Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

జపాన్‌లో 50,000 బుకింగ్‌ల మార్క్ చేరుకున్న Maruti Suzuki Jimny

మారుతి జిమ్ని కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 05, 2025 12:06 pm ప్రచురించబడింది

జపాన్‌లోని జిమ్నీ నోమేడ్ ఆర్డర్‌లను స్వీకరించడం సుజుకి తాత్కాలికంగా నిలిపివేసింది.

  • మేడ్ ఇన్ ఇండియా 5-డోర్ మారుతి జిమ్నీని జపాన్‌లో 'జిమ్నీ నోమేడ్' పేరుతో విక్రయిస్తున్నారు.
  • ఇది జపాన్‌లో రెండు కొత్త ఎక్ట్సీరియర్ కలర్ ఎంపికలలో లభిస్తుంది: చిఫాన్ ఐవరీ మెటాలిక్ మరియు జంగిల్ గ్రీన్.
  • లోపల, ఇది బ్లాక్ మరియు గ్రే కలర్ డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీని కలిగి ఉంది, మిగిలిన క్యాబిన్ లేఅవుట్ ఇండియా-స్పెక్ జిమ్నీ మాదిరిగానే ఉంటుంది.
  • జపాన్-స్పెక్ జిమ్నీ ఇండియా-స్పెక్ వెర్షన్ కంటే హీటెడ్ ORVMలు మరియు ఫ్రంట్ సీట్లు మరియు ADAS వంటి అదనపు ఫీచర్లను పొందుతుంది.
  • జపాన్-స్పెక్ 5-డోర్ జిమ్నీ ధర 2,651,000 యెన్ల నుండి 2,750,000 యెన్ల (సుమారుగా రూ. 14.86 లక్షల నుండి రూ. 15.41 లక్షలు - జపనీస్ యెన్ నుండి మార్పిడి) మధ్య ఉంది.

5-డోర్ మారుతి సుజుకి జిమ్నీ ఇటీవల తన సొంత దేశమైన జపాన్లో 'జిమ్నీ నోమేడ్' పేరుతో విడుదల అయ్యింది. జపాన్‌లో విక్రయించే 5-డోర్ జిమ్నీ భారతదేశంలో తయారు చేయబడింది మరియు ఇండియా-స్పెక్ వెర్షన్‌తో పోలిస్తే కొన్ని అదనపు ఫీచర్లు మరియు విభిన్న ఎక్ట్సీరియర్ కలర్ ఎంపికలను కలిగి ఉంది. జపాన్‌లో విడుదల అయిన వారం రోజుల్లోనే జిమ్నీ నోమేడ్ దాదాపు 50,000 బుకింగ్స్ అయ్యాయి.

సుజుకి జపాన్ జిమ్నీ నోమేడ్ SUVకి అధిక డిమాండ్ కారణంగా బుకింగ్ లను తాత్కాలికంగా నిలిపివేసింది. బుకింగ్లను తిరిగి ప్రారంభించడానికి ముందు, ఆర్డర్ చేసిన యూనిట్లను వీలైనంత త్వరగా డెలివరీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వాహన తయారీ సంస్థ పేర్కొంది.

జిమ్నీ నోమేడ్ గురించి మరింత

5-డోర్ జిమ్నీ నోమేడ్ భారతదేశం నుండి జపాన్‌కు ఎగుమతి చేయబడుతుంది కాబట్టి, డిజైన్ పరంగా ఎటువంటి వ్యత్యాసం లేదు. ఎక్ట్సీరియర్ డిజైన్‌లో పెద్ద మార్పు ఏమీ లేదు, జపాన్-స్పెక్ జిమ్నీ రెండు కొత్త కలర్ ఎంపికలను పొందుతుంది, వీటిలో చిఫాన్ ఐవరీ మెటాలిక్ (బ్లాక్ రూఫ్‌తో) మరియు జంగిల్ గ్రీన్ ఆప్షన్ ఉన్నాయి. సుజుకి ఇండియా-స్పెక్ మోడల్ యొక్క సిగ్నేచర్ కైనెటిక్ ఎల్లో షేడ్‌ను జపాన్-స్పెక్ జిమ్నీలో అందించడం లేదు.

జపాన్-స్పెక్ 5-డోర్ జిమ్నీ ఇండియా-స్పెక్ వెర్షన్ మాదిరిగానే డ్యాష్బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంది; అయితే, జపాన్-స్పెక్ మోడల్‌లోని అప్హోల్స్టరీ గ్రే మరియు బ్లాక్ కలర్‌లో ఉంటుంది. లోపల గుర్తించదగిన వ్యత్యాసం టచ్‌స్క్రీన్, ఇది ఇండియా-స్పెక్ వెర్షన్ కంటే చిన్నది.

అందించబడిన ఫీచర్లు

సుజుకి జిమ్నీ నోమేడ్‌లో హీటెడ్ ORVMలు (అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్) మరియు ఫ్రంట్ సీట్లు, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో AC వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ సూట్ ఇండియా-స్పెక్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది, అనగా ఇందులో 6 ఎయిర్ బ్యాగులు (ప్రామాణికంగా), హిల్-హోల్డ్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి, జపాన్-స్పెక్ జిమ్నీ అదనంగా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్‌ని కూడా పొందుతుంది.

ఇండియా-స్పెక్ జిమ్నీ వలె అదే ఇంజిన్

సుజుకి జిమ్నీ నోమేడ్ ఇండియా-స్పెక్ మారుతి జిమ్నీతో అందించిన అదే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే, జపాన్-స్పెక్ 5-డోర్ జిమ్నీ తక్కువ పనితీరును కలిగి ఉంది. దీని స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి.

మోడల్

జపాన్-స్పెక్ జిమ్నీ నోమేడ్

ఇండియా-స్పెక్ మారుతి జిమ్నీ

ఇంజిన్

1.5-లీటర్ నేచురల్లి అస్పిరేటెడ్ పెట్రోల్

పవర్

102 PS

105 PS

టార్క్

130 Nm

134 Nm

ట్రాన్స్మిషన్

5-స్పీడ్ MT, 4-స్పీడ్ AT

డ్రైవ్ రకం

4-వీల్-డ్రైవ్

AT - టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్

ధర శ్రేణి మరియు ప్రత్యర్థులు

జపాన్-స్పెక్ జిమ్నీ నోమేడ్

ఇండియా-స్పెక్ మారుతి జిమ్నీ

2,651,000 యెన్ నుండి 2,750,000 యెన్ (రూ. 14.86 లక్షల నుండి రూ. 15.41 లక్షలు)

రూ. 12.74 లక్షల నుంచి రూ. 14.95 లక్షలు

భారతదేశంలో, జిమ్నీ మహీంద్రా థార్ మరియు ఫోర్స్ గూర్ఖా వంటి వాటితో పోటీపడుతుంది.

ఆటోమొబైల్ ప్రపంచం నుండి తక్షణ అప్‌డేట్‌లను పొందడానికి కార్దెకో వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.

Share via

Write your Comment on Maruti జిమ్ని

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.44.90 - 55.90 లక్షలు*
Rs.75.80 - 77.80 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర