• English
  • Login / Register

ఫిబ్రవరి 3 న ప్రారంభమవబోతున్న జాగ్వార్ ఎక్స్ ఈ, బుకింగ్స్ ప్రారంభం

జాగ్వార్ ఎక్స్ఈ 2015-2019 కోసం akshit ద్వారా జనవరి 13, 2016 03:02 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా సొంతమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్, రాబోయే ఢిల్లీ ఆటో ఎక్స్పో వద్ద ఫిబ్రవరి 3 వ తేదీన దాని ఎకనామికల్ ఉత్పత్తి అయిన ఎక్స్ ఈ సెడాన్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ఈ వాహన బుకింగ్స్ ను కూడా భారతదేశం అంతటా కంపెనీ డీలర్ నెట్వర్క్ అంతటా మొదలుపెట్టారు.

ప్రారంభమైనప్పుడు, ఎక్స్ ఈ వాహనం 2 పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉండబోతుంది మరియు ఈ రెండు ఇంజన్ లు కూడా నాలుగు సిలండర్లు మరియు విబిన్న పవర్ ఉత్పత్తు లను అందించే టర్బోచార్జర్ లను కలిగి ఉంటాయి. అవి వరుసగా ఒక ఇంజన్, అత్యధికంగా 200 పి ఎస్ పవర్ ను అదే విధంగా 320 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరొక ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 240 పి ఎస్ పవర్ ను అదే విధంగా 340 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశం లిమిటెడ్ (జె ఎల్ ఆర్ ఐ ఎల్) అధ్యక్షుడు అయిన రోహిత్ సూరి మాట్లాడుతూ, "ఈ విభాగంలో ఎన్నడూ చూడనటువంటి విధంగా ఈ అన్ని కొత్త జాగ్వార్ ఎక్స్ ఈ వాహనాలు ఆవిష్కరణ స్థాయీలను ప్రదర్శిస్తాయి. అసాధారణ జాగ్వార్ స్పోర్ట్స్ సలూన్ వాహనాల యొక్క మంచి సంస్థ నుండి వస్తాయి మరియు ఈ వాహనాలు తప్పకుండా ప్రయాణికులకు ఉత్కంటబరిత ప్రదర్శనను అందిస్తాయి. అంతేకాకుండా, డైనమిక్ డిజైన్ ప్రావీణ్యత కోసం ఒక కొత్త ప్రామాణిక సెట్ తో వస్తుంది మరియు ఈ విభాగంలో ఒక మంచి ప్రదర్శనతో వస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి లో అన్ని కొత్త జాగ్వార్ వాహనాలు పెట్రోల్ ఇంజన్ తో ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ వాహనాలు వీటి యొక్క లైనప్ లోకి రాబోతున్నాయి మరియు భారతదేశం లో జాగ్వార్ యొక్క ఉత్పత్తి అందించే విస్తరణలో గణనీయ మైలురాయి ని దాటబోతున్నాయి" అని వ్యాఖ్యానించారు.

ఈ ఎక్స్ ఈ వాహనం అనునది, జాగ్వార్ యొక్క డిజైన్ ప్రధాన ఇయాన్ కల్లమ్ యొక్క రూపకల్పన మరియు బ్రిటీష్ కారు తయారీదారుడు యొక్క 'కొత్తగా అభివృద్ధి చేయబడిన అల్యూమినియం నిర్మాణం ఆధారంగా రూపొందించబడింది. ఈ వాహనం యొక్క శరీర నిర్మాణం, ఈ సంస్థ యొక్క లైనప్ లో ఇప్పటికే ఉన్న ఎఫ్ టైప్ వాహన డిజైన్ ఆధారంగా ఉంటుంది. సంస్థ ప్రకారం ఈ వాహనం కొత్త అల్యూమినియం అల్లాయ్ వీల్స్ తో రాబోతుంది. వీటన్నింటితో పాటు ఈ జాగ్వార్ ఎక్స్ ఈ వాహనం, అత్యంత ఏరోడైనమిక్ శరీర నిర్మాణం తో రాబోతుంది మరియు కేవలం 0.26 డ్రాగ్ గుణాంకంతో ఉంటుంది.

ఈ జాగ్వార్ ఎక్స్ ఈ వాహనం యొక్క ధర సుమారు రూ 35 లక్షలు మరియు ఈ వాహనం ప్రస్తుతం బిఎండబ్ల్యూ 3 సిరీస్ అలాగే మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ మరియు ఆడి ఏ 4 వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వబోతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Jaguar ఎక్స్ఈ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience