Mahindra XUV400 EV: 5 కొత్త భద్రత ఫీచర్‌లను పొందిన మహీంద్రా XUV400 EV
ఈ ఫీచర్ؚలు కేవలం టాప్-స్పెక్ EL వేరియెంట్ؚకు మాత్రమే పరిమితం, దీని ధర ప్రస్తుతం రూ.19.19 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది
XUV300 SUV ఎలక్ట్రిక్ వర్షన్ అయిన మహీంద్రా XUV400 EV, ప్రస్తుతం అనేక కొత్త భద్రత ఫీచర్‌లతో వస్తుంది. కారు తయారీదారు ఈ ఎలక్ట్రిక్ SUV టాప్-స్పెక్ EL వేరియెంట్ؚకు ఐదు కొత్త భద్రత ఫీచర్‌లను జోడించారు, వీటిలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటో-డిమ్మింగ్ IRVM మరియు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ؚలు ఉన్నాయి.
ధరలు
వేరియెంట్ |
పాత ధర |
కొత్త ధర |
వ్యత్యాసం |
EC ప్రామాణికం |
రూ. 15.99 లక్షలు |
రూ. 15.99 లక్షలు |
మార్పు లేదు |
EC ఫాస్ట్ ఛార్జ్ |
రూ. 16.49 లక్షలు |
రూ. 16.49 లక్షలు |
మార్పు లేదు |
EL ఫాస్ట్ ఛార్జ్ |
రూ. 18.99 లక్షలు |
రూ. 19.19 లక్షలు |
+ రూ. 20,000 |
EL డ్యూయల్ టోన్ ఫాస్ట్ ఛార్జ్ |
రూ. 19.19 లక్షలు |
రూ. 19.39 లక్షలు |
+ రూ. 20,000 |
టాప్-స్పెక్ EL వేరియెంట్ మాత్రమే ఈ అదనపు ఫీచర్‌లను పొందుతుంది, దీని ధర రూ. 20,000 అధికంగా ఉంది. బేస్-స్పెక్ EC వేరియెంట్ ధరలలో మార్పు లేదు.
అదనపు ఫీచర్‌లు
ఐదు కొత్త భద్రతా ఫీచర్‌లతో పాటుగా XUV400 EV ప్రస్తుతం రెండు ట్వీటర్‌లు, క్రూయిజ్ కంట్రోల్ మరియు సౌలభ్యం కోసం బూట్ ల్యాంప్‌తో కూడా అమర్చబడింది.
ఇది కూడా చదవండి: ఆగస్ట్ 15 కార్యక్రమంలో కనిపించనున్న ఎలక్ట్రిక్ మహీంద్రా థార్
ఈ ఎలక్ట్రిక్ SUV ఇప్పటికే 7-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు మరియు రేర్ؚవ్యూ కెమెరాలతో వస్తుంది.
మునపటి పవర్ؚట్రెయిన్
పవర్ؚట్రెయిన్‌లలో ఎలాంటి మార్పులు లేవు. ఇది ఇప్పటికీ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది: అవి 34.5kWh మరియు 39.4kWh. రెండు బ్యాటరీ ప్యాక్ؚలు 150PS మరియు 310Nmలను విడుదల చేసే ఎలక్ట్రిక్ మోటార్ؚతో జత చేయబడ్డాయి మరియు వరుసగా 375km మరియు 456km డ్రైవింగ్ పరిధిని అందిస్తాయి.
పోటీదారులు
XUV400 EV ధర ప్రస్తుతం రూ.15.99 లక్షలు మరియు రూ.19.39 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది మరియు ఇది టాటా నెక్సాన్ EV ప్రైమ్, టాటా నెక్సాన్ EV మాక్స్ؚలతో పోటీ పడుతుంది, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు MG ZS EVలకు చవకైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా XUV400 EV ఆటోమ్యాటిక్