రూ. 98,03 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన జాగ్వార్ XJ ఫేస్ లిఫ్ట్
జాగ్వార్ ఎక్స్ కోసం అభిజీత్ ద్వారా జనవరి 28, 2016 05:29 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీగా జాగ్వార్ రూ. 98,03 లక్షల(ఎక్స్-షోరూమ్ ముంబై) వద్ద దాని ఫ్లాగ్ షిప్ సెడాన్ XJ యొక్క నవీకరించబడిన వెర్షన్ ని విడుదల చేసింది. దీనిలో ముందర మరియు వెనుక భాగాలలో మార్పులు చేర్పులు చేయబడ్డాయి. అయితే, కొత్త LED బాహ్య లైటింగ్ హెడ్ల్యాంప్స్ కోసం తాజా DRL సెటప్ తో పాటు విడుదల చేశారు. ఈ విలాశవంతమైన కారు BMW 7-సిరీస్, ఆడి A8 మరియు మెర్సెడెజ్-బెంజ్ ఎస్-క్లాస్ వంటి వాటితో పోటీ పడుతుంది.
"న్యూ జాగ్వార్ XJ విలాసవంతమైన మరియు పనితీరు పెంచేందుకు రూపొందించబడింది. దాని మరింత, దృఢమైన మరియు పెద్ద లుక్ తో, కొత్త XJ నిశ్చయాత్మకంగా రోడ్డు పైన ఆధిపత్య ఉనికిని కలిగి ఉంది. దాని విలాసవంతమైన ఇంటీరియర్స్, శక్తివంతమైన ఇంజిన్ మరియు తాజా సాంకేతికత వినియోగదారులకు మరింత అనుభవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది." అని జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశం లిమిటెడ్, అధ్యక్షుడు, రోహిత్ సూరి అన్నారు.
ఈ లగ్జరీ సెడాన్ క్రింది విధంగా తక్కువ ధర పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందించబడుతుంది
- జాగ్వార్ XJ 2.0L (177 kW) పెట్రోల్ పోర్ట్ఫోలియో: రూ. 99,23 లక్షలు
- జాగ్వార్ XJ 3.0L (221 kW) డీజిల్ ప్రీమియం లగ్జరీ: రూ. 98,03 లక్షలు
- జాగ్వార్ XJ 3.0L (221 kW) డీజిల్ పోర్ట్ఫోలియో: రూ. 105,42 లక్షలు
ఈ రెండు మోటార్లు నమ్మకమైన త్వరణం మరియు ప్రదర్శన అందిస్తుంది. పెట్రోల్ మోటార్ తో XJ 0-100kmph చేరుకొనేందుకు 7.9 సెకన్లలో చేరుకుంటుంది, డీజిల్ వెర్షన్లు అయితే 6.2 సెకన్లలో చేరుకుంటుంది.
ఈ కారు పాత XJ అదే నైపుణ్యంతో మరియు DRLs తో పాటూ ముందర గ్రిల్ మార్పు చేయబడి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. దీని బాహ్య భాగాలు ఒక ఏకైక 'టీ డ్రాప్' ఆకరంతో కారు యొక్క ఏరోడైనమిక్ లక్షణాలు మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది.
అంతర్భాగాలలో, రీ-కాలిబ్రేట్ మరియు పునఃరూపకల్పన బహుళ లేయర్డ్ వర్చువల్ ప్రదర్శన వంటి మార్పులు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక ఆధునిక డ్రైవింగ్ అనుభవాన్ని అందించే ఒక 20,32cm టచ్ స్క్రీన్ డిస్ప్లే తో పూర్తిగా డిజిటల్ గా ఉంది. వినపడే అనుభవం మెరిడియన్ సంగీతం వ్యవస్థ ద్వారా తీసుకోబడింది.
ఇంకా చదవండి జాగ్వార్ ఎఫ్-టైప్ SVR బహిర్గతం
0 out of 0 found this helpful