• English
    • Login / Register

    Seltos డీజిల్ మాన్యువల్ వర్షన్ ను తిరిగి పరిచయం చేసిన Kia, రూ. 12 లక్షల ధర నుండి ప్రారంభం

    కియా సెల్తోస్ కోసం shreyash ద్వారా జనవరి 22, 2024 12:58 pm ప్రచురించబడింది

    • 325 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚను తిరిగి పరిచయం చేయడంతో, కియా సెల్టోస్ డీజిల్ ప్రస్తుతం మొత్తం మూడు ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో లభిస్తుంది

    Kia Seltos

    • కియా సెల్టోస్ డీజిల్ؚను మొత్తం ఐదు వేరియెంట్ؚలలో అందిస్తున్నారు: HTE, HTK, HTK+, HTX, మరియు HTX+.

    • సెల్టోస్ 6-స్పీడ్ల డీజిల్ మాన్యువల్ వేరియెంట్ؚల ధరలు డీజిల్ iMT వేరియెంట్ؚల ధరలతో సమానంగా, రూ. 12 లక్షల నుండి 18.28 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. 

    • ఇదే డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ల టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ؚతో కూడా లభిస్తుంది. 

    • ఈ కాంపాక్ట్ SUV 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో కూడా లభిస్తుంది. 

    2023లో కియా సెల్టోస్ అనేక కొత్త ఫీచర్ؚలు మరియు నవీకరించిన భద్రత టెక్ؚతో పూర్తి మేక్ؚఓవర్ؚను పొందింది. ఇంతకు ముందులాగే అవే మూడు ఇంజన్ ఎంపికలను కొనసాగించింది, ఇందులో ఒకటి 6-స్పీడ్ల iMT (క్లచ్ పెడల్ లేకుండా మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్) లేదా 6-స్పీడ్ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ మిషన్ؚతో డీజిల్ ఇంజన్.  

    6-స్పీడ్ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో సెల్టోస్ 1.5-లీటర్ డీజిల్ వేరియెంట్ ఎంపికను కియా తిరిగి పరిచయం చేసింది, ఇది చాలా కాలం క్రితం ప్రీ-ఫేస్ లిఫ్టెడ్ మోడల్ؚతో నిలిపివేయబడింది. ఈ నవీకరణతో, సెల్టోస్ డీజిల్ ఇప్పుడు మొత్తం మూడు ట్రాన్స్ؚమిషన్ ఎంపికలను కలిగి ఉంది. ఈ ప్రకటన 2024 హ్యుందాయ్ క్రెటా విడుదల తరువాత వచ్చింది. ఈ వాహనం ఇప్పటికే డీజిల్ పవర్ؚట్రెయిన్ (రెండు SUVలలో ఒకే ఇంజన్ؚలు ) మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికను కూడా పొందింది. 

    సరికొత్త కియా సెల్టోస్ పూర్తి డీజిల్ వేరియెంట్ؚల ధరలను ఇప్పుడు చూద్దాం: 

    వేరియెంట్ 

    ధర

     

    6-MT

    6-iMT

    6-AT

    HTE

    రూ. 12 లక్షలు

    రూ. 12 లక్షలు

     

    HTK

    రూ. 13.60 లక్షలు

    రూ. 13.60 లక్షలు

     

    HTK+

    రూ. 15 లక్షలు

    రూ. 15 లక్షలు

     

    HTX

    రూ. 16.68 లక్షలు

    రూ. 16.68 లక్షలు

    రూ. 18.18 లక్షలు

    HTX+

    రూ. 18.28 లక్షలు

    రూ. 18.28 లక్షలు

     

    GTX+ (S)

       

    రూ. 19.38 లక్షలు

    X-లైన్ (S)

       

    రూ. 19.60 లక్షలు

    GTX+

       

    రూ. 19.98 లక్షలు

    X-లైన్

       

    రూ. 20.30 లక్షలు

    అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

    కియా సెల్టోస్ డీజిల్ మాన్యువల్ ధరలు రూ. 12 లక్షల నుండి ప్రారంభమై 18.28 లక్షల వరకు ఉన్నాయి. డీజిల్ iMT వేరియెంట్ؚల ధరలు కూడా సంబంధిత సెల్టోస్ మాన్యువల్ వేరియెంట్ؚల ధరలకు సమానంగా ఉన్నాయి అని గమనించగలరు.

    ఇతర ఇంజన్ & ట్రాన్స్ؚమిషన్ ఎంపికలు

    Kia Seltos Profile

    కియా సెల్టోస్ రెండు పెట్రోల్ ఇంజన్ؚల ఎంపికతో వస్తుంది: అవి 6-స్పీడ్ల మాన్యువల్ లేదా CVTతో 1.5-లీటర్ యూనిట్ (115PS/144Nm), మరియు 6-స్పీడ్ల iMT (క్లచ్ లెస్ మాన్యువల్) మరియు ఐచ్ఛిక 7-స్పీడ్ల డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ؚకు (DCT) జోడించిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (160 PS/253Nm).

    ఇది కూడా చూడండి: కొత్త హ్యుందాయ్ క్రెటా E బేస్ వేరియెంట్ కీలకమైన వివరాలను 5 చిత్రాలలో పరిశీలించండి

    ఫీచర్ؚలు & భద్రత

    Kia Seltos Interior

    డీజిల్ మాన్యువల్ వేరియెంట్ؚల పరిచయంతో సెల్టోస్ؚకు ఎటువంటి కొత్త ఫీచర్ అప్ؚడేట్ؚలు చేయలేదు. కియా కాంపాక్ట్ SUVలో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేؚలు (డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్), డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎయిర్ ప్యూరిఫయ్యర్, ఆంబియంట్ లైటింగ్, హెడ్స్-అప్ డిస్ప్లే మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలతో వస్తుంది. 

    ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్ؚబ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీల కెమెరా మరియు లేన్-కీప్ అసిస్ట్, ఫార్వార్డ్-కొలిజన్ వార్నింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అడ్వాన్సెడ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS) ఉంటాయి. 

    ధర పరిధి & పోటీదారులు

    కియా సెల్టోస్ ధర రూ. 10.90 లక్షలు మరియు 20.30 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. ఈ కాంపాక్ట్ SUVకి హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగూన్, హోండా ఎలివేట్, MG ఆస్టర్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ వంటి వాటితో పోటీ పడుతుంది. 

    ఇక్కడ మరింత చదవండి: కియా సెల్టోస్ డీజిల్

    was this article helpful ?

    Write your Comment on Kia సెల్తోస్

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience