుపరి లక్ష యూనిట్లను తయారుచేసే ప్రణాళికను సిద్ధం చేసుకుంది. 

సంబంధిత అంశాలు: భారత్ లో ఒక సంవత్సరాన్ని పూర్తి చేస్కున్న మహీంద్రా స్కార్పియో N : పునశ్చరణ 

ధరలు మరియు పోటీదారులు

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ధరలు 13 లక్షల నుండి 16.81 లక్షల  వరకు పలుకుతున్నాయి. కాగా, స్కార్పియో N ధరలు 13.05 లక్షల నుండి 24.52 లక్షల మధ్య ఉన్నాయి. (అన్ని ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీ నుండి)

Mahindra Scorpio Classic and Scorpio N

స్కార్పియో క్లాసిక్ ఇతర మోనోకాక్ కాంపాక్ట్ SUVలైన హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా మరియు స్కోడా కుషాక్ లకు ధృడమైన ప్రత్యామ్నాయంగా నిలిచింది. మరోవైపు స్కార్పియో N టాటా హ్యారియర్, సఫారీ మరియు హ్యుందాయ్ ఆల్కాజార్ కార్లకు గట్టి పోటీని ఇస్తూ సాగిపోతోంది. సరికొత్త జనరేషన్కి (న్యూయర్ జనరేషన్) ఫోర్-వీల్-డ్రైవ్ ఎంపిక ఉండటంతో పాటు ఆఫ్-రోడ్-క్యాపబుల్ ఫీచర్ కూడా మహీంద్రా XUV700కి ప్రత్యామ్నాయంగా లభిస్తుంది. 

ఇది కూడా చదవండి: యామి గౌతమ్ విలాసవంతమైన కార్ల జాబితాలో చేరిన BMW X7. 

దీనిపై మరింత చదవండి: మహీంద్రా స్కార్పియో N ఆన్ రోడ్ ధర. 

was this article helpful ?

Write your Comment on Mahindra స్కార్పియో ఎన్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience